Ponniyin Selvan Trailer: విజువల్ వండర్ పొన్నియిన్ సెల్వన్.. ట్రైలర్ అదుర్స్-ponniyin selvan trailer and audio launched ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ponniyin Selvan Trailer And Audio Launched

Ponniyin Selvan Trailer: విజువల్ వండర్ పొన్నియిన్ సెల్వన్.. ట్రైలర్ అదుర్స్

Hari Prasad S HT Telugu
Sep 06, 2022 11:35 PM IST

Ponniyin Selvan Trailer: మచ్‌ అవేటెడ్ మణిరత్నం మూవీ పొన్నియిన్‌ సెల్వన్‌ ట్రైలర్‌ లాంచ్‌ అయింది. మంగళవారం (సెప్టెంబర్‌ 6) రాత్రి 11 గంటల తర్వాత ఈ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు.

పొన్నియిన్ సెల్వన్ మూవీలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష
పొన్నియిన్ సెల్వన్ మూవీలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష

Ponniyin Selvan Trailer: మణిరత్నం కలల ప్రాజెక్ట్‌ పొన్నియిన్‌ సెల్వన్‌ 1 ట్రైలర్‌ మంగళవారం (సెప్టెంబర్‌ 6) లాంచ్‌ అయింది. తమిళ ఫిల్మ్‌ ఇండస్ట్రీకి చెందిన బిగ్గెస్ట్‌ స్టార్స్‌ అందరూ తరలి వచ్చి ఈ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. ఊహించినట్లే ఈ ట్రైలర్‌ విజువల్‌ వండర్‌గా కనిపిస్తోంది. ఏఆర్‌ రెహమాన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఈ ట్రైలర్‌ను మరింత అద్భుతంగా మార్చింది.

విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌, కార్తీ, జయం రవి, త్రిషలాంటి వాళ్లు నటించిన ఈ మూవీ అంచనాలను అందుకునేలా ఉందని ఈ ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో ఆ భారీతనం కనిపిస్తోంది. ఏకంగా 3 నిమిషాల 23 సెకన్ల నిడివితో పొన్నియిన్‌ సెల్వన్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఐశ్వర్యరాయ్ అందం, అభినయం.. విక్రమ్, కార్తీ నటన మూవీకి హైలైట్ కానుంది.

చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఈ ట్రైలర్‌, ఆడియో లాంచ్‌కు తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన అతిరథ మహారథులు తరలివచ్చారు. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌లతోపాటు ఈ మూవీ స్టార్లు విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌, త్రిష స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు.

ఈ భారీ ప్రాజెక్టును 1950లో ధారావాహికంగా వచ్చిన కల్కికి చెందిన నవల ఆధారంగా రూపొందిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్(కావేరి నది కుమారుడు) చోళుల రారాజైన రాజ రాజ చోళకు చెందిందిగా చెబుతున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేస్తున్నారు. సెప్టెంబరు 30 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పొన్నియిన్‌ సెల్వన్‌ ప్రాజెక్ట్‌లో ఇది తొలి పార్ట్‌ మాత్రమే. అయితే ఈ సినిమాను ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లోనూ రిలీజ్‌ చేస్తున్నారు. ఇలా ఐమ్యాక్స్‌లో రిలీజ్‌ కాబోతున్న తొలి తమిళ సినిమాగా పొన్నియిన్‌ సెల్వన్‌ నిలవనుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.