Ponniyin Selvan Advance Bookings: పొన్నియిన్‌ సెల్వన్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌.. విక్రమ్‌ రికార్డు బ్రేక్‌-ponniyin selvan advance bookings create record in tamilnadu
Telugu News  /  Entertainment  /  Ponniyin Selvan Advance Bookings Create Record In Tamilnadu
పొన్నియిన్ సెల్వన్ మూవీ ప్రమోషన్లలో జయం రవి, విక్రమ్, ఏఆర్ రెహమాన్, మణిరత్నం, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తీ
పొన్నియిన్ సెల్వన్ మూవీ ప్రమోషన్లలో జయం రవి, విక్రమ్, ఏఆర్ రెహమాన్, మణిరత్నం, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తీ (PTI)

Ponniyin Selvan Advance Bookings: పొన్నియిన్‌ సెల్వన్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌.. విక్రమ్‌ రికార్డు బ్రేక్‌

26 September 2022, 18:39 ISTHT Telugu Desk
26 September 2022, 18:39 IST

Ponniyin Selvan Advance Bookings: పొన్నియిన్‌ సెల్వన్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ మేకర్స్‌కు ఎంకరేజింగ్‌గా ఉన్నాయి. ఈ మూవీ ఏకంగా ఈ ఏడాది సూపర్‌ హిట్‌ మూవీ విక్రమ్‌ రికార్డు బ్రేక్‌ చేయడం విశేషం.

Ponniyin Selvan Advance Bookings: పాన్‌ ఇండియా స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం కలల ప్రాజెక్ట్‌ పొన్నియిన్‌ సెల్వన్‌. ఈ మూవీ ఫస్ట్‌ పార్ట్‌ పీఎస్‌ 1 సెప్టెంబర్ 30న రిలీజ్‌ కాబోతోంది. అయితే ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఆదివారం (సెప్టెంబర్‌ 25) ప్రారంభమయ్యాయి. తొలి రోజే వీటికి ఆడియెన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ముఖ్యంగా ఈ ఏడాది సంచలనం రేపిన కమల్‌ హాసన్‌ విక్రమ్‌ మూవీ రికార్డును కూడా ఈ పొన్నియిన్‌ సెల్వన్‌ బ్రేక్‌ చేసింది. కోలీవుడ్‌లో ఈ ఏడాది అత్యధిక అడ్వాన్స్‌ బుకింగ్స్‌ అందుకున్న మూడో మూవీగా నిలిచింది. బీస్ట్‌, వలీమై తర్వాత పొన్నియిన్‌ సెల్వన్‌ నిలవడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై కొన్నేళ్లుగా పని చేస్తున్న మణిరత్నమే శుభాకరన్‌తో కలిసి సినిమాను నిర్మించాడు.

అడ్వాన్స్‌ బుకింగ్స్‌ రికార్డు

పొన్నియిన్‌ సెల్వన్‌ మూవీకి తమిళనాడులో ఆదివారమే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. తొలి రోజే రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. ఈ అడ్వాన్స్ బుకింగ్స్‌ ద్వారా రూ.4.5 కోట్లు వసూలు చేసింది. 225 థియేటర్లలో మాత్రమే ఈ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. ఇక మిగతా థియేటర్లు కూడా మొదలుపెడితే ఈ బుకింగ్స్‌ మరింత భారీగా ఉండనున్నాయి.

ఈ ఏడాది విక్రమ్‌ మూవీ ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు కదా. అలాంటి మూవీ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ను కూడా పొన్నియిన్‌ సెల్వన్‌ బీట్‌ చేసింది. ఈ పీరియడ్‌ డ్రామా మూవీ భారీ తారాగణంతో వస్తోంది. విక్రమ్‌, కార్తీ, ఐశ్వర్య రాయ్‌, త్రిష, జయం రవిలాంటి వాళ్లు పొన్నియిన్‌ సెల్వన్‌లో నటించారు. ఈ సినిమా ప్రమోషన్లలో వీళ్లంతా బిజీగా ఉన్నారు. బెంగళూరు, ముంబైలతోపాటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సినిమా ప్రమోషన్లను చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు.

పొన్నియిన్ సెల్వన్ గురించి..

ఈ భారీ ప్రాజెక్టును 1950లో ధారావాహికంగా వచ్చిన కల్కికి చెందిన నవల ఆధారంగా రూపొందిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్(కావేరి నది కుమారుడు) చోళుల రారాజైన రాజ రాజ చోళకు చెందిందిగా చెబుతున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేస్తున్నారు.

సెప్టెంబరు 30 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పొన్నియిన్‌ సెల్వన్‌ ప్రాజెక్ట్‌లో ఇది తొలి పార్ట్‌ మాత్రమే. అయితే ఈ సినిమాను ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లోనూ రిలీజ్‌ చేస్తున్నారు. ఇలా ఐమ్యాక్స్‌లో రిలీజ్‌ కాబోతున్న తొలి తమిళ సినిమాగా పొన్నియిన్‌ సెల్వన్‌ నిలవనుంది.