Shruti Haasan wrapped Salaar: ప్రభాస్-ప్రశాంత్‌పై శృతి హాసన్ ప్రశంసల వర్షం.. చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపిన భామ-shruti haasan wraps up salaar shoot and says thanks to prabhas and prashant neel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Shruti Haasan Wraps Up Salaar Shoot And Says Thanks To Prabhas And Prashant Neel

Shruti Haasan wrapped Salaar: ప్రభాస్-ప్రశాంత్‌పై శృతి హాసన్ ప్రశంసల వర్షం.. చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపిన భామ

Maragani Govardhan HT Telugu
Feb 23, 2023 08:39 PM IST

Shruti Haasan wrapped Salaar: శృతిహాసన్ సలార్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందానికి ధన్యావాదాలు తెలిపింది. ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో ప్రభాస్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్, సినిమాటోగ్రాఫర్ భువన గౌడతో శృతి హాసన్
సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్, సినిమాటోగ్రాఫర్ భువన గౌడతో శృతి హాసన్

Shruti Haasan wrapped Salaar: స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో సందడి చేసింది. ఇందులో చిరంజీవి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ఈ ఏడాది మరో భారీ ప్రాజెక్టుతో అలరించనుంది. అదే ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న సలార్ చిత్రం. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది శృతి. సలార్ సినిమాలోని తన చిత్రీకరణ పూర్తయినట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టును పెట్టింది.

సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్, సినిమాటోగ్రాఫర్ భువన గౌడతో దిగిన ఫొటోను శృతి షేర్ చేసింది. అంతేకాకుండా తనను ఈ సినిమా భాగం చేసినందనకు ప్రభాస్, ప్రశాంత్ నీల్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పింది.

"సలార్‌లో నా షూటింగ్ పూర్తయింది. ఆద్యగా ఈ సినిమాలో నాకు అవకాశమిచ్చినందుకు ప్రశాంత్ సార్ మీకు థ్యాంక్స్. మీరు అసాధారణమైనవారు. థ్యాంక్యూ ప్రభాస్ మీతో నటించడం అద్భుతంగా ఉంది. నిజంగా మీరు డార్లింగ్. భువన్ మీరు చాలా దయగలవారు. హోంబళే ఫిల్మ్స్ టీమ్‌తో కలిసి పనిచేయడం చాలా ప్రత్యేకంగా ఉంది. మీరంతా కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు." అంటూ శృతిహాసన్ తన ఇన్‌స్టాలో పేర్కొంది.

ప్రభాస్ నటిస్తున్న సలార్ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చొంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా చేసింది. హోంబళే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబరు 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం. పాన్ఇండియా రేంజ్‌లో సినిమా విడుదల చేయనుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం