Leonardo Dicaprio: టైటానిక్ హీరో హాలీవుడ్ మూవీ రన్ టైమ్ మూడున్నర గంటలు అంట - రిలీజ్ డేట్ ఫిక్స్!
Leonardo Dicaprio: టైటానిక్ ఫేమ్ లియోనార్డో డికాప్రియో హీరోగా నటించిన హాలీవుడ్ మూవీ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సినిమా అక్టోబర్ 20న రిలీజ్ కానుంది. రన్‌టైమ్ పరంగా హాలీవుడ్ సినీ చరిత్రలోనే అతి పెద్ద సినిమాల్లో ఒకటిగా ఈ క్రైమ్ డ్రామా మూవీ రిలీజ్ కానుంది.
Leonardo Dicaprio: ఇండియన్ సినిమాలతో పోలిస్తే హాలీవుడ్ మూవీస్ రన్‌టైమ్ చాలా తక్కువే ఉంటుంది. ఇదివరకు హాలీవుడ్ మూవీస్ అంటే గంటన్నర నుంచి రెండు గంటలు నిడివితోనే ఉండేవి. ఇప్పుడు రెండున్నర గంటల రన్‌టైమ్‌తోనూ కొన్ని సూపర్ హీరో మూవీస్ వస్తోన్నాయి.
కానీ టైటానిక్ హీరో లియోనార్డ్ డికాప్రియో కొత్త మూవీ రన్‌టైమ్ ఏకంగా మూడున్నర గంటలు ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. లియోనార్డో డికాప్రియో హీరోగా నటించిన కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సినిమా అక్టోబర్ 20న రిలీజ్ కానుంది.
క్రైమ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ 206 నిమిషాల రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంటే మూడు గంటల 26 నిమిషాల రన్‌టైమ్ అన్నమాట. హాలీవుడ్ చరిత్రలోనే ఎక్కువ రన్‌టైమ్ కలిగిన సినిమాల్లో ఒకటిగా కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సినిమా నిలిచింది.
అంతే కాకుండా లెంగ్త్ పరంగా 2023లో రిలీజైన హాలీవుడ్ మూవీస్‌లో ఇదే పెద్దది అని సినీ వర్గాలు చెబుతోన్నాయి. ఓ సీరియల్ కిల్లర్ కథతో పీరియాడికల్ క్రైమ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకు మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వం వహిస్తున్నాడు.
దాదాపు 200 మిలియన్ల వ్యయంతో లియోనార్డో డికాప్రియో కెరీర్‌లో భారీ బడ్జెట్ మూవీస్‌లో ఒకటిగా ఈ సినిమా రూపొందుతోంది. 2018లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఐదేళ్ల పాటు షూటింగ్‌ను జరుపుకోన్న ఈ మూవీ 2023లో రిలీజ్ అవుతోంది. మే 20న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ మూవీని స్క్రీనింగ్ చేశారు. స్క్రీన్‌ప్లే, స్టోరీతో పాటు పలు అంశాల్లో విమర్శకుల ప్రశంసల్ని ఈ సినిమా అందుకున్నది.
టాపిక్