Om Bheem Bush OTT: ఓటీటీలోకి హారర్ కామెడీ మూవీ ఓం భీమ్ బుష్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Om Bheem Bush OTT Streaming: రీసెంట్‌గా తెలుగులోకి వచ్చిన హారర్ కామెడీ జోనర్ మూవీ ఓం భీమ్ బుష్. మార్చి 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఓం భీమ్ బుష్ ఓటీటీ రిలీజ్, డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్‌పై క్యూరియాసిటీ నెలకొంది.
Om Bheem Bush OTT Release: బ్రోచెవారెవరురా మూవీతో మంచి కామెడీ కాంబోగా పేరు తెచ్చుకున్నారు హీరో శ్రీ విష్ణు, కమెడియన్ అండ్ యాక్టర్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. మరోసారి ఈ ముగ్గురి కలయికలో వచ్చిన సినిమానే ఓం భీమ్ బుష్. హారర్ అండ్ కామెడీ జోనర్‌లో వచ్చిన ఓం భీమ్ బుష్ సినిమాకు డైరెక్టర్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం చేశారు. ఆయన ఇంతకుముందు హుషారు, రౌడీ బాయ్స్ వంటి సినిమాలను తెరకెక్కించారు.
వి. సెల్యూలాయిడ్, సునీల్ బలుసు కలిని నిర్మించిన ఓం భీమ్ బుష్ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పించింది. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు, ప్రియదర్శికి జోడీలుగా ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ హీరోయిన్లుగా నటించారు. వీరితోపాటు శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే సినిమాలో హుషారు ఫేమ్ హీరోయిన్ ప్రియా వడ్లమాని అతిథి పాత్రలో కనిపించింది.
ఓం భీమ్ బుష్ సినిమా ప్రీమియర్స్ ఇప్పటికే యూఎస్‌లో పడిపోగా మిగతా ఏరియాల్లో షోలు ప్రదర్శిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమా నవ్విస్తూ బాగా భయపెట్టిందని ప్రేక్షకులు అంటున్నారు. అలాగే సినిమాలో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబో అదిరిపోయిందని, వారి కామెడీ టైమింగ్‌కు హిలేరియస్‌గా ఉందని రివ్యూలు వస్తున్నాయి. ఇంత బాగా మౌత్ టాక్ తెచ్చుకుంటున్న ఓం భీమ్ బుష్ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది.
హారర్ కామెడీ థ్రిల్లర్‌గా వచ్చిన ఓం భీమ్ బుష్ సినిమాను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుందని సమాచారం. అందుకు నిర్మాతలకు అమెజాన్ ప్రైమ్ సంస్థ బాగానే ముట్టజెప్పిందట. అయితే, ఓం భీమ్ బుష్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ థియేటర్లలో మూవీ టైటిల్స్ ద్వారా లీక్ అయింది. ఇక సినిమాను థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల రోజులకు స్ట్రీమింగ్ చేయాలన్న నిబంధన ఉన్న విషయం తెలిసిందే.
కాబట్టి, మార్చి 22న రిలీజైన ఓం భీమ్ బుష్ సినిమాను ఏప్రిల్ చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. లేకపోతే బాక్సాఫీస్ కలెక్షన్స్, థియేటర్ రన్నింగ్ షోస్, ప్రేక్షకుల ఆదరణ బట్టి ఓటీటీ విడుదల తేది, స్ట్రీమింగ్ విషయాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. అయితే, మూవీ ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన వచ్చినప్పుడే పూర్తి స్పష్టత వస్తుంది.
ఇక ఓం భీమ్ బుష్ కథ విషయానికొస్తే.. ముగ్గురు ఫ్రెండ్స్ భైరవపురం గ్రామంలోకి వచ్చాక, బ్యాంగ్ బ్రోస్ ఎ టు జెడ్ సొల్యూషన్స్‌ను ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ ముగ్గురు వివిధ సమస్యలకు పరిష్కారంగా ట్యాబ్లెట్లతో పౌడర్ తయారు చేసి గ్రామస్తులకు అమ్ముతుంటారు. వారి వ్యాపారం పుంజుకున్నప్పుడు, అఘోరాల సమూహం గ్రామాల్లోకి ప్రవేశించి, రహస్యమైన సంపంగి మహల్‌లో నిధిని కనుగొనమని సవాలు విసురుతారు.
దాంతో ఆ ముగ్గురు హాంటెడ్ హౌస్‌లో నిధిని కనుగొనడానికి వెళ్తారు. క్కడ జరిగిన విచిత్ర సంఘటనలు ఏంటీ, ట్రెజర్ హంట్, హారర్, థ్రిల్లర్ మొదలైన ఇతర అంశాలు ఎలా చూపించారన్నదే కథగా తెలుస్తోంది.