Horror OTT: ఓటీటీలో ఈ వారం 7 హారర్ సినిమాలు- ఒక్కదాంట్లోనే 4, తెలుగులో 2- వీకెండ్‌కు బెస్ట్.. రోజుకోటి చూసేయండి!-ott horror movies release this week on amazon prime netflix the substance strange darling time cut digital streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Horror Ott: ఓటీటీలో ఈ వారం 7 హారర్ సినిమాలు- ఒక్కదాంట్లోనే 4, తెలుగులో 2- వీకెండ్‌కు బెస్ట్.. రోజుకోటి చూసేయండి!

Horror OTT: ఓటీటీలో ఈ వారం 7 హారర్ సినిమాలు- ఒక్కదాంట్లోనే 4, తెలుగులో 2- వీకెండ్‌కు బెస్ట్.. రోజుకోటి చూసేయండి!

Sanjiv Kumar HT Telugu
Nov 02, 2024 01:37 PM IST

Horror OTT Movies This Week: ఓటీటీలో ఈ వారం ఏకంగా 7 హారర్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో నాలుగు సినిమాలు ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే రిలీజ్ అయ్యాయి. సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ వంటి అంశాలను యాడ్ చేసి మరి ఈ ఓటీటీ హారర్ సినిమాలను తెరకెక్కించారు.

ఓటీటీలో ఈ వారం 7 హారర్ సినిమాలు- ఒక్కదాంట్లోనే 4, తెలుగులో 2- వీకెండ్‌కు బెస్ట్.. రోజుకోటి చూసేయండి!
ఓటీటీలో ఈ వారం 7 హారర్ సినిమాలు- ఒక్కదాంట్లోనే 4, తెలుగులో 2- వీకెండ్‌కు బెస్ట్.. రోజుకోటి చూసేయండి!

OTT Horror Movies Release This Week Telugu: హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న హారర్ థ్రిల్లర్స్‌ను ఎవరైనా ఇష్టపడుతుంటారు. అలాంటి వారికోసమే అన్నట్లుగా ఈ వారం ఏకంగా ఏడు హారర్ మూవీస్ ఓటీటీలోకి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఆ హారర్ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఓ లుక్కేద్దాం.

yearly horoscope entry point

టైమ్ కట్ ఓటీటీ

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో గతంలోకి వెళ్లి ఐదుగురు కాలేజీ అమ్మాయిల హత్యల మిస్టరీ చేధించే కథగా టైమ్ కట్ మూవీ తెరకెక్కింది. హారర్ సస్పెన్స్ జోనర్‌లో తెరకెక్కిన టైమ్ కట్ మూవీకి క్రైమ్, మిస్టరీ, టైమ్ ట్రావెల్ ఎలిమెంట్స్‌తో యాడ్ చేసి రూపొందించారు లేడి డైరెక్టర్ హన్నా మాక్‌ఫర్సన్.

సోదరి హత్య గురించి తెలుసుకునేందుకు 2003 సంవత్సరంలోకి టైమ్ ట్రావెల్ అయ్యే మాడిసన్ బెైలీ అనే యువతి చుట్టూ ఈ కథ సాగుతుంది. టైమ్ కట్ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అక్టోబర్ 31 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. హాలీవుడ్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ అయిన టైమ్ కట్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు భాషలో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ది సబ్‌స్టాన్స్ ఓటీటీ

సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన హారర్ మూవీ ది సబ్‌స్టాన్స్. ఐఎమ్‌డీబీ నుంచి 7.6 రేటింగ్ సాధించిన ది సబ్‌స్టాన్స్ మూవీ ముబి ఓటీటీలో రిలీజ్ అయింది. రెండు గంటల 20 నిమిషాల రన్ టైమ్ ఉన్న హారర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ది సబ్‌స్టాన్స్ సినిమాలో డెమి మూర్, మార్గరెట్ క్వాలీ, డెన్సిస్ క్వైడ్, ఆస్కార్ లెసజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

అపోకలిప్స్ జడ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఓటీటీ

జాంబీ జోనర్‌లో వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీనే అపోకలిప్స్ జడ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్. సాటి మనుషులనే చంపి తినే జాంబీ వ్యక్తులు, వైరస్ నుంచి ఓ యువకుడు ఎలా ప్రాణాలతో బయటపట్టాడనే స్టోరీతో అపోకలిప్స్ జడ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ తెరకెక్కింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అక్టోబర్ 31 నుంచి 15 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్ట్రేంజ్ డార్లింగ్ ఓటీటీ

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 2023 మూవీనే స్ట్రేంజ్ డార్లింగ్. పదికి 7.2 ఐఎమ్‌డీబీ రేటింగ్ ఉన్న స్ట్రేంజ్ డార్లింగ్ మూవీ బాక్సాఫీస్ వద్ద 3.8 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టింది. నవంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రేంజ్ డార్లింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. గంట 36 నిమిషాల నిడివి ఉన్న స్ట్రేంజ్ డార్లింగ్ ఓటీటీలో తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉంది.

నోక్టర్నో ఓటీటీ

నోక్టర్నో (Nokturno) ఒక ఫిలిప్పీన్ హారర్ మూవీ. జైమీ అనే యువతి తన సోదరి అనుమానాస్పద మృతి తర్వాత ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో జైమికి విచిత్రమైన భయానక సంఘటనలు ఎదురవుతుంటాయి. ఈ క్రమంలోనే తన కుటుంబం ఒక శాపానికి గురైందని తెలుస్తుంది. జైమీ వెంట పడుతున్న ఆత్మ నుంచి నోక్టర్నో ఎలా తప్పించుకుందనే కథతో నోక్టర్నో తెరకెక్కింది. నోక్టర్నో మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అక్టోబర్ 31 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

అజ్రేల్ ఓటీటీ, జంజి దారా ఓటీటీ

2024లో వచ్చిన ఇంగ్లీష్ హారర్ యాక్షన్ చిత్రం అజ్రేల్ (Azrael Movie) అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇండోనేషియన్ హారర్ ఫిల్మ్ జంజి దారా (Janji Darah) నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయింది. ఇలా ఈ వారం ఏడు హారర్ సినిమాలు ఓటీటీ రిలీజ్ కాగా వాటిలో నాలుగు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. రెండు తెలుగు భాషలో అందుబాటులో ఉన్నాయి.

Whats_app_banner