Bimbisara Prequel: బింబిసార ప్రీక్వెల్ వచ్చేస్తోంది.. కల్యాణ్‌రామ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూశారా?
Bimbisara Prequel: నందమూరి కల్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా అతని సూపర్ హిట్ మూవీ బింబిసార ప్రీక్వెల్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేయడం విశేషం.
Bimbisara Prequel: నందరమూరి కల్యాణ్ రామ్ కెరీర్లో 22వ సినిమా ఎన్‌కేఆర్ 22 అనౌన్స్ చేశారు. శుక్రవారం (జులై 5) అతని బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. అతని కెరీర్లో బ్లాక్‌బస్టర్ గా నిలిచిపోయిన బింబిసారకు ఇది ప్రీక్వెల్ కావడం విశేషం. దీంతో ఈ సినిమాపై ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది.
బింబిసార ప్రీక్వెల్
నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయే సినిమా బింబిసార. ఈ మూవీ టాలీవుడ్ లో రికార్డులు బ్రేక్ చేసింది. అతని కెరీర్లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్ అయింది. ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూశారు. మొత్తానికి ఇప్పుడు కల్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా ప్రీక్వెల్ అనౌన్స్ చేయడం విశేషం.
ఈ బింబిసార ప్రీక్వెల్ కు అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నాడు. కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా స్టోరీ ఏంటి? బింబిసార కంటే ముందు ఏం జరిగిందన్నది మేకర్స్ వెల్లడించలేదు. మూవీ గురించి మరిన్ని వివరాల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
"బింబిసార కంటే ముందు త్రిగర్తలను పాలించిన లెజెండ్ కథను చూడటానికి సిద్ధంగా ఉండండి" అనే క్యాప్షన్ తో మేకర్స్ ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే మరో థ్రిల్లింగ్ మూవీ అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ బింబిసార ప్రీక్వెల్ లోని ఇతర నటీనటులు, సాంకేతిక సిబ్బంది గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
బింబిసారలో కల్యాణ్ రామ్ విశ్వరూపం
సుమారు రెండేళ్ల కిందట వచ్చిన బింబిసార మూవీలో కల్యాణ్ తన నట విశ్వరూపం చూపించాడు. ఇందులో అధికార దాహం కలిగిన క్రూరుడైన రాజుగా, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తిగా రెండు పాత్రల్లో కళ్యాణ్‌రామ్ కనిపించాడు. కానీ బింబిసారుడి పాత్రే ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. నెగెటివ్ షేడ్స్ తో కూడిన క్యారెక్టర్‌లో పూర్తిగా జీవించారు. కళ్లతోనే విలనిజాన్ని పండించారు. సినిమా మొత్తం ఒకే ఇంటెన్స్, ఎమోషన్‌ను క్యారీ చేస్తూ నటించాడు.
నటుడిగా అతడికి కెరీర్‌లో డిఫరెంట్ సినిమాగా బింబిసార నిలుస్తుంది. కథానాయికలు కేవలం అదనపు ఆకర్షణగానే నిలిచారు. సినిమాలో ఎక్ప్‌పెక్టేషన్స్ ఎవరెస్ట్ పర్ఫార్మెన్స్ వరెస్ట్ అంటూ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్స్ అలాగే సాగుతాయి. వివాన్, ప్రకాష్ రాజ్, అయ్యప్ప శర్మ తో పాటు చాలా పాత్రలు కనిపిస్తాయి. కానీ ఎవరికి పెద్దగా ప్రాధాన్యత లేదు. ఈశ్వరుడా సాంగ్ బాగుంది. కీరవాణి నేపథ్య సంగీతం హిస్టారికల్ సీన్స్ చక్కగా ఎలివేట్ చేసింది.
అధికార దాహం, యుద్ధం తప్ప మరో ప్రపంచం తెలియని ఓ క్రూరుడైన రాజులో ఎలా మార్పువచ్చిందనే అంశాన్ని రెండు టైమ్ పీరియడ్స్‌లో డిఫరెంట్ స్క్రీన్‌ప్లే బింబిసార సినిమాలో చూపించారు. త్రిగర్తల సామ్రాజ్యపు, కాలానికి నేటి ఆధునిక సమయాన్ని, పాత్రలను ముడిపెడుతూ దర్శకుడు కథను ఆసక్తికరంగా నడిపించాడు. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టింది.
టాపిక్