(1 / 5)
బాలీవుడ్ సీనియర్ స్టార్ అక్షయ్ కుమార్ వైవిధ్యమైన నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సమయం దొరికినప్పుడల్లా కుటుంబంతో సమయం గడిపేందుకు ఆయన ప్రాధాన్యమిస్తారు. నేడు (సెప్టెంబర్ 9) తన 57వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు అక్షయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన ఫ్యామిలీ గురించిన వివరాలు తెలుసుకోండి.
(2 / 5)
అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా కలిసి బాలీవుడ్‍లో ఖిలాడీ (1999), జుల్మీ (1999) లాంటి సినిమాలు చేశారు. ప్రేమలో పడిన వీరిద్దరూ 2001 జనవరి 17న వివాహం చేసుకున్నారు. దిగ్గజ యాక్టర్ రాజేశ్ ఖన్నా, డింపుల్ కపాడియా దంపతుల కూతురే ట్వింకిల్ ఖన్నా.
(3 / 5)
అక్షయ్, ట్వింకిల్ దంపతులకు తొలి సంతానంగా 2002 సెప్టెంబర్ 15న కుమారుడు ఆరవ్ జన్మించారు. 2012 సెప్టెంబర్ సెప్టెంబర్ 25న కూతురు నైతారా పుట్టారు. పిల్లలతో కలిసి అక్షయ్, ట్వింకిల్ తరచూ వెకేషన్లకు వెళుతుంటారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.
(4 / 5)
ట్వింకిల్ ఖన్నా రచించిన బుక్ లాంచ్ ఈవెంట్‍కు, ఆమె లండన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకున్న కాన్వరేషన్‍కు అక్షయ్ కుమార్ హాజరయ్యారు. ట్వింకిల్‍కు ఆయన మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు.
(5 / 5)
2000 తర్వాత యాక్టింగ్‍కు గుడ్‍బై చెప్పారు ట్వింకిల్ ఖన్నా. ఆ తర్వాత అక్షయ్ కుమార్ నటించిన కొన్ని సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. కాగా, అక్షయ్ కుమార్ ప్రస్తుతం స్కైఫోర్స్, సింగం అగైన్ చిత్రాల్లో నటిస్తున్నారు. జాలీ ఎల్ఎల్‍బీ 3, వెల్‍కం టు ది జంగిల్ మరో మూడు చిత్రాలు ఆయన లైనప్‍లో ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు