Koffee With Karan 8: అనన్య పాండేతో డేటింగ్ రూమర్లపై స్పందించిన బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్.. వెరైటీ ఆన్సర్-koffee with karan 8 aditya roy kapur reacts on dating rumours with ananya panday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Koffee With Karan 8: అనన్య పాండేతో డేటింగ్ రూమర్లపై స్పందించిన బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్.. వెరైటీ ఆన్సర్

Koffee With Karan 8: అనన్య పాండేతో డేటింగ్ రూమర్లపై స్పందించిన బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్.. వెరైటీ ఆన్సర్

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 11, 2023 02:08 PM IST

Koffee With Karan 8: అనన్య పాండేతో డేటింగ్ రూమర్లపై బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌కు కాఫీ విత్ కరణ్‍లో ప్రశ్న ఎదురైంది. దీంతో అతడు స్పందించారు. మాట దాటేసేలా ఓ ఆన్సర్ చెప్పారు. వివరాలివే..

ఆదిత్య రాయ్ కపూర్
ఆదిత్య రాయ్ కపూర్

Koffee With Karan 8: బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్, హీరోయిన్ అనన్య పాండే ప్రేమలో ఉన్నారంటూ చాలా కాలంగా రూమర్లు వస్తున్నాయి. వీరిద్దరూ డేటింగ్‍లో ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. చాలాసార్లు వీరిద్దరూ కలిసి పార్టీలకు, ఈవెంట్లకు హాజరవుతున్నారు. జంటగా కెమెరాలకు చిక్కారు. అయితే, రూమర్లపై మాత్రం మౌనంగానే ఉంటున్నారు. తాజాగా, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తున్న టాక్ షో ‘కాఫీ విత్ కరణ్ 8’కు ఆదిత్య రాయ్ కపూర్ వచ్చారు.

కాఫీ విత్ కరణ్ 8వ సీజన్ తదుపరి ఎపిసోడ్‍కు ఆదిత్య రాయ్ కపూర్‌తో పాటు హీరో అర్జున్ కపూర్ కూడా వచ్చారు. ఈ ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమోను డిస్నీ+ హాట్‍స్టార్ వెల్లడించింది. పెళ్లి కానీ బాయ్స్ వచ్చేశారని కరణ్ అన్నారు. ఆ తర్వాత అనన్య పాండేతో డేటింగ్ రూమర్ల గురించి ఆదిత్యను ప్రశ్నించారు.

“అనన్య పాండేతో నువ్వు డేటింగ్ చేస్తున్నావని రూమర్లు వస్తున్నాయి” అని ఆదిత్య రాయ్ కపూర్‌ను కరణ్ జోహార్ అడిగారు. దీంతో “మీరు నన్ను రహస్యాలు అడగొద్దు.. నేను మీకు అబద్ధాలు చెప్పను” అని ఆదిత్య బదులిచ్చారు. రూమర్లు నిజమా.. కాదా అని చెప్పకుండా మాట దాటేసేలా వెరైటీ ఆన్సర్ ఇచ్చారు. మూవింగ్ ఆన్ అంటూ వేరే విషయాలు అడగాలని ఆదిత్య కపూర్ చెప్పారు. మొత్తానికి డేటింగ్ రూమర్లపై మరోసారి స్పష్టతనివ్వలేదు.

గతనెల కాఫీ విత్ కరణ్ 8 టాక్‍ షోకు లైగర్ భామ అనన్య పాండే, సారా అలీ ఖాన్ వచ్చారు. అయితే, ఆదిత్య తనకు మంచి ఫ్రెండ్ అని అనన్య అంగీకరించారు. అయితే, రిలేషన్ గురించి అడిగితే అవునని, కాదని ఏమీ చెప్పలేదు. సస్పెన్స్‌లో ఉంచారు. ఇప్పుడు ఆదిత్య రాయ్ కపూర్ కూడా అలాంటి సమాధానాన్నే చెప్పారు. దీంతో.. ఏమీ చెప్పకున్నా ఆదిత్య, అనన్య ప్రేమలో ఉన్నారని నెటిజన్లు మరోసారి కామెంట్లు చేస్తున్నారు.

కాఫీ విత్ కరణ్ 8 షోలో ఆదిత్య రాయ్ కపూర్, అర్జున్ కపూర్ పాల్గొనే ఎపిసోడ్ డిసెంబర్ 14వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుంది. ఈ ఎనిమిదో సీజన్ అక్టోబర్ 26న మొదలైంది. ప్రతీ గురువారం కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్‍కు వస్తోంది.