Damsel Review: డామ్‌సెల్ రివ్యూ.. ఓటీటీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?-damsel review in telugu and rating millie bobby brown angela bassett ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Damsel Review: డామ్‌సెల్ రివ్యూ.. ఓటీటీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Damsel Review: డామ్‌సెల్ రివ్యూ.. ఓటీటీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Published Mar 14, 2024 05:40 AM IST

Damsel Movie Review In Telugu: ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ డామ్‌సెల్ ఆకట్టుకుంటోంది. హాలీవుడ్‌లో 20 ఏళ్లకే స్టార్ హీరోయిన్‍‌గా పేరు తెచ్చుకుంటోన్న మిల్లీ బాబీ బ్రౌన్ నటించిన ఈ సినిమా ఎలా ఉందో డామ్‌సెల్ రివ్యూలో చూద్దాం.

డామ్‌సెల్ రివ్యూ.. ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్.. డ్రాగెన్‌తో యువతి చేసే పోరాటం ఎలా ఉందంటే?
డామ్‌సెల్ రివ్యూ.. ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్.. డ్రాగెన్‌తో యువతి చేసే పోరాటం ఎలా ఉందంటే?

Damsel Review Telugu: మార్చి 8 నుంచి ఓటీటీలో రెండు ఫాంటసీ అడ్వెంచర్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో ఒకటి సందీప్ కిషన్ నటించిన హారర్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఊరు పేరు భైరవకోన అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 2 ట్రెండింగ్‌లో ఉంది. రెండోది హాలీవుడ్ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా వచ్చిన డామ్‌సెల్ మూవీ. ‌నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 8 నుంచి ఇంగ్లీషుతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా సైతం సదరు ఓటీటీలో టాప్ 2 ట్రెండింగ్‌లో ఆకట్టుకుంటోంది.

మిల్లీ బాబీ బ్రౌన్

హాలీవుడ్ పాపులర్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్‌తోపాటు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, ఎనోలా హోల్మ్స్ వంటి స్పై ఫ్రాంఛైజీతో ఎంతో ఆకట్టుకున్న హీరోయిన్ మిల్లీ బాబీ బ్రౌన్ (Millie Bobby Brown). 20 ఏళ్ల మిల్లీ బాబీ బ్రౌన్ నటించిన కొత్త ఫాంటసీ అడ్వెంచర్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్‌ మూవీనే డామ్‌సెల్. మిల్లీతో పాటు నిక్ రాబిన్‌సన్, రోబిన్ రైట్, ఏంజెలా బస్సెట్, రే విన్‌స్టోన్, బ్రూక్ కార్టర్ తదితరులు నటించిన డామ్‌సెల్ సినిమాకు జువాన్ కార్లోస్ ఫ్రెస్నాడిల్లో దర్శకత్వం వహించారు. మరి డామ్‌సెల్ ఎలా ఉందో రివ్యూలో (Damsel Movie Review) చూద్దాం.

కథ:

ప్రిన్సెస్ ఎలోడి (మిల్లీ బాబీ బ్రౌన్) ఒక ప్రాంతానికి యువరాణి. కానీ, ఆమె రాజ్యం కరువు కాటకాలతో సతమతం అవుతుంది. ఈ క్రమంలో ఎలోడిని ఎదురు కట్నం ఇచ్చి వివాహం చేసుకునేందుకు మరో రాజ్యపు మహారాణి క్వీన్ ఇసాబెల్లా (రోబిన్ రైట్) నుంచి సందేశం వస్తుంది. మహారాణి కుమారుడు ప్రిన్స్ హెన్రీ (నిక్ రాబిన్‌సన్)తో ఎలోడి వివాహం జరిపించేందుకు ఆమె తండ్రి లార్డ్ బే ఫోర్డ్ (రే విన్‌స్టోన్), సవతి తల్లి లేడి బే ఫోర్డ్ (ఏంజెలా బస్సెట్) ఒప్పుకుంటారు. అందుకు మహారాణి రాజ్యానికి ఎలోడి కుటుంబం అంతా వెళ్తుంది.

