PS-1 Pre Release Event: 'పొన్నియిన్ సెల్వన్ మన రక్తం.. మన వాళ్ల కథ.. మణిరత్నం 40 ఏళ్ల కల'-ponniyin selvan pre release event will held in hyderabad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ponniyin Selvan Pre Release Event Will Held In Hyderabad

PS-1 Pre Release Event: 'పొన్నియిన్ సెల్వన్ మన రక్తం.. మన వాళ్ల కథ.. మణిరత్నం 40 ఏళ్ల కల'

Maragani Govardhan HT Telugu
Sep 24, 2022 06:16 AM IST

PS-1 Pre Release event: మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుహాసిని మణిరత్నం, విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు విడుదల చేయనున్నారు.

పొన్నిియిన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్
పొన్నిియిన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్

Ponniyin Selvan Pre Release event: ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan). రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా తొలి భాగం పీఎస్-1 సెప్టెంబరు 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత దూళిపాల తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిదింది. తెలుగులో ఈ సినిమాను దిల్‌ రాజు విడుదల చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్తి మాట్లాడుతూ.. "ఇలాంటి సినిమా చేసేటప్పుడే సినిమా ఎంత గొప్ప మీడయమే అర్థమవుతుంది. ఈ సినిమా బాహుబలిలా ఉంటుందా? అని అడుగుతున్నారు. ఒక బాహుబలి చూశాం. ఇంకో బాహుబలి అవసరం లేదు. ఇండియాలో ఎన్నో కథలు ఉన్నాయి. వాటిని మనం ప్రజలకు చెప్పాలి. అలాంటి ఓ కథే ఇది. ఇలాంటి ఓ గొప్ప సినిమాను మీరు తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం ఉంది" అని కార్తి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో విక్రమ్ మాట్లాడుతూ.. "నాన్న, అపరిచితుడు, ఇలా ఒక్కొక్క భావోద్వేగం నచ్చుతుంది. ఈ సినిమాలో గుర్రుపై వచ్చే ఒక్క షాట్ చాలు అనిపించింది. ఈ చిత్రంలో అందరూ హీరోలో, హీరోయిన్లే. నా కలల దర్శకుడు మణిరత్నం ఎంతో అద్భుతంగా పాత్రలను తీర్చిదిద్దారు" అని విక్రమ్ అన్నారు.

మణిరత్నం భార్య అయిన సుహాసిని మాట్లాడుతూ.. "పెళ్లికి ముందు మణిరత్నం గారు నాకు ఓ బహుమానం ఇచ్చారు. పొన్నియిన్ సెల్వన్ నవలలు ఇచ్చి చదివి, లైన్‌గా రాసి ఇవ్వు అన్నారు. ప్రతీ ఛాప్టర్ రాసి ఒక్కొక్క లైన్ రాసి ఇచ్చా. వన్ లైన్ ఆర్డర్ అంటే ఇలాగా రాసేది అన్నారు. పెళ్లి చేసుకోరేమో అనకున్నా. 34 ఏళ్ల తర్వాత ఆయన ఈ సినిమా చేశారు. తెలుగు ప్రేక్షకులు 42 ఏళ్లుగా నాపై ప్రేమను చూపిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నా." అని సుహాసిని తెలిపారు.

"38 ఏళ్లుగా తెలుగులో పనిచేస్తున్నా. రమేశ్ నాయుడు, చక్రవర్తి, రాజ్ కోటి, సత్యం ఇలా వీళ్లందరితో కలిసి చేసే ప్రయాణంలో నా కెరీర్‌కు పునాదులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత నేను ఓటీటీల్లో సినిమాలు చూడటం మానేశాను. మన సంస్కృతి, మన రక్తం, మనవాళ్లు చేసిన సినిమా ఇది. గొప్పగా ఉంది" అని ఏఆర్ రెహమాన్ అన్నారు.

పదో శతాబ్దానికి చెందిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, శరత్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మీ, రెహమాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ భారీ ప్రాజెక్టును 1950లో ధారావాహికంగా వచ్చిన కల్కికి చెందిన నవల ఆధారంగా రూపొందిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్(కావేరి నది కుమారుడు) చోళుల రారాజైన రాజ రాజ చోళకు చెందిందిగా చెబుతున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేస్తున్నారు. సెప్టెంబరు 30 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం