Merry Christmas Review: మెర్రీ క్రిస్మస్ రివ్యూ - విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Merry Christmas Review: విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ హీరోహీరోయిన్లుగా నటించిన మెర్రీ క్రిస్మస్ మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజైంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించాడు.
Merry Christmas Review: బాలీవుడ్‌లో డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్‌ను మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లర్‌గా చెబుతుంటారు. అంధాదూన్, బద్లాపూర్‌తో పాటు థ్రిల్లర్ కథలతో అతడు చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. దర్శకుడిగా తనకు పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన థ్రిల్లర్ జోనర్‌లోనే అతడు చేసిన తాజా మూవీ మెర్రీ క్రిస్మస్.
విజయ్ సేతుపతి (Vijay Sethupathi), కత్రినా కైఫ్ (Katrina kaif) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజైంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే.
ఆల్బర్ట్.. మరియా కథ..
Merry Christmas Review: ఆల్బర్ట్ (విజయ్ సేతుపతి) ఏడేళ్ల తర్వాత క్రిస్మస్ రోజు ముంబై సిటీలో అడుగుపెడతాడు. చనిపోయిన అమ్మ జ్ఞాపకాలు గుర్తొచ్చి పండుగ రోజు ఇంట్లో ఉండలేకపోతాడు. ఓ హోటల్‌కు వెళతాడు. అక్కడ అతడికి మరో వ్యక్తితో డేట్‌కు వచ్చిన మరియా తారసపడుతుంది. ఆ తర్వాత సినిమా చూడటానికి వెళతాడు ఆల్బర్ట్. అక్కడికి తన కూతురితో కలిసి మరియా వస్తుంది.
థియేటర్‌లో ఆల్బర్ట్, మరియా మధ్య అనుబంధం పెరుగుతుంది. తననో అర్కిటెక్ట్‌గా పరిచయం చేసుకుంటాడు అల్బర్ట్. భర్త జెరోమీపై ద్వేషంతో ఆల్బర్ట్‌ను డేట్ కోసం తన ఇంటికి తీసుకొస్తుంది మరియా. అనుకోకుండా వారికి మరియా భర్త జెరోమీ డెడ్‌బాడీ ఇంట్లో కనిపిస్తుంది. అతడిని ఎవరో షూట్ చేసి చంపేస్తారు. మరియా పోలీసులకు ఫోన్ చేయాలని అనుకుంటుంది. కానీ ఆల్బర్ట్ వద్దని వారిస్తాడు. తాను ఆర్కిటెక్ట్ కాదని...జైలు నుంచి విడుదలైన ఖైదీనని మరియాకు చెబుతాడు. నన్ను నీతో చూస్తే పోలీసులు అనుమానిస్తారని, అది నీకే ప్రమాదమని చెబుతాడు.
తనతో అబద్దం చెప్పిన ఆల్బర్ట్‌ను ఇంట్లో పంపిచేస్తుంది మరియా. ఆ తర్వాత రోనీ అనే మరో వ్యక్తి మరియా తన ఇంటికి తీసుకొస్తుంది. అసలు మరియా ఇంట్లో ఏం జరిగింది? జెరోమీని చంపింది ఎవరు? ఆల్బర్ట్ ఎందుకు జైలుకు వెళ్లాడు? ప్రాణంగా ప్రేమించిన రోజీని (రాధికా ఆప్టే) ఆల్బర్ట్ ఎందుకు చంపాడు? మరియా కోసం ఆల్బర్ట్ ఎలాంటి త్యాగానికి సిద్ధపడ్డాడు? జెరోమీని చంపిన దోషిని పోలీసులు పట్టుకున్నారా? లేదా? అన్నదే మెర్రీ క్రిస్మస్(Merry Christmas Review) మూవీ కథ.
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్...
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో మెర్రీ క్రిస్మస్ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీరామ్ రాఘవన్. సింపుల్ పాయింట్‌ను ఫిలాసఫికల్‌గా తనదైన శైలి ట్విస్ట్‌లతో చెప్పి ఆడియెన్స్‌ను థ్రిల్ చేశాడు. మనుషుల్లో ఉండే కోపం, అత్యాశ, స్వార్థం, ప్రేమ, త్యాగం, పశ్చాత్తపం లాంటి గుణాలను హీరోహీరోయిన్ల పాత్రల ద్వారా, వారు ఎదుర్కొన్న పరిస్థితుల ద్వారా రియలిస్టిక్‌గా చూపించడం బాగుంది.
ఈ సినిమా కథ(Merry Christmas Review) ఒక్క రోజులోనే.. అది కూడా క్రిస్మర్ రోజే నడుస్తుంది. కష్టాల్లో ఉన్న వారికి ముందుకు నడిపించడం కోసం దేవుడు ఏదో ఒక రూపంలో దారి చూపిస్తూనే ఉంటాడని.... క్రిస్మర్ రోజు శాంటాలా మరియా లైఫ్‌లోకి ఆల్బర్ట్ వచ్చాడన్నట్లుగా ఇన్నర్ మెసేజ్‌తో బ్యూటిఫుల్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు.
ప్రతి సీన్ ఎంగేజింగ్..
మెర్రీ క్రిస్మస్ మొత్తం శ్రీరామ్ రాఘవన్ సినిమాటిక్(Merry Christmas Review) ఫార్మెట్‌లోనే సాగుతుంది. ప్రతి సీన్ ఆడియెన్స్‌కు ఓ ఫజిల్‌లా అనిపిస్తుంది. మర్డర్ ఎవరు చేశారు..నెక్స్ట్ ఏం జరుగబోతుందనే క్యూరియాసిటీని చివరి వరకు హోల్డ్ చేశాడు డైరెక్టర్. మర్డర్‌కు సంబంధించి ఫ్లోర్ పాయింట్‌తో రాసుకున్న ట్విస్ట్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తుంది. ఆ ట్విస్ట్‌ను సాల్వ్ చేయడానికి విజయ్ సేతుపతి సాగించే అన్వేషణ కూడా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో డైరెక్టర్ తన టాలెంట్‌ను చూపించాడు. సింగిల్ డైలాగ్ లేకుండా ఊహలకు అందని ట్విస్ట్‌తో ఎండ్ చేశాడు.
ఆర్ట్ ఫిల్మ్‌లా..
మెర్రీ క్రిస్మస్ కథ, టేకింగ్ బాగున్నా.. ఆర్ట్ ఫిల్మ్‌గా నడిపించిన తీరే ఇబ్బంది పెడుతుంది. ప్రతి సీన్‌ను ఓ పొయెటిక్ వేలో స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడు. ఫస్ట్ ఫేజ్ సినిమాలకు అలవాటుపడిన నేటితరం ఆడియెన్స్ ఇలాంటి రెట్రో స్టైల్ స్లో నరేషన్‌ను ఎంజాయ్ చేయడం కొంత కష్టమే.
ఫస్ట్ హాఫ్ మొత్తం విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ కెమిస్ట్రీ, డేటింగ్ సీన్స్ చుట్టే నడుస్తుంది. అవన్నీ సీరియల్‌గా నెమ్మదిగా సాగుతాయి. జెరోమీ మర్డర్ నుంచే సినిమా(Merry Christmas Review) ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. కత్రినాపై అనుమానాలుకు రేకెత్తిస్తూ అక్కడి నుంచి సినిమాను ఎంగేజింగ్‌గా నడిపించాడు.
కానీ భర్త జెరోమీపై మరియాకు ఉన్న ద్వేషాన్ని డైలాగ్స్‌తోనే చూపించడంతో ఆ క్యారెక్టర్‌పై సింపథీ క్రియేట్ కాలేకపోయింది.. ఒక్క రోజు పరిచయంలోనే మరియా కోసం ఆల్బర్ట్ పెద్ద త్యాగానికి సిద్ధపడటం కూడా కన్వీన్సింగ్‌గా అనిపించదు. శ్రీరామ్ రాఘవన్ గత సినిమాల స్థాయిలో మేరీ క్రిస్మస్ క్లైమాక్స్ లేదు.
విజయ్, కత్రినా యాక్టింగ్ సూపర్బ్...
మెర్రీ క్రిస్మస్ సినిమా మొత్తం విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ పాత్రల చుట్టే తిరుగుతుంది. ఆల్బర్ట్‌గా విజయ్ సేతుపతి జీవించాడు. పాత్ర తప్ప విజయ్ ఎక్కడ కనిపించడు. సింపుల్ ఎక్స్‌ప్రెషన్స్, చిన్న చిన్న డైలాగ్స్‌తో అతడి పాత్రను డైరెక్టర్ రాసుకున్న తీరు బాగుంది. కత్రినా గ్లామర్ హీరోయిన్ ట్యాగ్‌కు పూర్తి భిన్నంగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో ఒదిగిపోయింది. మరియా పాత్రలో చక్కటి ఎమోషన్స్ పలికించింది.రాధిక ఆప్టే గెస్ట్ రోల్ చేసింది. ఒకే సీన్‌లో కనిపిస్తుంది.
నో కంపేరిజన్స్....
శ్రీరామ్ రాఘవన్ గత సినిమాల స్థాయిలో ట్విస్ట్‌లు, టర్న్‌లు, డిఫరెంట్ స్టోరీలైన్స్ ఎక్స్‌పెక్ట్ చేసి చూస్తే మాత్రం మేరీ క్రిస్మస్ డిసపాయింట్ చేస్తుంది. విజయ్ సేతుపతి, కత్రినా యాక్టింగ్ కోసం మాత్రం మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. డిఫరెంట్ థ్రిల్లర్ మూవీగా ఆకట్టుకుంటుంది.