Nikhil on Karthikeya 3: కార్తికేయ 3పై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన నిఖిల్
Nikhil on Karthikeya 3: కార్తికేయ 3పై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు నిఖిల్ సిద్ధార్థ. ఓటీటీ ప్లే ఛేంజ్ మేకర్ అవార్డు గెలుచుకున్న అతడు.. ఇప్పుడు ఇండియన్ సినిమా గ్లోబల్ స్థాయిని అందుకున్నదని చెప్పాడు.
Nikhil on Karthikeya 3: కార్తికేయ, కార్తికేయ 2 మూవీస్ తో సంచలన విజయాలు అందుకున్నాడు నిఖిల్ సిద్ధార్థ. ముఖ్యంగా కార్తికేయ 2ను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసి నార్త్ లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా కార్తికేయ 3 కూడా చేస్తున్నాడు. ఈ మధ్యే ఓటీటీప్లే ఛేంజ్ మేకర అవార్డుల్లో అతడు ట్రయల్‌బ్లేజర ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు.
"ఇలాంటి అవార్డులు నాకెంతో ఉత్సాహాన్నిస్తాయి. కార్తికేయ 2 ఓ చిన్న సినిమాగా మొదలై తర్వాత అందరినీ షాక్ కు గురి చేసింది. దీనిని బట్టి కంటెంట్ బాగుంటే ఇండియాలో ఎక్కుడున్న వాళ్లయినా చూస్తారని కార్తికేయ 2 నిరూపించింది" అని నిఖిల్ అన్నాడు. ఈ మూవీ డబ్బింగ్ పై చాలా జాగ్రత్తగా వ్యవహరించామని, అందుకే ఈ సినిమాను హిందీ, తమిళంతోపాటు ఏ భాషలో చూసినా అక్కడి సినిమాలాగే అనిపిస్తుందని చెప్పాడు.
ఇక ఇండియన్ సినిమాను గ్లోబల్ లెవల్ కు తీసుకెళ్లి అసలుసిసలు ట్రయల్‌బ్లేజర్లుగా రాజమౌళి, గునీత్ మోంగాలాంటి వాళ్లు నిలిచారని నిఖిల్ అన్నాడు. "సరిహద్దులు చెరిగిపోయాయి. ఇప్పుడు ఇండియన్ స్టార్లయిన ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్స్ అయ్యారు" అని నిఖిల్ అనడం విశేషం.
ఇక కార్తికేయ 3 గురించి చెబుతూ.. "తొలి రెండు భాగాల కంటే కార్తికేయ 3 చాలా భారీస్థాయిలో ఉండబోతోంది. ఈ సినిమాను 3డీలోనూ చేయబోతున్నాం" అని నిఖిల్ వెల్లడించాడు. ఇక స్పై మూవీ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా ఓ నేషనల్ ఇష్యూపై రూపొందుతోందని, ఇది కూడా పాన్ ఇండియా మూవీ అని చెప్పాడు.
సంబంధిత కథనం