Ananya Panday: రకుల్ ప్రీత్ పెళ్లిలో మెరిసిన లైగర్ భామ.. అనన్య పాండే చీర ధర ఎంతో తెలుసా?-ananya panday saree price in rakul preet singh jackky bhagnani marriage ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ananya Panday Saree Price In Rakul Preet Singh Jackky Bhagnani Marriage

Ananya Panday: రకుల్ ప్రీత్ పెళ్లిలో మెరిసిన లైగర్ భామ.. అనన్య పాండే చీర ధర ఎంతో తెలుసా?

Sanjiv Kumar HT Telugu
Feb 22, 2024 02:14 PM IST

Ananya Panday Saree Price At Rakul Preet Marriage: రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీల పెళ్లి వేడుకలో లైగర్ భామ అనన్య పాండే అందమైన ఎంబ్రాయిడరీ చీరలో మెరిసింది. అర్పితా మెహతా డిజైన్ చేసిన ఈ ఎంబ్రాయిడరీ చీర ధర ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

రకుల్ ప్రీత్ పెళ్లిలో మెరిసిన లైగర్ భామ.. అనన్య పాండే చీర ధర ఎంతో తెలుసా?
రకుల్ ప్రీత్ పెళ్లిలో మెరిసిన లైగర్ భామ.. అనన్య పాండే చీర ధర ఎంతో తెలుసా? (Instagram/@ananyapanday)

Ananya Panday Arpita Mehta Saree Cost: బుధవారం (ఫిబ్రవరి 21) గోవాలో టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహం వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు భూమి పెడ్నేకర్, షాహిద్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, ఇషా డియోల్, ఆయుష్మాన్ ఖురానా, తాహిరా కశ్యప్ వంటి ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. వారిలో లైగర్ హీరోయిన్, బాలీవుడ్ హాట్ బ్యూటి అనన్య పాండే కూడా ఉంది. రకుల్ పెళ్లి వేడుకలో అనన్య పాండే అందరి దృష్టిని ఆకర్షించింది.

అనన్య పాండే ఎప్పుడు పూర్తి ఫ్యాషన్‌తో వేడుకలకు హాజరవుతూ ఉంటుంది. ఎల్లప్పుడూ తన తళుక్కుమనే లుక్స్‌, స్టైల్‌తో బెంచ్ మార్క్ సెట్ చేస్తుంటుంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ వివాహపు మహోత్సవంలో కూడా అనన్య పాండే ఆరు గజాల చీరలో అదిరిపోయే గ్రేస్‌తో మెరిసిపోయింది. అనన్య పాండే గ్లామరస్ వెడ్డింగ్ లుక్ పెళ్లిలో ఎంతో ఆకట్టుకుంది. అందాల యువరాణిలా కనిపించిన అనన్య పాండే బంగారు చీరలో గ్లామర్, చిక్ వైబ్స్‌తో అదరగొట్టింది.

ముద్దుగుమ్మ అనన్య పాండే తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో, ఆశ్చర్యపోయే అందంతో అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. తాజాగా అనన్య పాండే స్టన్నింగ్ లుక్‌ను డీకోడ్ చేశారు ఫ్యాషన్ నిపుణులు. బుధవారం అనన్య తన అభిమానులకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇస్తూ తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో సరికొత్త ఫొటోలను షేర్ చేసింది. 'చుట్టూ ప్రేమతో చంద్రుడి కింద సూర్యుడిని అనుభూతి చెందుతున్నాను' అంటూ రాసుకొచ్చిన క్యాప్షన్‌తో ఈ గ్లామరస్ ఫోటోలను అప్‌లోడ్ చేసింది అనన్య పాండే.

ఈ ఫొటోల్లో అనన్య పాండే అద్భుతమైన న్యూడ్ షిమ్మర్ చీరను ధరించి అట్రాక్ట్ చేసింది. ఇది సంక్లిష్టమైన గోల్డెన్ హ్యాండ్ ఎంబ్రాయిడరీతో అందమైన ఫ్యాబ్రిక్ ఎంబ్రాయిడరీని కలిగి ఉంది. అయితే ఈ చీరకున్న బార్డర్‌‌ను బంగారు సీక్విన్ డీటెల్స్‌తో భారీగా అలంకరించారు. ఆమె చీర కింది భాగంలో మూడంచెల ఫ్రిల్ అలంకరణ చేశారు. ఇలాంటి చీరను అందంగా కప్పుకుని.. పల్లును తన భుజాల మీద నుంచి అందంగా జారవిడిచింది అనన్య పాండే.

బ్యూటిఫుల్ గోల్డెన్ ఎంబ్రాయిడరీ, సీక్విన్స్‌తో అలంకరించిన గోల్డెన్ బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్‌తో అనన్య పాండే చీరలో తళుక్కుమంది. దీంతో అనన్య పాండే ఫొటోలు నెట్టింట్లో అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో అనన్య పాండే ధరించిన చీరపై అందరి దృష్టి పడింది. దాంతో దాని ఖరీదు ఎంత అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. అనన్య పాండే ధరించిన ఈ చీర ఖరీదు సుమారు రూ. 1.70 లక్షలు అని సమాచారం. ఈ చీరను ప్రముఖ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేసిందని తెలుస్తోంది.

ఇప్పుడు సోషల్ మీడియాలో అనన్య పాండే చీర, దాని ఖరీదు హాట్ టాపిక్ అవుతోంది. ఇదిలా ఉంటే, అనన్య పాండే ఈ చీరతోపాటు కావాల్సిన యాక్ససరీలు అతి తక్కువగా ధరించింది. ఒక జత కుందన్ చెవిపోగులు, మణికట్టును అలంకరించే డైమండ్ బ్రాస్లెట్, ఒక జత బంగారు మడమలతో అందంగా రెడీ అయింది. అనన్య పాండే గ్లామర్ మేకప్‌లో మెరిసే ఐషాడో, మస్కారా-కర్ల్‌డ్ కనురెప్పలు, ఐ ఐలైనర్, బ్లాక్ షేడ్స్ ఐ బ్రోస్, మెరిసేలా పింక్ కలర్ బుగ్గలు, మెరిసేలా హైలైటర్, డ్యూయి ఫౌండేషన్, న్యూడ్ లిప్ స్టిక్ షేడ్‌తో అలంకరించుకుంది.

Ananya Pandey's saree is from the brand Arpita Mehta and costs  <span class='webrupee'>₹</span>170, 500 lakh.
Ananya Pandey's saree is from the brand Arpita Mehta and costs ₹170, 500 lakh. (shopkynah.com)
WhatsApp channel