OTT Movies: ఓటీటీల్లో 18 సినిమాలు, 6 వెరీ స్పెషల్- ఈ రెండు డోంట్ మిస్- రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ టు టైమ్ ట్రావెల్!
వెOTT Releases This Week: ఈ వారం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీసులు అన్ని కలుపుకుని మొత్తంగా 18 వరకు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ఏకంగా 5 సినిమాలతోపాటు ఒక వెబ్ సిరీస్ మాత్రమే స్పెషల్‌గా ఉన్నాయి. అందులో టైమ్ ట్రావెల్ క్రైమ్ థ్రిల్లర్‌తోపాటు రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు.
This Week OTT Movies: ఈ వారం థియేటర్లలో కమిటీ కుర్రోళ్లు, సింబా, భవనమ్ వంటి చిన్న సినిమాలతోపాటు బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ తుఫాన్ మూవీ సందడి చేయనున్నాయి. వీటిపై బజ్ పర్వాలేదనిపిస్తోన్న ఎప్పటిలాగే వచ్చే ఓటీటీ సినిమాల కోసం మాత్రం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
చెప్పుకొదగ్గ ఓటీటీ సినిమాలు
అయితే, ఈ వారం అంతగా చెప్పుకోదగ్గ సినిమాలు ఓటీటీలోకి రాలేదు. ఈ వారం అంటే ఆగస్ట్ 5 నుంచి 11 మధ్య సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి 18 మాత్రమే ఓటీటీ రిలీజ్ కానున్నాయి. వాటిలో అరకొర మాత్రమే విశేషంగా చెప్పుకునే సినిమాలు ఉన్నాయి. మిగతావన్ని ఇతర భాషల్లోని వెబ్ సిరీసులు, రియాలిటీ షోలు ఉన్నాయి. మరి ఇంట్రెస్టింగ్ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటనేది ఇక్కడ చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ది అంబ్రెల్లా అకాడమీ సీజన్ 4 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 8
భారతీయుడు 2 (తెలుగు సినిమా)- ఆగస్ట్ 9
ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా (హిందీ చిత్రం)- ఆగస్ట్ 9
కింగ్స్‌మెన్ గోల్డెన్ సర్కిల్ (ఇంగ్లీష్ మూవీ)- ఆగస్ట్ 9
మిషన్ క్రాస్ (కొరియన్ మూవీ)- ఆగస్ట్ 9
ఇన్‌సైడ్ ది మైండ్ ఆఫ్ ది డాగ్ (ఇంగ్లీష్ చిత్రం)- ఆగస్ట్ 9
రొమాన్స్ ఇన్ ది హౌజ్ (కొరియన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 10
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
ది జోన్: సర్వైవల్ మిషన్ సీజన్ 3 (కొరియన్ రియాలిటీ షో)- ఆగస్ట్ 7
ఆర్ యూ ష్యూర్ (ట్రావెల్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 8
లైఫ్ హిల్ గయి (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 9
ఖాటిల్ కౌన్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 9
జీ5 ఓటీటీ
భీమా అధికార్ సే అధికార్ తక్ (హిందీ మూవీ)- ఆగస్ట్ 5
అమర్ సంగి (హిందీ సీరియల్)- ఆగస్ట్ 5
గ్యారా గ్యారా (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 9
జియో సినిమా ఓటీటీ
మేఘ బర్సేంగే సీజన్ 1 (హిందీ టీవీ షో)- ఆగస్ట్ 6
గుడ్‌చడీ (హిందీ సినిమా)- ఆగస్ట్ 9
టర్బో (మలయాళ సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- ఆగస్ట్ 9
టైమ్ ట్రావెల్ క్రైమ్ థ్రిల్లర్
ఇలా ఓటీటీల్లో ఈ వారం 18 రిలీజ్ కానున్నాయి. వీటిలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి యాక్ట్ చేసిన టర్బో సినిమా చాలా స్పెషల్‌గా కానుంది. దీంతో పాటు టైమ్ ట్రావెల్ క్రైమ్ థ్రిల్లర్ గ్యారా గ్యారా వెబ్ సిరీస్, రొమాన్స్ థ్రిల్లర్ సినిమా గుడ్‌చడీ, కింగ్స్‌మెన్ గోల్డెన్ సర్కిల్ హాలీవుడ్ మూవీ ఆసక్తికరంగా ఉండనున్నాయి.
రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్
వీటితోపాటు చాలా స్పెషల్‌గా తాప్సీ నటించిన బోల్డ్ అండ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు సీక్వెల్ అయిన ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా మూవీ ఉండనుంది. విక్రాంత్ మస్సె, తాప్సీ మరోసారి నటించిన ఈ సినిమా ఈ వారం స్పెషల్ అట్రాక్షన్ కానుంది.
ఇండియన్ 2 కూడా
అలాగే కమల్ హాసన్ నటించిన డిజాస్టర్ మూవీ ఇండియన్ 2 కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇలా ఈ వారం 18 ఓటీటీ సినిమాల్లో ఐదు మూవీస్, ఒక వెబ్ సిరీస్‌తో 6 ప్రత్యేకం కానున్నాయి.