Bimbisara Trp Rating: బుల్లితెర‌పై రికార్డ్ టీఆర్‌పీని సొంతం చేసుకున్న బింబిసార‌-kalyanram bimbisara gets record trp rating on tv premiere ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bimbisara Trp Rating: బుల్లితెర‌పై రికార్డ్ టీఆర్‌పీని సొంతం చేసుకున్న బింబిసార‌

Bimbisara Trp Rating: బుల్లితెర‌పై రికార్డ్ టీఆర్‌పీని సొంతం చేసుకున్న బింబిసార‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 20, 2023 07:02 AM IST

Bimbisara Trp Rating: క‌ళ్యాణ్ రామ్ బింబిసార సినిమా బుల్లితెర‌పై అద‌ర‌గొట్టింది. ఇటీవ‌ల కాలంలో అత్య‌ధిక టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్న తెలుగు సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

క‌ళ్యాణ్ రామ్ బింబిసార
క‌ళ్యాణ్ రామ్ బింబిసార

Bimbisara Trp Rating: గ‌త ఏడాది థియేట‌ర్ల‌లో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన బింబిసార బుల్లితెర‌ ప్రేక్ష‌కుల్ని మెప్పించింది. ఇటీవ‌ల జీ తెలుగులో ప్రీమియ‌ర్ అయిన ఈ సినిమా 11.5 టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ వ‌చ్చిన సినిమాగా బింబిసార నిలిచింది.

ఫస్ట్ ప్రీమియర్‌లో ఆర్భ‌న్ ఏరియాలో ఈ సినిమాకు 11.5 టీఆర్‌పీ రేటింగ్ రాగా అర్భ‌న్, రూర‌ల్ ఏరియాలో క‌లిపి 9.45 టీఆర్‌పీ రేటింగ్ ఈ సినిమా ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్‌లో అత్య‌ధిక టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్న సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

సోషియో ఫాంట‌సీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన బింబిసార‌ సినిమాకు వ‌శిష్ట్ మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో క‌ళ్యాణ్ రామ్ డ్యూయ‌ల్ రోల్ చేశాడు. బింబిసార అనే చ‌క్ర‌వ‌ర్తిగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో, దేవ‌ద‌త్తుడు అనే మంచి మ‌న‌సున్న యువ‌రాజుగా క‌నిపించారు.

5వ శ‌తాబ్దానికి చెందిన బింబిసారుడు మాయాద‌ర్ప‌ణం కార‌ణంగా 21వ శ‌తాబ్దంలోకి ఎలా వ‌చ్చాడు? అత‌డిలో ఏ విధంగా మార్పు వ‌చ్చింద‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ మ‌ల్లిడి బింబిసార సినిమాను రూపొందించారు. గ‌త ఏడాది ఆగ‌స్ట్ 5న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమా దాదాపు ఎన‌భై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. క‌ళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.

ఇందులో బింబిసారుడిగా క‌ళ్యాణ్ రామ్ యాక్టింగ్‌, రెండు క్యారెక్ట‌ర్స్ మ‌ధ్య చూపించిన వేరియేష‌న్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. బింబిసార సినిమాకు సీక్వెల్ రానుంది. బింబిసార క్లైమాక్స్‌లో ఈ సినిమాకు సీక్వెల్ తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. క‌ళ్యాణ్ రామ్ ప్ర‌జెంట్ క‌మిట్‌మెంట్స్ పూర్త‌వ్వ‌గానే సీక్వెల్ తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు.

IPL_Entry_Point

టాపిక్