Ntr Koratala Shiva Movie: 582 రోజుల తర్వాత కెమెరా ముందుకొచ్చిన ఎన్టీఆర్ - కొర‌టాల మూవీ షూటింగ్ మొద‌లుపెట్టేశాడు-ntr 30 update ntr begins koratala siva movie shooting on today ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Ntr 30 Update Ntr Begins Koratala Siva Movie Shooting On Today

Ntr Koratala Shiva Movie: 582 రోజుల తర్వాత కెమెరా ముందుకొచ్చిన ఎన్టీఆర్ - కొర‌టాల మూవీ షూటింగ్ మొద‌లుపెట్టేశాడు

ఎన్టీఆర్‌, జాన్వీక‌పూర్‌ల‌పై క్లాప్‌ ఇస్తోన్న రాజ‌మౌళి
ఎన్టీఆర్‌, జాన్వీక‌పూర్‌ల‌పై క్లాప్‌ ఇస్తోన్న రాజ‌మౌళి

Ntr Koratala Shiva Movie: దాదాపు 19 నెలల గ్యాప్ తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చాడు ఎన్టీఆర్‌. శుక్ర‌వారం కొర‌టాల శివ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టాడు. ఆత‌డికి చిత్ర యూనిట్ సాద‌ర స్వాగ‌తం ప‌లికింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Ntr Koratala Shiva Movie: ఎన్టీఆర్ (Ntr) అభిమానులు ఖుషి అయ్యే న్యూస్ వ‌చ్చేసింది. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత సినిమా షూటింగ్‌ల‌కు లాంగ్ గ్యాప్ ఇచ్చిన‌ ఎన్టీఆర్ దాదాపు 19 నెల‌ల విరామం త‌ర్వాత మ‌ళ్లీ కెమెరా ముందుకొచ్చాడు. కొర‌టాల శివ (Koratala Siva) సినిమా షూటింగ్‌ను శుక్ర‌వారం నుంచి మొద‌లుపెట్టారు.

ట్రెండింగ్ వార్తలు

తొలిరోజు సెట్స్‌లో అడుగుపెట్టిన ఎన్టీఆర్‌కు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో పాటు చిత్ర యూనిట్ సాద‌ర స్వాగ‌తం ప‌లికింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ప్ర‌జెంట్ హైద‌రాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. స్పెష‌ల్‌గా డిజైన్ చేసిన ఓ భారీ సెట్స్‌లో ఎన్టీఆర్‌పై యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఆర్ఆర్ఆర్ తర్వాత గ్యాప్

2021 లో ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా షూటింగ్‌ను పూర్తిచేశారు ఎన్టీఆర్‌. ఆ త‌ర్వాత ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌, ఆస్కార్ కాంపెయిన్‌తోనే దాదాపు ఏడాదిన్న‌ర పాటు బిజీగా ఉన్నారు. సుదీర్ఘ విరామం త‌ర్వాత కొత్త సినిమా షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌డంతో అభిమానుల్లో ఆనందం వ్య‌క్త‌మ‌వుతోంది.

కోస్ట‌ల్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. ఇందులో మ‌నుషులు, దేవుడు అంటే భ‌యంలేని ఓ ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో ఎన్టీఆర్ న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీక‌పూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎన్టీఆర్ సినిమాతోనే జాన్వీ క‌పూర్‌ టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయ‌బోతున్న‌ది.

పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో తెలుగు, హిందీతో పాటు ఇత‌ర భాష‌ల్లో 2024 ఏప్రిల్ 5న ఎన్టీఆర్‌, కొర‌టాల శివ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.