Murder Mubarak OTT: ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?-murder mubarak ott streaming on netflix from march 15 pankaj tripathi sara ali khan vijay varma karisma kapoor ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Murder Mubarak Ott Streaming On Netflix From March 15 Pankaj Tripathi Sara Ali Khan Vijay Varma Karisma Kapoor

Murder Mubarak OTT: ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

Sanjiv Kumar HT Telugu
Mar 15, 2024 08:14 AM IST

Murder Mubarak OTT Streaming: ఓటీటీలోకి మరో సరికొత్త క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. అదే మర్డర్ ముబారక్. పంకజ్ త్రిపాఠీ, సారా అలీ ఖాన్, కరిష్మా కపూర్ వంటి అగ్ర నటీనటులు యాక్ట్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మర్డర్ ముబారక్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

Murder Mubarak OTT Release: ఓటీటీల హవా పెరగడంతో ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. థియేటర్లలో చూపించని కంటెంట్‌ను ఓటీటీల ద్వారా చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. అలా క్రైమ్, హారర్, అడల్ట్, ఫాంటసీ, కామెడీ అంటూ వివిధ జోనర్లలో సినిమాలు వచ్చేస్తున్నాయి. అయితే ఏ చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన సినిమా లేదా వెబ్ సిరీస్ అయినా భాషా బేధం లేకుండా ఇతర లాంగ్వేజెస్‌లో కూడా స్ట్రీమింగ్ చేస్తున్నారు.

మిస్టరీ థ్రిల్లర్ మూవీ

ఓటీటీల్లోకి ప్రతి వారం ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వచ్చినట్లే ఈ వారం సరికొత్త మూవీస్ వచ్చాయి. వాటిలో మార్చి 15 శుక్రవారం విడుదల అయ్యే సినిమాలు కాస్తా స్పెషల్‌గా ఉండనున్నాయి. అలాంటి వాటిలో క్రైమ్ అండ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా మర్డర్ ముబారక్ ఒకటి. బాలీవుడ్ స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ నటించిన మరో ఓటీటీ సినిమానే మర్డర్ ముబారక్. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు పాపులర్ డైరెక్టర్ హోమీ అదజానియా దర్శకత్వం వహించారు.

క్లబ్ యూ టు డెత్ నవల

మర్డర్ ముబారక్ సినిమాలో సారా అలీ ఖాన్‌తో పాటు వెర్సటైల్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి (మీర్జాపూర్, సేక్ర్‌డ్ గేమ్స్ ఫేమ్), విజయ్ వర్మ, డింపుల్ కపాడియా, కరిష్మా కపూర్, సంజయ్ కపూర్, టిస్కా చోప్రా, సుహైల్ నయ్యర్, తారా అలీషా బెర్నీ వంటి అగ్ర తారలు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను మడోక్ ఫిల్మ్స్ బ్యానర్‌లో నిర్మాత దినేష్ నిర్మించారు. మర్డర్ ముబారక్ అనే సినిమాను అనుజా చౌహాన్ రాసిన క్లబ్ యూ టు డెత్ నవల ఆధారంగా తెరకెక్కించారు.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

మర్డర్ ముబారక్ సినిమా ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మర్డర్ ముబారక్ సినిమాను మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇదివరకు ప్రకటించినట్లుగానే నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ మర్డర్ ముబారక్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి క్రైమ్ అండ్ మిస్టరీ, ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి ఈ సినిమా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

మర్డర్ మిస్టరీ

మర్డర్ ముబారక్‌లో పంకజ్ త్రిపాఠి పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. సంపన్నుల సభ్యులుగా ఉండే ది రాయల్ ఢిల్లీ క్లబ్‌లో హత్య జరుగుతుంది. సంచలనం రేపిన ఈ హత్య వెనుక ఉన్న కారణాలను, మర్డర్ ఎవరు చేశారు అనే మిస్టరీ ఛేదించేందుకు పవర్ ఫుల్ ఫోలీస్ ఆఫీసర్ భవానీ సింగ్ (పంకజ్ త్రిపాఠి) రంగంలోకి దిగుతాడు. ఈ కేసును అతను ఎలా సాల్వ్ చేశాడు. ఎవరిపై అనుమానాలు వచ్చారు. హత్యలో ఎవరి హస్తం ఉందనే అంశాల చుట్టూ తిరుగుతుంది మర్డర్ ముబారక్.

గత సినిమాలు, సిరీస్

ఇదిలా ఉంటే 2023 ఫిబ్రవరిలోనే మర్డర్ ముబారక్ షూటింగ్ మొదలు పెట్టారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది మర్డర్ ముబారక్. దీనికి లినేష్ దేశాయ్ సినిమాటోగ్రఫీ అందించగా.. సచిన్ జిగర్ సంగీతం అందించారు. కాగా మూవీ డైరెక్టర్ హోమీ అదజానియా ఇదివరకు సాస్ బహు ఔర్ ఫ్లెమింగో అనే క్రైమ్, రివేంజ్ డ్రామా వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. అంతకుముందు కాక్ టెయిల్, ఫైండింగ్ ఫాన్నీ, బీయింగ్ సైరస్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

WhatsApp channel