OTT Releases in March 2024: హనుమాన్ నుంచి మహారాణి 3 వరకు.. మార్చిలో ఓటీటీల్లోకి వచ్చే టాప్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే-ott releases in march 2024 hanuman ott release date eagle maharani 3 merry christmas in netflix hotstar zee5 sony liv ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ott Releases In March 2024 Hanuman Ott Release Date Eagle Maharani 3 Merry Christmas In Netflix Hotstar Zee5 Sony Liv

OTT Releases in March 2024: హనుమాన్ నుంచి మహారాణి 3 వరకు.. మార్చిలో ఓటీటీల్లోకి వచ్చే టాప్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే

Hari Prasad S HT Telugu
Feb 26, 2024 12:46 PM IST

OTT Releases in March 2024: ఓటీటీల్లోకి మార్చి నెలలో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. వీటిలో హనుమాన్ మూవీ, మహారాణి 3లాంటి వెబ్ సిరీస్ ఉన్నాయి.

హనుమాన్ నుంచి మహారాణి 3 వరకూ మార్చి నెలలో ఓటీటీలోకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే
హనుమాన్ నుంచి మహారాణి 3 వరకూ మార్చి నెలలో ఓటీటీలోకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

OTT Releases in March 2024: ఓటీటీ అభిమానులకు గుడ్ న్యూస్. వచ్చే మార్చి నెలలో ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ ఓటీటీల్లోకి వస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, సోనీలివ్ లాంటి ఓటీటీల్లో హనుమాన్, మహారాణి 3, ఫైటర్ లాంటి సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. ఏ సినిమా, వెబ్ సిరీస్ ఏ రోజున, ఏ ఓటీటీలో రాబోతోందో ఒకసారి చూద్దాం.

హనుమాన్ - జీ5 (మార్చి 2)

ఈ ఏడాది టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడాలేకుండా పెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచిన మూవీ హనుమాన్. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా మొత్తానికి మార్చి 2న జీ5 ఓటీటీలోకి రాబోతోంది. ఇప్పటికే సంక్రాంతి సినిమాలన్నీ ఓటీటీల్లోకి రాగా.. హనుమాన్ ఆలస్యంగా వచ్చే నెలలో వస్తోంది.

ఈగల్ - ఈటీవీ విన్ (మార్చి 2న రావచ్చు)

మాస్ మహారాజా రవితేజ నటించి ఈగల్ మూవీ ఫిబ్రవరి 9న రిలీజైంది. అయితే సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో ఈగల్ మూవీ నెల లోపే అంటే మార్చి 2 నుంచే ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమయ్యే అవకాశాలు ఉన్నాయి.

మహారాణి సీజన్ 3 - సోనీలివ్ (మార్చి 7)

తొలి రెండు సీజన్లతో ఎంతగానో అలరించిన మహారాణి వెబ్ సిరీస్ ఇప్పుడు మూడో సీజన్ తో రాబోతోంది. మార్చి 7 నుంచి ఈ సిరీస్ కొత్త సీజన్ సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ బాగా ఆకట్టుకుంది.

ఫైటర్ - నెట్‌ఫ్లిక్స్ (మార్చి 21)

హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ నటించిన ఫైటర్ మూవీ జనవరి 25న థియేటర్లలో రిలీజైంది. సిద్ధార్థ్ ఆనంద్ గత సినిమాల స్థాయిలో వసూళ్లు సాధించకపోయినా.. మూవీకి పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. ఈ సినిమా మార్చి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

సన్‌ఫ్లవర్ సీజన్ 2 - జీ5 (మార్చి 1)

జీ5 ఓటీటీలో గతంలో వచ్చిన సన్ ఫ్లవర్ వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సునీల్ గ్రోవర్ నటించిన ఈ సిరీస్ ఇప్పుడు సరికొత్త సీజన్ తో రాబోతోంది. సన్ ఫ్లవర్ సీజన్ 2 మార్చి 1 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

మెర్రీ క్రిస్మస్ - నెట్‌ఫ్లిక్స్ (మార్చి 8)

విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ మెర్రీ క్రిస్మస్ కు మంచి రివ్యూలే వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇప్పుడీ సినిమా మార్చి 8 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

షోటైమ్ - డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (మార్చి 8)

బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి వివిధ ఇంట్రెస్టింగ్ అంశాలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ షోటైమ్. తెర వెనుక స్టార్ల జీవితం, ఓ సినిమా లేదా సిరీస్ షూటింగ్ ఎలా జరుగుతుందన్న అంశాలను దీని ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

యే వతన్ మేరే వతన్ - ప్రైమ్ వీడియో (మార్చి 21)

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ నటించిన యే వతన్ మేరే వతన్ మూవీ నేరుగా ఓటీటీలోకి వస్తోంది. భారతదేశ స్వతంత్ర సమరయోధురాలు ఉషా మెహతా జీవిత కథ స్ఫూర్తిగా ఈ మూవీ తెరకెక్కింది.

IPL_Entry_Point