RC15 Song Shoot: ఆర్సీ15 నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. ఒక్క సాంగ్‌కే రూ.15 కోట్లు-rc15 song shoot to be done from november 20th with the budget of 15 crores ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rc15 Song Shoot To Be Done From November 20th With The Budget Of 15 Crores

RC15 Song Shoot: ఆర్సీ15 నుంచి అదిరిపోయే అప్‌డేట్‌.. ఒక్క సాంగ్‌కే రూ.15 కోట్లు

HT Telugu Desk HT Telugu
Nov 16, 2022 08:05 PM IST

RC15 Song Shoot: ఆర్సీ15 నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. ఈ మూవీలో ఒక్క సాంగ్‌ షూటింగ్‌కే రూ.15 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ తాజా అప్‌డేట్‌తో రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ ఓ రేంజ్‌లో పండగ చేసుకుంటున్నారు.

కియారా అద్వానీ, రామ్ చరణ్
కియారా అద్వానీ, రామ్ చరణ్ (twitter)

RC15 Song Shoot: డైరెక్టర్‌ శంకర్‌ ఏం చేసినా ఓ సంచలనమే. 90వ దశకంలో అతని సినిమాలు ఓ ప్రభంజనం. ఒక్కో సినిమాలో ఒక్కో ప్రత్యేకతతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం శంకర్‌కే సాధ్యం. జెంటిల్మన్‌, భారతీయుడు, జీన్స్‌, ప్రేమికుడు, ఒకే ఒక్కడు.. ఇలా ప్రతి సినిమా ఓ సంచలనమే. భారీ బడ్జెట్‌తో సినిమాలు చేయడం శంకర్‌ అలవాటు.

బడ్జెట్‌ ఒక్కటే కాదు.. తన ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశం ఒకటి ఉంటుంది. తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో అతడు చేస్తున్న ఆర్సీ15 మూవీలోనూ అలాంటిదే ఓ ప్రత్యేకత ఉండబోతోంది. దీనికి సంబంధించి బుధవారమే (నవంబర్‌ 16) మూవీ మేకర్స్‌ ఓ కీలకమైన అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమాలోని ఒక పాట కోసమే ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు చేయనున్నారన్నది ఆ అప్‌డేట్‌ సారాంశం.

సౌతిండియాలో ఇదే అత్యంత ఖరీదైన పాటగా రికార్డు నెలకొల్పనుంది. ఈ సాంగ్‌ను నవంబర్‌ 20 నుంచి డిసెంబర్ 2 వరకూ చిత్రీకరించనున్నారు. మూవీలోని లీడ్‌ రోల్స్‌ రామ్‌చరణ్‌, కియారా అద్వానీలపై ఈ సాంగ్‌ షూట్‌ చేయనున్నారు. 12 రోజులు, రూ.15 కోట్ల బడ్జెట్‌.. ఒక పాట అంటేనే అది ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. పైగా శంకర్‌ టేకింగ్‌ కూడా చాలా రిచ్‌గా ఉంటుంది.

ప్రస్తుతం ఇండియన్‌ 2 మూవీ షూటింగ్‌ కూడా చేస్తున్న శంకర్‌.. గ్యాప్‌ దొరికినప్పుడల్లా ఆర్సీ15 షూటింగ్‌కు టైమ్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ అత్యంత ఖరీదైన పాట షూట్ కోసం శంకర్‌ సమయం కేటాయించాడు. ఈ సాంగ్‌లో రామ్‌చరణ్, కియారా అదిరిపోయే స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది. వివిధ దేశాల్లో ఈ పాటను చిత్రీకరించడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ పాటను అనుకున్నట్లుగా షూట్‌ చేయడానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సాంగ్‌ ఆర్సీ15 మూవీకే హైలైట్‌గా నిలవనుందనడంలో సందేహం లేదు. గతంలో జీన్స్‌ మూవీలోనూ శంకర్‌ అప్పటి ప్రపంచంలోని ఏడు వింతల దగ్గర ఒక పాటను చిత్రీకరించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ అతిశయం పాట ఇప్పటికీ ఇండియన్‌ సినిమా హిస్టరీలో హైలైట్‌గా నిలుస్తోంది.

ఇప్పుడు ఆర్సీ15 మూవీని కూడా శంకర్‌ తనదైన రీతిలో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ ఈ మూవీకి కథ అందించాడు. ఇక దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ కింద నిర్మిస్తున్నాడు. ఇది తెలుగు, తమిళం భాషల్లో రిలీజ్‌ కానుంది. తమన్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు.

IPL_Entry_Point