Oscars 2024: ఆ రెండు సినిమాలకు దక్కని ఆస్కార్.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు-oscars 2024 no academy awards for killers of the flower moon and maestro and berbie gets on amid oppenheimer dominance ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Oscars 2024: ఆ రెండు సినిమాలకు దక్కని ఆస్కార్.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

Oscars 2024: ఆ రెండు సినిమాలకు దక్కని ఆస్కార్.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 11, 2024 04:32 PM IST

Oscars 2024: ఆస్కార్ 2024 వేడుక గ్రాండ్‍గా జరిగింది. ఓపెన్‍హైమర్ మూవీ ఈ అవార్డుల్లో ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే, అంచనాలు తలకిందులవుతూ ఓ రెండు పాపులర్ చిత్రాలకు ఒక్క పురస్కారం కూడా రాలేదు.

ల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, మాస్ట్రో సినిమాలు
ల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, మాస్ట్రో సినిమాలు

Oscars 2024: ఆస్కార్స్ 2024 అవార్డుల ప్రదానోత్సవ వేడుక లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ల అత్యంత అట్టహాసంగా జరిగింది. 96వ అకాడమీ (ఆస్కార్) పురస్కారాల ఈవెంట్ నేడు జరిగింది. క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఓపెన్‍హైమర్’కు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు సహా మొత్తంగా ఏడు అవార్డులు దక్కాయి. ఉత్తమ దర్శకుడిగా తొలిసారి ఆస్కార్ అందుకున్నాడు జీనియస్ డైరెక్టర్ నోలాన్. అయితే, ఆస్కార్ 2024లో కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, మాస్ట్రో చిత్రాలకు ఒక్క అవార్డు కూడా దక్కలేదు. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్

గతేడాది అక్టోబర్‌లో రిలీలైన ‘కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కించుకుంది. హాలీవుడ్ చరిత్రలో ఒకానొక గ్రేట్ మూవీ అంటూ పొగడ్తలు వచ్చాయి. ఈ ఎపిక్ క్రైమ్ డ్రామా మూవీకి మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వం వహించారు. స్టార్ యాక్టర్ లియానో డికాప్రియో ప్రధాన పాత్ర పోషించారు.

కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ చిత్రం ఆస్కార్ 2024లో ఏకంగా 10 కేటగిరీల్లో నామినేషన్లను దక్కించుకుంది. అయితే, ఈ మూవీకి ఒక్క ఆస్కార్ అవార్డు కూడా దక్కలేదు. ఉత్తమ నటి కేటగిరీలో లిలీ గ్లాడ్‍స్టోన్‍కు ఈ చిత్రానికి గానూ ఆస్కార్ దక్కుతుందని చాలా మంది అంచనాలు వేశారు. అయితే, అది కూడా జరగలేదు. మొత్తంగా కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ చిత్రానికి ఒక్క ఆస్కార్ పురస్కారం కూడా దక్కలేదు.

మాస్ట్రో

బయోగ్రాఫికల్ రొమాంటిక్ డ్రామాగా మాస్ట్రో మూవీ వచ్చింది. గతేడాది ఈ చిత్రం రిలీజైంది. టెక్నికల్ పరంగా ఈ చిత్రంపై చాలా ప్రశంసలు వచ్చాయి. బ్రాడ్లీ కూపర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుమారు ఆరేళ్ల పాటు ఈ ప్రాజెక్టుపై ఆయన పని చేశారు. ఈ మూవీలో కేరీ ముల్లిగన్, బ్రాడ్లీ కూపర్, మ్యాట్ బొమెర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్ 2024కు గాను ఏడు విభాగాల్లో మాస్ట్రో నామినేట్ అయింది. ఈ చిత్రానికి కూడా ఒక్క అవార్డు కూడా దక్కలేదు.

నెటిజన్ల రియాక్షన్ ఇదే

కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, మాస్ట్రో సినిమాలకు ఒక్క ఆస్కార్ అవార్డు కూడా దక్కకపోవడంపై కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు అద్భుతమైన చిత్రాలకు ఒక్క కేటగిరీలోనూ పురస్కారం దక్కకపోవడం అసంతృప్తిగా ఉందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ చిత్రానికి ఆస్కార్ లభించకపోవడంపై చాలా మంది నిరాశ చెందుతున్నారు. మాస్ట్రోకు కూడా కనీసం రెండు అవార్డులు వస్తాయని భావించగా.. ఒక్కటి కూడా లభించలేదు. అయితే, ఓపెన్‍హైమర్‌ లాంటి బ్రిలియంట్ సినిమా పోటీలో ఉన్న కారణంగానే ఆ రెండు చిత్రాలకు అవార్డులు దక్కలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన బార్బీ మూవీకి కూడా ఒకే ఆస్కార్ అవార్డు లభించించింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో బిల్లీ ఎలిష్, ఫినెయస్ ఒకెన్నెల్‍ పురస్కారం అందుకున్నారు.