Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కి జాన్వీ కపూర్ మేనత్త.. ఇదెక్కడి ట్విస్టు దేవర!-jr ntr janhvi kapoor relation based on balakrishna old comments about sridevi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jr Ntr: జూనియర్ ఎన్టీఆర్‌కి జాన్వీ కపూర్ మేనత్త.. ఇదెక్కడి ట్విస్టు దేవర!

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కి జాన్వీ కపూర్ మేనత్త.. ఇదెక్కడి ట్విస్టు దేవర!

Sanjiv Kumar HT Telugu
Oct 09, 2023 08:43 AM IST

Jr NTR Janhvi Kapoor: బాలీవుడ్ ముద్దుగుమ్మ, దివంగత శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ దేవర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఎన్టీఆర్‌తో జోడీ కడుతున్న జాన్వీ కపూర్ అతనికి మేనత్త అవుతుందని ఓ వీడియో వైరల్ తెగ వైరల్ అవుతోంది.

జూనియర్ ఎన్టీఆర్‌కి జాన్వీ కపూర్ మేనత్త.. బాలయ్య వ్యాఖ్యలతో అలా.. ఇదెక్కడి ట్విస్టు దేవర!
జూనియర్ ఎన్టీఆర్‌కి జాన్వీ కపూర్ మేనత్త.. బాలయ్య వ్యాఖ్యలతో అలా.. ఇదెక్కడి ట్విస్టు దేవర! (Instagram)

బాలీవుడ్ హాట్ బ్యూటి జాన్వీ కపూర్, యంగ్ టైగర్ జూనియర్ జోడీ కడుతున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది అతిలోక సుందరి కూతురు జావ్వీ కపూర్. ఇందులో వీరిద్దరి మధ్య మంచి రొమాన్స్, కెమిస్ట్రీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వచ్చే విషయాలు చాలా వింతగా ఉంటాయి. కొన్ని లెక్కలు, లాజిక్స్, లోతుగా ఆలోచించే విధానం వేరే లెవెల్ అన్నట్లుగా అనిపిస్తుంది.

ప్రేమికుడిగా.. భర్తగా..

అలాంటి వీడియో ఒకటి ఎక్స్ (ట్విటర్)లో తెగ ట్రెండ్ అవుతుంది. దివంగత నటి శ్రీదేవి తెలుగులో సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి అనేక మంది హీరోలకు హీరోయిన్‌గా నటించారు. కానీ, బాలకృష్ణ సినిమాలో మాత్రం ఆమె హీరోయిన్‌‌గా చేయలేదు. అందుకు కారణం బాలకృష్ణే. తన తండ్రితో ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన శ్రీదేవితో తాను ప్రేమికుడిగా, భర్తగా నటించలేనని, ఎన్టీఆర్‌కు భార్యగా నటించిన శ్రీదేవి తనకు తల్లితో సమానం అని బాలయ్య అన్నారనే రూమర్స్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నాయి.

తల్లి లాంటిది

బాలకృష్ణ అన్న విషయాన్నే ప్రస్తావిస్తూ ఒక నెటిజన్ ఓ వీడియో చేశాడు. ఆ వీడియోలో.. "బాలకృష్ణ గారికి శ్రీదేవి తల్లి లాంటిది అంటే.. జూనియర్ ఎన్టీఆర్‌కు నాయనమ్మ. నాయనమ్మ కూతురు జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్‌కు అత్త అవుతుంది. మేనల్లుడు అత్తతో కాంబోనా. వాట్ ద ఫ ఇన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఈజ్ గోయింగ్ ఆన్ హియర్ (గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా ఇక్కడ ఏం జరుగుతోంది)" అని సరదాగా రాసుకొచ్చాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.

మనవరాలిగా కూడా

అది చూసిన నెటిజన్లు ఇదెక్కడి ట్విస్టు అనుకుంటున్నారు. అలాగే పలురకాలుగా స్పందిస్తున్నారు. అంతేకాకుండా సీనియర్ ఎన్టీఆర్‌కు శ్రీదేవి మనవరాలిగా చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అయితే, ఏది ఏమైనా వీడియోలు, కామెంట్స్ చూసి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి అని పలువురు అనుకుంటున్నారు. కాగా భారీ బడ్జెట్‌తో రెండు పార్టులుగా వస్తున్న దేవర సినిమాలో తారక్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. బాలీవుడ్ నుంచి జాన్వీతోపాటు సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తున్నాడు.

WhatsApp channel