Kalyan Ram on Devara and Bimbisara 2: దేవర, బింబిసార 2లపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఇచ్చిన కల్యాణ్ రామ్-kalyan ram interesting updates on devara and bimbisara 2 at devil trailer launch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalyan Ram On Devara And Bimbisara 2: దేవర, బింబిసార 2లపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఇచ్చిన కల్యాణ్ రామ్

Kalyan Ram on Devara and Bimbisara 2: దేవర, బింబిసార 2లపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఇచ్చిన కల్యాణ్ రామ్

Hari Prasad S HT Telugu
Dec 13, 2023 07:31 AM IST

Kalyan Ram on Devara and Bimbisara 2: దేవర, బింబిసార 2 మూవీలపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఇచ్చాడు కల్యాణ్ రామ్. డెవిల్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

డెవిల్ మూవీ ట్రైలర్ లాంచ్ లో సంయుక్త, మాళవికతో కల్యాణ్ రామ్
డెవిల్ మూవీ ట్రైలర్ లాంచ్ లో సంయుక్త, మాళవికతో కల్యాణ్ రామ్

Kalyan Ram on Devara and Bimbisara 2: నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న డెవిల్ మూవీ ట్రైలర్ లాంచ్ మంగళవారం (డిసెంబర్ 12) జరిగిన సందర్భంగా.. అతడు దేవర, బింబిసార 2 సినిమాలపై స్పందించాడు. ఈ రెండు మూవీస్ పై అభిమానుల డిమాండ్ మేరకు రెండు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఇవ్వడం విశేషం. కల్యాణ్ ఇచ్చిన ఈ అప్‌డేట్స్ తో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

దేవర కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది: కల్యాణ్ రామ్

ఆర్ఆర్ఆర్ తర్వాత మరో జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులు దేవర మూవీ అప్‌డేట్స్ తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నారు. డెవిల్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా కూడా కొందరు అభిమానులు ఈ మూవీ గురించి గోల చేయగా.. కల్యాణ్ రామ్ స్పందించాడు. దేవర కొత్త ప్రపంచాన్ని చూపిస్తుందని, ఈ మూవీ గ్లింప్స్ త్వరలోనే రానుందని చెప్పాడు.

"తమ్ముడి సినిమా దేవర గురించి చెప్పాలి. నిజానికి అప్‌డేట్స్ గురించి చెప్పొద్దని తారక్ అన్నాడు. కానీ ఒక విషయంలో స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాను. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత ఏ నటుడు, డైరెక్టర్, ప్రొడక్షన్ హౌజ్ పై అయినా బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనూ తప్పులు జరగకుండా చూసుకోవాలి. వీఎఫ్ఎక్స్ కు చాలా సమయం తీసుకుంటోంది. దేవర మిమ్మల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రాబోతోంది. ఇప్పటికే వీడియో సిద్ధమవుతోంది" అని కల్యాణ్ రామ్ చెప్పాడు.

బింబిసార 2 మొదలయ్యేది అప్పుడే

ఇక కల్యాణ్ రామ్ కు కెరీర్లో అతి పెద్ద హిట్ అందించిన బింబిసార మూవీకి సీక్వెల్ రానున్న విషయం తెలిసిందే. డెవిల్ ట్రైలర్ లాంచ్ లో బింబిసార 2 గురించి కూడా ఫ్యాన్స్ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కల్యాణ్ రామ్ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో బింబిసార 2 షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించాడు.

బింబిసార మూవీని వశిష్ట డైరెక్ట్ చేశాడు. అయితే సీక్వెల్ కు మాత్రం అతడు దర్శకత్వం వహించడం లేదు. చిరంజీవితో అతడు మరో మూవీ చేస్తుండటంతో దానిపై దృష్టి సారించనున్నాడు. దీంతో కొత్త డైరెక్టర్ వైపు కల్యాణ్ రామ్ చూస్తున్నాడు. బింబిసారకు వీఎఫ్ఎక్స్ అందించిన అనిల్ పాడూరి సీక్వెల్ ను డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

టీ20 వరల్డ్ కప్ 2024