Oscar Winner Oppenheimer OTT: 3 ఓటీటీల్లో 7 ఆస్కార్స్ గెలిచిన ఓపెన్ హైమర్.. తెలుగులో స్ట్రీమింగ్, ఎక్కడంటే?
Oscar Winner Oppenheimer OTT Streaming: ఆస్కార్స్ 2024లో ఏకంగా 13 నామినేషన్లలో నామినేట్ అయి 7 అవార్డ్స్ కొల్లగొట్టిన భారీ బ్లాక్ బస్టర్ మూవీ ఓపెన్ హైమర్ ఏకంగా మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. మరో పది రోజుల్లో కొత్త ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
Oscar Winner Oppenheimer OTT Release: ఆస్కార్ 2024 అవార్డ్స్‌లో (Academy Awards 2024) ఓపెన్‌హైమర్ సినిమా ఏకంగా 7 అవార్డ్స్ గెలుచుకుంది. మొత్తం 13 నామినేషన్లలో ఎంపికైన ఓపెన్ హైమర్ ఏడు అత్యధికంగా ఆస్కార్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. మొత్తం 13 నామినేషన్లలో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్‌తోపాటు ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్‌లో ఆస్కార్స్ సాధించింది ఓపెన్ హైమర్.

ఇప్పుడు 7 ఆస్కార్స్ సాధించిన ఓపెన్ హైమర్ మూవీ బాక్సాఫీస్ వద్ద 900 మిలియన్ల డాలర్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. సుమారు 100 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఓపెన్ హైమర్ సినిమా నిర్మాతలకు తొమ్మిదో వంతు లాభాలు వచ్చాయి. అంతేకాకుండా 2023లో హాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో సినిమాగా ఓపెన్ హైమర్ రికార్డ్ క్రియేట్ చేసింది. వరల్డ్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా మరో చరిత్ర సృష్టించింది.
ఇంతటి ఘన విజయం సాధించి, 7 ఆస్కార్స్ కొల్లగొట్టిన ఓపెన్ హైమర్ సినిమా ఇప్పటికే రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. 2023 జూలై 23న థియేటర్లలో విడుదలైన ఓపెన్ హైమర్ మూవీ గతేడాది నవంబర్ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, అమెజాన్ ప్రైమ్‌లో రూ. 149 రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. 149 చెల్లించి ఈ సినిమాను చూడాలి. అలాగే బుక్ మై షో ఓటీటీలో కూడా రూ. 199 చెల్లించి ఓపెన్ హైమర్‌ను వీక్షించే సదుపాయం కల్పించారు.
అయితే, ఇప్పుడు మరో ఓటీటీలోకి ఓపెన్ హైమర్ మూవీ రానుంది. జియో సినిమా ఓటీటీలో మార్చి 21 నుంచి ఓపెన్ హైమర్‌ను స్ట్రీమింగ్ చేయనున్నారు. అంటే, జియో సినిమా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్‌కు ఇంకా పది రోజులే మిగిలి ఉన్నాయి. అయితే, జియో సినిమాలో దాదాపుగా చాలా సినిమాలు ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా చూసే వెసులుబాటు ఉంది. కానీ, పలు హాలీవుడ్ సినిమాలకు సబ్ స్క్రిప్షన్ తప్పనిసరి.
అలాగే ఓపెన్ హైమర్ సినిమాను చూడాలంటే జియో సినిమా ఓటీటీ ప్రీమియమ్ సబ్ స్క్రిప్షన్ ఉండాలి. ప్రీమియమ్ చందాదారులు మాత్రమే ఓపెన్ హైమర్ సినిమాను జియో సినిమాలో ఇంగ్లీషుతోపాటు హిందీ పలు దక్షిణాది భాషల్లో చూసే అవకాశం ఉంది. అంటే ఓపెన్ హైమర్‌ను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఓపెన్ హైమర్ సినిమాను హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) తెరకెక్కించారు.
ఓపెన్ హైమర్ మూవీలో టైటిల్ రోల్‌లో సిలియన్ మర్ఫీ (Cillian Murphy) నటించి ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డ్ అందుకున్నాడు. అలాగే అమెరికా అధ్యక్షుడు లూయిస్ స్ట్రాస్‌గా రాబర్ట్ డౌనీ జూనియర్ (Robert Downey Jr)నటించాడు. డౌనీకి ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ వరించింది. వీరితోపాటు ఓపెన్ హైమర్‌లో ఫ్లోరెన్స్ పగ్, గ్యారీ ఓల్డ్‌మాన్, రామి మాలెక్, కెన్నెత్ బ్రానాగ్ కీలక పాత్రలు పోషించారు.