Om Bheem Bush Twitter Review: ఓం భీమ్ బుష్ ట్విట్టర్ రివ్యూ.. అన్ని రకాల ఏజ్ వాళ్లు చూసే పర్ఫెక్ట్ మూవీ-om bheem bush twitter review in telugu sree vishnu priyadarshi rahul ramakrishna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Om Bheem Bush Twitter Review In Telugu Sree Vishnu Priyadarshi Rahul Ramakrishna

Om Bheem Bush Twitter Review: ఓం భీమ్ బుష్ ట్విట్టర్ రివ్యూ.. అన్ని రకాల ఏజ్ వాళ్లు చూసే పర్ఫెక్ట్ మూవీ

Sanjiv Kumar HT Telugu
Mar 22, 2024 12:58 PM IST

Om Bheem Bush Twitter Review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన లేటెస్ట్ కామెడీ హారర్ మూవీ ఓం భీమ్ బుష్. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో మూవీ చూసిన ప్రేక్షకులు, ప్రముఖులు స్పందిస్తూ ఓం భీమ్ బుష్‌పై ట్విట్టర్ ద్వారా రివ్యూలు ఇస్తున్నారు.

ఓం భీమ్ బుష్ ట్విట్టర్ రివ్యూ.. అన్ని రకాల ఏజ్ వాళ్లు చూసే పర్ఫెక్ట్ మూవీ
ఓం భీమ్ బుష్ ట్విట్టర్ రివ్యూ.. అన్ని రకాల ఏజ్ వాళ్లు చూసే పర్ఫెక్ట్ మూవీ

Om Bheem Bush Twitter Review: హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మరోసారి కలిసి నటించిన మూవీ ఓం భీమ్ బుష్. దీనికి 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. ఆయన ఇంతకుముందు రౌడీ బాయ్స్ అనే మరో సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ హారర్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'ఓం భీమ్ బుష్' మూవీని వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మించగా.. యూవీ క్రియేషన్స్ సంస్థ సమర్పించింది.

మార్చి 22న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సరికొత్త హారర్ థ్రిల్లర్ మూవీ ఓం భీమ్ బుష్‌ మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే పలు రివ్యూలు రాగా.. సినిమాను చూసిన ప్రేక్షకులు, సెలబ్రిటీలు ఓం భీమ్ బుష్‌పై ట్విట్టర్ ద్వారా రివ్యూలు ఇస్తున్నారు. మూవీలోని హైలెట్స్, నచ్చిన అంశాలను ప్రస్తావిస్తూ తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. మరి ఓం భీమ్ బుష్ ట్విట్టర్ రివ్యూలోకి వెళితే..

"ఓం భీమ్ బుష్ బాగా నవ్వించే చిత్రం. హర్షకొనుగంటికి అభినందనలు. ప్యాబ్యులెస్ జాబ్. బాగా తెరకెక్కించారు. శ్రీ విష్ణు నువ్ చంపేశావ్.. నీ టైమింగ్‌తో నిజంగా చంపేశావ్. దర్శీ, రాహుల్ నిజంగా అమెజింగ్. వీకెండ్‌కు మంచి ఫన్ మూవీ. యూవీ క్రియేషన్స్‌కు మరో హిట్" అని ఓ నెటిజన్ ట్విటర్ రివ్యూ ఇచ్చాడు.

"లాఫర్ రియోట్. శ్రీ విష్ణు అయితే కుమ్మి అవతలవేశారు. ప్రియదర్శి బాబాయ్.. ఇరగ మింగేసావ్. మీ గ్యాంగ్‌తో వెళ్లండి మ్యాడ్.. మ్యా....క్స్ ఫన్ ఎంజాయ్ చేయండి" అని మరో ట్విట్టర్ యూజర్ ఓం భీమ్ బుష్ సినిమాపై తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

"ఓం భీమ్‌ బుష్ మూవీ పూర్తి వినోదాత్మక చిత్రం. ఎంటర్టైన్‌మెంట్ పాత్రలు, నాన్‌స్టాప్ జోక్‌లతో నవ్వించే అల్లరి సినిమానే కాకుండా థ్రిల్లింగ్ సౌండ్ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధం నిజంగా వినోదభరితమైన అనుభూతిని అందిస్తూ ఉత్సాహాన్ని పెంచుతుంది. సినిమాను బాగా ఎంజాయ్ చేయొచ్చు" అని ఒకరు పేర్కొన్నారు.

ఇదొక క్రేజీ ఎంటర్టైనర్ మూవీ. అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ చూసే పర్ఫెక్ట్ సినిమా. చాలా కాలం తర్వాత బాగా ఎంటర్టైన్ చేసిని మూవీ ఇది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థియేటర్లలో చూడటం అస్సలు మిస్ అవ్వొద్దు అని సినీ నిర్మాత ఎస్‌కేఎన్ ట్విట్టర్ ద్వారా తన రివ్యూ ఇచ్చారు. అలాగే మూవీ టీమ్‌‍కు అభినందనలు తెలిపారు.

WhatsApp channel