Sarkaar OTT: ‘యుద్ధం గెలిచిన రాముడు’: పవన్ కల్యాణ్‍పై నిహారిక కామెంట్స్.. ఓటీటీలో సర్కార్ స్పెషల్ ఎపిసోడ్ ఎప్పుడంటే..
Sarkaar Success Party OTT: సర్కార్ సక్సెస్ పార్టీ వచ్చేస్తోంది. 4వ సీజన్ విజయవంతం కావటంతో ఈ స్పెషల్ ఎపిసోడ్‍ను ఆహా ఓటీటీ తీసుకొస్తోంది. ఈ ఎపిసోడ్‍కు గెస్టుగా హాజరైన నిహారిక.. పవన్ కల్యాణ్‍పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.
ఆహా ఓటీటీలో సర్కార్ 4వ సీజన్ సూపర్ సక్సెస్ అయింది. సుడిగాలి సుధీర్ హోస్ట్ చేసిన ఈ సీజన్ భారీ వ్యూస్ దక్కించుకుంది. ఈ సీజన్‍లో ఈ గేమ్ షో 12 ఎపిసోడ్లు రాగా.. అన్నీ బాగా పాపులర్ అయ్యాయి. తన మార్క్ టైమింగ్‍లో సుధీర్ ఆకట్టుకున్నారు. సర్కార్ 4వ సీజన్ అదరగొట్టడంతో సక్సెస్ పార్టీ నిర్వహిస్తోంది ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్. ఈ స్పెషల్ ఎపిసోడ్‍కు మెగా డాటర్ నిహారిక గెస్టుగా వచ్చారు.
‘యుద్ధం గెలిచాక వచ్చినప్పుడు..’
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలువటంతో పాటు డిప్యూటీ సీఎం అయ్యారు. తాను ఎన్నికల్లో గెలిచాక తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి పాదాభివందనం చేశారు పవన్. ఈ సందర్భాన్ని నిహారిక ఈ షోలో గుర్తు చేసుకున్నారు. రాముడు యుద్ధం గెలిచి అయోధ్యకు వచ్చాక ఇలాగే ఉండిందేమో అనిపించిందని చెప్పారు.
డిప్యూటీ సీఎం తాలూకా..
సర్కార్ సక్సెస్ పార్టీకి సంబంధించిన చిన్న ప్రోమోను ఆహా ఓటీటీ తీసుకొచ్చింది. తనను ఈ సీజన్‍కు పిలువలేదని, వచ్చే సీజనేనా అని సుధీర్‌తో నిహారిక అన్నారు. “మీ కేంటండి.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలుకా” అని సుధీర్ అన్నారు. ఆ తర్వాత గెలిచిన తర్వాత చిరంజీవి ఆశీర్వాదాన్ని పవన్ తీసుకున్న విజువల్స్ ఈ ప్రోమోలో ఉన్నాయి. ఇది చూసిన నిహారిక “యుద్ధం గెలిచాక రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు ఇలాగే ఉండిందేమో అనిపించింది” అని అన్నారు. బాబాయ్ పవన్ గురించి నిహారిక చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్ట్రీమింగ్ ఎప్పుడు..
సర్కార్ సక్సెస్ పార్టీ ఎపిసోడ్ ఆగస్టు 2వ తేదీన రాత్రి 8 గంటలకు స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ ప్రోమోతోనే స్ట్రీమింగ్ డేట్‍ను ఆ ఓటీటీ వెల్లడించింది.
మెగా ఫ్యాన్స్ మనసుల్లో నిలిచిన సందర్భం
2014 ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినా.. ఈ ఏడాది 2024 ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన అద్భుత విజయం సాధించింది. పోటీ చేసిన 21 చోట్ల గెలిచి రికార్డు సృష్టించింది. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు పవన్ కల్యాణ్. ఈ గెలుపు తర్వాత అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరూతో పాటు వదిన కాళ్లకు నమస్కరించారు. పవన్‍కు పూలమాల వేసి అభినందనలు తెలిపారు చిరంజీవి. ఆ సందర్భంలో మెగా బ్రదర్ నాగబాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భాలు మెగా అభిమానుల మనసుల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి.
సర్కార్ సీజన్ 4 గురించి..
సర్కార్ సీజన్ 3కి ప్రదీప్ హోస్ట్ చేయగా.. నాలుగో సీజన్‍లో సుధీర్ ఎంట్రీ ఇచ్చేశారు. సుధీర్ తన స్టైల్‍లో షోను ఎంటర్‌టైనింగ్‍గా నడిపారు. ఈ సీజన్ తొలి ఎపిసోడ్‍లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్, రాహుల్ రామకృష్ణతో పాటు మరో ఇద్దరు వచ్చారు. పంచ్‍లతో ఈ ఎపిసోడ్ సక్సెస్ అయింది. శ్రీగౌరి ప్రియ, మానస, శివానీ, అనన్య నాగళ్ల పాల్గొన్న ఎపిసోడ్ కూడా పాపులర్ అయింది. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆడిన ఎపిసోడ్ ఈ సర్కార్ సీజన్ 4 హైలైట్‍గా నిలిచింది. మొత్తంగా 12 ఎపిసోడ్ల పాటు ఈ నాలుగో సీజన్ సాగింది. త్వరలోనే ఐదో సీజన్‍ను కూడా ఆహా తీసుకొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.