Merry Christmas OTT Release: ఓటీటీలోకి విజ‌య్ సేతుప‌తి, క‌త్రినాకైఫ్ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌-merry christmas ott release date when and where to watch vijay sethupathi bollywood movie on ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Merry Christmas Ott Release: ఓటీటీలోకి విజ‌య్ సేతుప‌తి, క‌త్రినాకైఫ్ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌

Merry Christmas OTT Release: ఓటీటీలోకి విజ‌య్ సేతుప‌తి, క‌త్రినాకైఫ్ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 13, 2024 11:21 AM IST

Merry Christmas OTT Release: విజ‌య్ సేతుప‌తి, క‌త్రినా కైఫ్ జంట‌గా న‌టించిన బాలీవుడ్ మూవీ మెర్రీ క్రిస్మ‌స్ ఓటీటీలోకి రాబోతుంది. మార్చి 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానుంది.

మెర్రీ క్రిస్మ‌స్ ఓటీటీ రిలీజ్ డేట్‌
మెర్రీ క్రిస్మ‌స్ ఓటీటీ రిలీజ్ డేట్‌

Merry Christmas OTT Release: విజ‌య్ సేతుప‌తి బాలీవుడ్ మూవీ మెర్రీ క్రిస్మ‌స్ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ బాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్‌ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ది. మార్చి 8న మెర్రీ క్రిస్మ‌స్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం. హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. త్వ‌ర‌లోనే మెర్రీ క్రిస్మ‌స్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు తెలిసింది.

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌...

మెర్రీ క్రిస్మ‌స్ మూవీ జ‌న‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తికి జోడీగా క‌త్రినా కైఫ్ హీరోయిన్‌గా న‌టించింది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి, క‌త్రినాకైఫ్ యాక్టింగ్‌తో పాటు శ్రీరామ్ రాఘ‌వ‌న్ టేకింగ్‌, విజువ‌ల్స్, బ్యాక్‌డ్రాప్‌పై ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. కానీ సింపుల్ స్టోరీలైన్ కార‌ణంగా క‌మ‌ర్షియ‌ల్‌గా ఫెయిల్యూర్‌గా ఈ మూవీ నిలిచింది.

శ్రీరామ్ రాఘ‌వ‌న్ క్రేజ్‌...

శ్రీరామ్ రాఘ‌వ‌న్ మూవీస్‌కు ఉన్న క్రేజ్ కార‌ణంగా ఓటీటీ బిజినెస్ మాత్రం భారీ స్థాయిలో జ‌రిగిన‌ట్లు స‌మాచారం. దాదాపు అర‌వై కోట్ల‌కు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ది. యాభై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ డిజిట‌ల్ రైట్స్‌తోనే లాభాల్లోకి అడుగుపెట్టిన‌ట్లు స‌మాచారం. సంక్రాంతి పోటీ కార‌ణంగా థియేట‌ర్ల‌లో అనుకున్న స్థాయిలో ఈ మూవీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌లేక‌పోయింది. 20 కోట్ల‌లోపే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది.

ఫ్రెంచ్ న‌వ‌ల బ‌ర్డ్ ఇన్ ఏ కేజ్ ఆధారంగా ద‌ర్శ‌కుడు శ్రీరామ్ రాఘ‌వ‌న్‌ మెర్రీ క్రిస్మ‌స్ మూవీని తెర‌కెక్కించాడు. డైరెక్ట‌ర్‌గా శ్రీరామ్ రాఘ‌వ‌న్ కెరీర్‌లో అత్య‌ధిక ఐఎమ్‌డీబీ ర్యాంక్‌ను ద‌క్కించుకున్న మూవీగా మెర్రీ క్రిస్మ‌స్ నిలిచింది. థియేట‌ర్ల‌లో కూడా హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ మూవీ రిలీజైంది. కానీ సంక్రాంతి పోటీ కార‌ణంగా రిలీజైన విష‌యం తెలియ‌కుండానే థియేట‌ర్ల‌లో నుంచి ఈ మూవీ క‌నుమ‌రుగైంది. మెర్రీ క్రిస్మ‌స్‌లో రాధికా ఆప్టే, రాధికా శ‌ర‌త్ కుమార్ అతిథి పాత్ర‌ల‌ను పోషించారు.

మెర్రీ క్రిస్మ‌స్ క‌థ ఇదే...

ఓ హోట‌ల్‌లో ఆల్బ‌ర్ట్‌కు (విజ‌య్ సేతుప‌తి) మరియాతో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. మ‌రియాను ప్రేమించి పెళ్లిచేసుకున్న జెరోమీ ఆమెను దూరం పెడుతుంటాడు. మ‌రో అమ్మాయితో ఎఫైర్ కొన‌సాగిస్తుంటాడు. భ‌ర్త‌పై కోపంతో ఆల్బ‌ర్ట్‌ను డేట్ కోసం త‌న ఇంటికి తీసుకొస్తుంది మ‌రియా.భ‌ర్త జెరోమీని తానే చంపేసి ఆ నేరం నుంచి తెలివిగా బ‌య‌ట‌ప‌డాల‌ని అనుకుంటుంది మ‌రియా. ఆమె ప్లాన్‌ను ఆల్బ‌ర్ట్ ఎలా తెలుసుకున్నాడు?

భ‌ర్త‌ను చంపింది తానే అనే విష‌యం బ‌య‌ట‌ప‌డ‌కుండా పోలీసుల క‌న్నుగ‌ప్ప‌డానికి మ‌రియ ఎలాంటి ఎత్తు వేసింది. చివ‌ర‌కు మ‌రియా కోసం అల్బ‌ర్ట్ ఎలాంటి త్యాగానికి సిద్ధ‌ప‌డ్డాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌. విజ‌య్ సేతుప‌తి బాలీవుడ్‌లో న‌టించిన రెండో మూవీ ఇది. ముంబైక‌ర్ అనే మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు విజ‌య్ సేతుప‌తి. లోకేష్ క‌న‌గ‌రాజ్ మాన‌గ‌రం ఆధారంగా తెర‌కెక్కిన ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది.

టాపిక్