ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన చిత్రాలు, సినీ కళాకారులకు ఆస్కార్ అవార్డు(Oscar Awards) అందిస్తారు. అసలు ఈ అవార్డు దేనితో తయారు చేస్తారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.  

twitter

By Bandaru Satyaprasad
Mar 11, 2024

Hindustan Times
Telugu

ప్రస్తుతం 96వ అకాడెమీ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం (మార్చి 10) రాత్రి లాస్ ఏంజిల్స్ లో జరిగింది. హాలీవుడ్ సినిమా  ఓపెన్‌హైమర్ అత్యధికంగా 7 ఆస్కార్ అవార్డులు అందుకుంది.  గత ఏడాది ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ వచ్చింది.  

Twitter

ఆస్కార్ అవార్డును కాంస్యంతో తయారు చేస్తారు. పైన 24 క్యారెట్ల బంగారంతో పూత(Gold Coating) పూస్తారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మెటల్ కొరత కారణంగా మూడేళ్ల పాటు పెయింట్ చేసిన ప్లాస్టర్‌తో తయారు చేశారు. యుద్ధం తరువాత బంగారు పూత పూసిన మెటల్ ను తిరిగి అందించింది.  

Twitter

ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం రాత్రి వరకూ ఎన్ని అవార్డులు అందిస్తారో తెలియదు. కేటగిరీలు తెలుస్తాయి తప్ప ఎంత మందికి అవార్డులు అందిస్తారో తెలియదు. ఒక్కో కేటగిరీకి ఒకటి కంటే ఎక్కువ మందిని కూడా ఎంపిక చేస్తుంటారు. అందుకే అవార్డుల సంఖ్యను కచ్చితంగా అంచనా వేయడం అసాధ్యం.  

Twitter

 1929లో డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీలు ఈ అవార్డులను అకాడమీ అవార్డుల పేరుతో మొదలుపెట్టారు. ఆస్కార్ అవార్డును అమ్ముకుంటే ఎంతో వస్తుందో తెలిస్తే ఆశ్చర్య పోతారు.  

Twitter

ఆస్కార్ అవార్డును కాంస్యంతో తయారు చేసి బంగారం పూత పూస్తారు. ఆస్కార్ అవార్డు 30.5 అంగుళాల ఎత్తు ఉంటుంది. బరువు సుమారు 4 కిలోలు. ఒక్కో అవార్డు తయారీకి 400 డాలర్లు ఖర్చు అవుతుంది. అయితే ఆస్కార్ అవార్డును అమ్మితే కేవలం ఒక్క డాలరు మాత్రమే వస్తుంది. 

Twitter

1950కి ముందు ఓ అమెరికన్ డైరెక్టర్ తన ఆస్కార్ అవార్డును వేలం వేశాడు. దీనికి అప్పట్లోనే ఆరున్నర కోట్లు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న ఆస్కార్‌ అకాడమీ అవార్డుల(Academy Awards) కమిటీ నిబంధనలు మార్పు చేసింది.  

Twitter

ఆస్కార్‌ అవార్డును ఎవరూ అమ్మడానికి వీల్లేదని అకాడమీ షరతు పెట్టింది. అవార్డును వేలం వేసే హక్కు అకాడమీకే ఉందని, అది కూడా ఒక్క డాలర్ కు మాత్రమే వేలం వేయాలని నిర్ణయించింది.  

Twitter

ఇటీవ‌లే గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చిందితో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది అంజ‌లి. 

twitter