Mr Bachchan Twitter Review: ఏం సినిమా రా అయ్యా.. బొమ్మ బ్లాక్‌బస్టర్.. మిస్టర్ బచ్చన్‌కు ఫ్యాన్స్ మిక్స్‌డ్ రివ్యూలు-mr bachchan twitter review ravi teja bhagyasree borse movie fans mixed reviews on social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mr Bachchan Twitter Review: ఏం సినిమా రా అయ్యా.. బొమ్మ బ్లాక్‌బస్టర్.. మిస్టర్ బచ్చన్‌కు ఫ్యాన్స్ మిక్స్‌డ్ రివ్యూలు

Mr Bachchan Twitter Review: ఏం సినిమా రా అయ్యా.. బొమ్మ బ్లాక్‌బస్టర్.. మిస్టర్ బచ్చన్‌కు ఫ్యాన్స్ మిక్స్‌డ్ రివ్యూలు

Hari Prasad S HT Telugu
Aug 15, 2024 08:36 AM IST

Mr Bachchan Twitter Review: రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీకి సోషల్ మీడియాలో మిక్స్‌డ్ రివ్యూలు వస్తున్నాయి. బొమ్మ బ్లాక్‌బస్టర్ అని ఓవైపు.. ఇదేం సినిమా రా అయ్యా అని మరోవైపు ప్రేక్షకులు రివ్యూలు ఇవ్వడం విశేషం.

బొమ్మ బ్లాక్‌బస్టర్.. ఏం సినిమా రా అయ్యా.. మిస్టర్ బచ్చన్‌కు ఫ్యాన్స్ మిక్స్‌డ్ రివ్యూలు
బొమ్మ బ్లాక్‌బస్టర్.. ఏం సినిమా రా అయ్యా.. మిస్టర్ బచ్చన్‌కు ఫ్యాన్స్ మిక్స్‌డ్ రివ్యూలు

Mr Bachchan Twitter Review: మాస్ మహారాజా రవితేజ హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఖాయమేనా? మిస్టర్ బచ్చన్ కు సోషల్ మీడియాలో వస్తున్న రివ్యూలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అక్కడక్కడా కొన్ని పాజిటివ్ రివ్యూలు కనిపిస్తున్నా.. అవి కేవలం అభిమానుల వరకే పరిమితమయ్యాయని, న్యూట్రల్ ప్రేక్షకులను మూవీ ఆకట్టుకోలేకపోయిందని మిగతా రివ్యూలు చూస్తే స్పష్టమవుతోంది.

మిస్టర్ బచ్చన్ ట్విటర్ రివ్యూ

టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ మూవీ డిజాస్టర్ల తర్వాత రవితేజ నటించిన మూవీ మిస్టర్ బచ్చన్. హ్యాట్రిక్ ఫ్లాపుల నుంచి తప్పించుకోవడానికి ఈసారి హరీష్ శంకర్ డైరెక్షన్, హిందీలో సూపర్ హిట్ అయిన రెయిడ్ (Raid) మూవీ రీమేక్ ను ఎంచుకున్నాడు. అయితే అది కూడా ఈ మాస్ మహారాజాను ఆదుకోవడం కష్టమే అని ఎర్లీ రివ్యూలను బట్టి చూస్తే తెలుస్తోంది.

గురువారం (ఆగస్ట్ 15) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోల హడావిడి మొదలు కావడంతో ముందుగానే రివ్యూలు బయటకు వచ్చేశాయి. తెల్లవారుఝాము నుంచే సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ప్రేక్షకులు సినిమాపై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. అయితే మొత్తంగా చూస్తే మిక్స్‌డ్ రివ్యూలే వస్తున్నాయి.

బ్లాక్‌బస్టరా.. డిజాస్టరా?

మిస్టర్ బచ్చన్ సినిమా చూసిన ఓ అభిమాని.. బొమ్మ బ్లాక్‌బస్టర్.. ఎక్కడ చూసినా పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి అని ఓ ట్వీట్ చేశారు. ఇదొక మాస్ ఎంటర్టైనర్, థియేటర్లలో చూడాల్సిన సినిమా.. రవితేజ పర్ఫార్మెన్స్, భాగ్యశ్రీ బోర్సె గ్లామర్, హరీష్ శంకర్ టేకింగ్ చాలా బాగుందని మరొకరు కామెంట్ చేశారు.

ఒకసారి చూడాల్సిన సినిమా.. రవితేజ ఎప్పటిలాగే చించేయగా.. భాగ్యశ్రీ అందంతో ఆకట్టుకుంది.. ఫ్యామిలీస్ డబుల్ ఇస్మార్ట్ కంటే మిస్టర్ బచ్చన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అని మరో అభిమాని తన రివ్యూ ఇచ్చారు. సినిమాలోని పాటలు, మాస్ స్టెప్పులను కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

మరోవైపు అంతకుమించిన నెగటివ్ రివ్యూలు కూడా వస్తున్నాయి. "షో ఇప్పుడే పూర్తయింది. మరో 20 నిమిషాలు ఉండగానే చాలా మంది లేచి వెళ్లిపోయారు. ఇంకెన్నాళ్లు ఇలాంటి రొడ్డకొట్టుడు స్టోరీ, స్క్రీన్‌ప్లేతో మూవీస్ తీస్తారు" అని ఓ అభిమాని రాశారు.

"3 గంటల తలనొప్పి. ఏం సినిమా రా అయ్యా. రవి అన్నా కొంచెం మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకో" అని మరో సోషల్ మీడియా యూజర్ ట్వీట్ చేశారు. "నీ స్క్రీన్‌ప్లే సెన్స్ కి దండం రా హరీష్ శంకర్. అసలు అక్కడ పాటకు స్పేస్ లేదు.. క్రియేట్ చేసుకొని బలవంతంగా పెట్టావు" అంటూ మరో యూజర్ డైరెక్టర్ ను లక్ష్యంగా చేసుకొని కామెంట్ చేశారు.

మొత్తంగా చూసుకుంటే ఓ వైపు పాజిటివ్ రివ్యూలు, మరోవైపు దారుణమైన నెగటివ్ రివ్యూలతో తొలి షో నుంచే మిస్టర్ బచ్చన్ కు మిక్స్‌డ్ రివ్యూలు వస్తున్నాయి. డబుల్ ఇస్మార్ట్, తంగలాన్, స్త్రీ2లాంటి సినిమాలు కూడా గురువారం (ఆగస్ట్ 15) రిలీజ్ కావడంతో వాటిని తట్టుకొని నిలబడటం అంత సులువుగా కనిపించడం లేదు.