Vishwambhara First Look: విశ్వంభర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. పవర్‌ఫుల్ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి-megastar chiranjeevi vishwambhara first look released chiranjeevi birthday celebrations ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwambhara First Look: విశ్వంభర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. పవర్‌ఫుల్ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి

Vishwambhara First Look: విశ్వంభర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. పవర్‌ఫుల్ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి

Hari Prasad S HT Telugu

Vishwambhara First Look: మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు సందర్భంగా అతడు నటిస్తున్న మూవీ విశ్వంభర నుంచి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ గురువారం (ఆగస్ట్ 22) రిలీజ్ చేశారు. అటు 22 ఏళ్ల కిందట రిలీజై సంచలన విజయం సాధించిన ఇంద్ర మూవీ రీరిలీజ్ ను కూడా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

విశ్వంభర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. పవర్‌ఫుల్ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి

Vishwambhara First Look: చిరంజీవి పుట్టిన రోజు వేడుకులను రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. వాళ్ల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ మెగా స్టార్ నెక్ట్స్ మూవీ విశ్వంభర నుంచి ఓ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. చిరు బర్త్ డే సందర్భంగా అర్ధరాత్రే ఓ ప్రీలుక్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఉదయాన్నే ఫస్ట్ లుక్ ను తీసుకొచ్చారు.

మెగాస్టార్ పవర్‌ఫుల్ లుక్

బింబిసార మూవీ ఫేమ్ మల్లిడి వశిష్ట డైరెక్ట్ చేస్తున్న మూవీ విశ్వంభర. భోళా శంకర్ తర్వాత చిరంజీవి నటిస్తున్న మూవీ ఇది. ఈ సినిమా ద్వారా మరోసారి మెగాస్టార్ తన ఇమేజ్ కు తగిన ఓ పవర్ ఫుల్ పాత్రను పోషిస్టున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే స్పష్టమవుతోంది. చేతిలో త్రిశూలాన్ని పట్టుకొని మోకాలిపై కూర్చొని చిరుని ఈ పోస్టర్ లో చూడొచ్చు.

ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే మరోసారి వింటేజ్ చిరుని చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఈ పోస్టర్ ద్వారా విశ్వంభర మూవీపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు. ఇప్పుడు ఫ్యాన్స్ ఆతృతగా మూవీ టీజర్ కోసం వేచి చూస్తున్నారు. అది కూడా త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి.

"ఎప్పుడైతే ప్రపంచం చీకట్లో, దుష్టశక్తుల గుప్పిట్లోకి వెళ్తుందో, అప్పుడో ప్రకాశవంతమైన నక్షత్రం వాటితో యుద్ధం చేయడానికి మరింత ప్రకాశవంతంగా మెరుస్తుంది. హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి. విశ్వంభరతో ప్రపంచం మరోసారి మీ తేజస్సును చూడాలని కోరుకుంటున్నాం. యూనివర్స్ ను దాటి ఉండబోయే ఈ మెగా మాస్ కోసం సిద్ధంగా ఉండండి. జనవరి 10, 2025లో రిలీజ్ కానుంది" అనే క్యాప్షన్ తో యూవీ క్రియేషన్స్ ఈ పోస్టర్ ను షేర్ చేసింది.

విశ్వంభర రిలీజ్ డేట్

విశ్వంభర మూవీతో చిరంజీవి మరోసారి సంక్రాంతి బరిలో నిలవబోతున్నాడు. గతేడాది వాల్తేర్ వీరయ్య మూవీతో మెగా హిట్ కొట్టిన చిరు.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాతో రాబోతున్నాడు. జనవరి 10, 2025లో విశ్వంభర రిలీజ్ కానుంది. యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరంజీవితోపాటు త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, ఆశ్రిత వేముగంటి నండూరి ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

ఇక విశ్వంభర సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. అతని గంభీరమైన మ్యూజిక్ ఈ సినిమాకు తగినట్లుగా ఉంటుందని ఎవరైనా ఊహించవచ్చు.

మరోవైపు చిరంజీవి బర్త్ డే సందర్భంగా అతని సూపర్ డూపర్ హిట్ మూవీ ఇంద్ర థియేటర్లలో 4కే వెర్షన్ లో రీరిలీజ్ అయింది. గురువారం (ఆగస్ట్ 22) మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా రిలీజైన ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఇంద్ర మూవీ రికార్డులు తిరగరాసింది.