Game Changer First Look: గేమ్ ఛేంజర్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. చరణ్ లుక్ అదుర్స్
Game Changer First Look: గేమ్ ఛేంజర్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఇందులో చరణ్ లుక్ అదుర్స్ అనిపించేలా ఉంది. చెర్రీ బర్త డే సందర్భంగా మూవీ నేమ్, ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Game Changer First Look: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఇన్నాళ్లూ ఆర్సీ15 అనే వర్కింగ్ టైటిల్ తో పిలవగా.. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ సోమవారం (మార్చి 27) ఉదయం మూవీ టైటిల్ రివీల్ చేశారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి చరణ్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయడం విశేషం.
ఇందులో చెర్రీ లుక్ అదుర్స్ అనిపించేలా ఉంది. అతడు ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ హై బడ్జెట్ మూవీని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ శణ్ముగం డైరెక్ట్ చేస్తుండటంతో మొదటి నుంచీ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అతడు ఓవైపు ఇండియన్ 2 మూవీ షూటింగ్ లోనూ బిజీగా ఉండటంతో ఈ గేమ్ ఛేంజర్ ఆలస్యమవుతూ వస్తోంది.
ఈ సినిమా కోసం చరణ్ మేకోవర్ చూసి అభిమానులు షాక్ తింటున్నారు. అతని స్టన్నింగ్ లుక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తండ్రి చిరంజీవితో కలిసి చరణ్ నటించిన ఆచార్య డిజాస్టర్ కావడంతో అతని తర్వాతి సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. శంకర్ డైరెక్షన్ కావడంతో ఈ గేమ్ ఛేంజర్ సూపర్ డూపర్ హిట్ కొట్టాలన్న ఆశతో వాళ్లు ఉన్నారు.
చాన్నాళ్లుగా ఈ మూవీ నుంచి పెద్దగా అప్డేట్స్ లేకపోవడంతో నిరాశ చెందిన అభిమానులకు ఒకే రోజు రెండు సర్‌ప్రైజ్ లు ఇచ్చారు. ఉదయం టైటిల్ రివీల్ చేయడంతోపాటు మధ్యాహ్నం ఫస్ట్ లుక్ తీసుకొచ్చారు. ఈ సినిమాను తెలుగు, తమిళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు. శ్రీకాంత్, అంజలి, ఎస్‌జే సూర్య, నవీన్ చంద్రలాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
సంబంధిత కథనం