OTT Comedy Movie: కొంపలు కూల్చే మొబైల్ ఫోన్.. ఓటీటీలోకి వస్తున్న డిజాస్టర్ కామెడీ మూవీ.. 8 ఏళ్లలో 26సార్లు రీమేక్-ott comedy movie akshay kumar starrer khel khel mein to stream on netflix from october 9th most number of remakes movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Comedy Movie: కొంపలు కూల్చే మొబైల్ ఫోన్.. ఓటీటీలోకి వస్తున్న డిజాస్టర్ కామెడీ మూవీ.. 8 ఏళ్లలో 26సార్లు రీమేక్

OTT Comedy Movie: కొంపలు కూల్చే మొబైల్ ఫోన్.. ఓటీటీలోకి వస్తున్న డిజాస్టర్ కామెడీ మూవీ.. 8 ఏళ్లలో 26సార్లు రీమేక్

Hari Prasad S HT Telugu
Oct 04, 2024 05:51 PM IST

OTT Comedy Movie: ఓటీటీలోకి ఓ డిజాస్టర్ కామెడీ మూవీ వచ్చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 8 ఏళ్లలో ఏకంగా 26సార్లు రీమేక్ అయిన ఈ సినిమా మన దగ్గర మాత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది. రూ.100 కోట్ల బడ్జెట్ తో తీస్తే కేవలం రూ.56 కోట్లే వసూలు చేసింది.

ఓటీటీలోకి వచ్చేస్తున్న డిజాస్టర్ కామెడీ మూవీ.. 8 ఏళ్లలో 26సార్లు రీమేక్.. మన దగ్గర మాత్రం..
ఓటీటీలోకి వచ్చేస్తున్న డిజాస్టర్ కామెడీ మూవీ.. 8 ఏళ్లలో 26సార్లు రీమేక్.. మన దగ్గర మాత్రం..

OTT Comedy Movie: ఓ డిజాస్టర్ కామెడీ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. అక్షయ్ కుమార్, ఫర్దీన్ ఖాన్, తాప్సీ, వాణీ కపూర్ లాంటి వాళ్లు నటించిన ఖేల్ ఖేల్ మే సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికసార్లు రీమేక్ అయిన ఇటాలియన్ మూవీ పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ కు హిందీ రీమేకే ఈ ఖేల్ ఖేల్ మే.

ఖేల్ ఖేల్ మే ఓటీటీ రిలీజ్ డేట్

అక్షయ్ కుమార్ నటించిన ఖేల్ ఖేల్ మే మూవీకి థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. మూవీలోని కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్వించినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.56 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

ఆగస్ట్ 15న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. సుమారు రెండు నెలల తర్వాత అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 8 ఏళ్లలోనే 26 సార్లు రీమేక్ అయిన ఆ పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ కు ఈ ఖేల్ ఖేల్ మే కూడా ఓ రీమేకే అయినా.. ఇక్కడి ప్రేక్షకులను మాత్రం సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఏంటీ ఖేల్ ఖేల్ మే మూవీ?

2016లో ఈ డ్రామెడీ జానర్ లో వచ్చిన ఇటాలియన్ మూవీకి ఈ ఖేల్ ఖేల్ మే రీమేక్. ఆ మూవీ పేరు పర్ఫెట్టి స్కోనోసియుటి. అంటే ఇంగ్లిష్ లో పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్. ఈ సినిమాను 26 సార్లు రీమేక్ చేసినట్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాను ఇప్పటికే ఫ్రెంచ్, కొరియన్, మాండరిన్, రష్యన్, అరబిక్, రొమానియన్, హీబ్రూ, జర్మన్ లాంటి భాషల్లో అధికారికంగా రీమేక్ చేశారు. అంతెందుకు తెలుగులో గతేడాది వచ్చిన రిచీ గాడి పెళ్లి అనే సినిమా కూడా ఇదే లైన్స్ లో సాగుతుంది. కానీ ఆ మూవీ మేకర్స్ దీనిని ఈ పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ రీమేక్ అని ఎక్కడా చెప్పలేదు.

తెలుగులోనే కాదు కన్నడలో లౌడ్ స్పీకర్ ను అధికారిక రీమేక్ గా చెప్పగా, మలయాళంలో 12th మ్యాన్ సినిమా కూడా ఆ ఇటాలియన్ మూవీ రీమేకే. చాలా వరకు భాషల్లో పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ పేరుతోనే ఈ సినిమాను రీమేక్ చేశారు.

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తోపాటు ఫర్దీన్ ఖాన్, ఏమీ విర్క్, తాప్సీ పన్ను, వాణి కపూర్, ప్రజ్ఞా జైస్వాల్ నటించిన ఖేల్ ఖేల్ మే మూవీ కూడా ఆ పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ రీమేకే. సరదాగా సాగిపోయే ఓ డిన్నర్ నైట్ లో కపుల్స్, ఫ్రెండ్సే తర్వాత శత్రువులుగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

దీనికి కారణం ఒకరి మొబైల్స్ ను మరొకరు చూసే ఆట ఆడటమే. సరదాగా మొదలయ్యే ఈ ఆట చివరికి వాళ్ల జీవితాలనే మార్చేస్తుంది. మరి అలాంటి సినిమాను ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో చూడటానికి సిద్ధమైపోండి.

Whats_app_banner