ప్రిన్స్ హెన్రీతో వివాహం అనంతరం పూర్వీకులకు మర్యాదలు చేయాలన్న కారణంతో ఫైర్ డ్రాగెన్ ఉన్న గుహలోకి తీసుకెళ్లి అందులో ఎలోడిని పడేస్తారు. మరి ఆ గుహలోని డ్రాగెన్ నుంచి ఎలోడి తప్పించుకుందా? ప్రాణాలతో బయట పడిందా? ఆ గుహలో ఎలోడి తెలుసుకున్న విషయాలు ఏంటీ? అసలు ఎలోడిని గుహలో పడేసేందుకు గల కారణాలు ఏంటీ ? మహారాణి వంశానికి డ్రాగెన్‌కు ఉన్న సంబంధం ఏంటీ? చివరికి ఎలోడి ఏమైంది? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే డామ్‌సెల్ చూడాల్సిందే.

విశ్లేషణ:

డామ్‌సెల్ అంటే స్పానిష్‌ భాషలో పెళ్లి కాని యువతి, ఓ అమ్మాయి అని అర్థం వస్తుంది. డామ్‌సెల్ మూవీ ఒక ఫాంటసీ అడ్వెంచర్ అండ్ సర్వైవలర్ థ్రిల్లర్. ఒక ఫైర్ డ్రాగెన్ నుంచి ఓ యువతి ఎలా ప్రాణాలతో బయటపడిందనే కథాంశంతో సాగుతుంది. డామ్‌సెల్ మూవీ ప్రారంభం నుంచే ఎంగేజ్ చేస్తుంది. ప్రిన్సెస్ ఎలోడి రాజ్యం పరిస్థితి, అందులోనుంచి బయట పడేందుకు వివాహం ఒప్పుకోవడం, అలా వచ్చిన ఎదురు కట్నంతో రాజ్యాన్ని కాపాడుకోవాలనుకోవడం వంటి సీన్లతో స్టోరీ ముందుకెళ్తుంది.

మూవీ హైలెట్స్

ఇక ఎలోడి వివాహం తర్వాత అసలు కథ మొదలవుతుంది. గుహలో సీన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అందులో మాట్లాడే ఫైర్ డ్రాగెన్‌ నుంచి ఎలోడి తప్పించుకునే సీన్స్, వాటి మధ్య కన్వర్జేషన్ మంచి థ్రిల్లింగ్ ఇస్తాయి. అలాగే గుహలో కనిపించే కొన్ని పురుగులు కొత్తగా అనిపిస్తాయి. గుహలో ఎలోడి తెలుసుకునే విషయాలు, డ్రాగెన్‌తో ఫైట్ సీన్స్, ఎలోడి తెలివితేటలు మెప్పిస్తాయి. అయితే, స్టోరీని దాదాపుగా గెస్ చేసేయొచ్చు. నెక్ట్స్ వచ్చే సీన్స్ ఊహించొచ్చు.

ఆద్యంతం ఎంగేజింగ్‌గా

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్లేదు. కానీ, విజువల్స్, సినిమాటోగ్రఫీ మాత్రం ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ బాగానే ఎండ్ చేశారు. డామ్‌సెల్ మూవీ మరి గొప్పగా ఉందని చెప్పలేం. కానీ, చూస్తున్నంతసేపు ఎంగేజ్ చేస్తుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్, విచర్ వంటి తదితర సిరీస్ చూసిన ప్రో ఆడియెన్స్‌కు మాత్రం సినిమా పెద్దగా రుచించదు. సాధారణ ఆడియెన్స్‌కు మాత్రం మంచి టైమ్ పాస్ మూవీ. ఇక ఎలోడిగా చేసిన మిల్లీ బాబీ బ్రౌన్ ఎమోషనల్ సీన్స్, యాక్షన్ ఇలా అన్నింటిల్లో అదరగొట్టింది.

మిల్లీ బాబీ బ్రౌన్ వన్ వుమెన్ షో

Damsel Review In Telugu: హాలీవుడ్‌కు జూనియర్ ఏంజిలినా జోలీ వచ్చేసిందని టాక్ కూడా వినిపిస్తోంది. సినిమాలో మిల్లీ వన్ వుమెన్ షో అని చెప్పొచ్చు. ఇక ఎలోడికి స్టెప్ మదర్ (సవతి తల్లి) క్యారెక్టర్ చేసిన ఏంజెలా బస్సెట్ తన నటనతో మెప్పించింది. హావాభావాలు, ఎమోషన్ చాలా బాగా పలకించింది. మిగతా క్యారెక్టర్స్ కూడా తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఫైనల్‌గా చెప్పాలంటే.. కుటుంబంతో కలిసి చూసేందుకు మంచి టైమ్ పాస్ మూవీ డామ్‌సెల్. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మంచి ఎంటర్టైనర్‌ డామ్‌సెల్ సినిమా.

రేటింగ్: 2.5/5

Whats_app_banner