Devara - NTR: దేవర షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందంటే..! వార్-2కు ఎన్టీఆర్ అప్పుడే..-devara movie shooting may finish in 2024 january and jr ntr to start shoot for war 2 from march ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara - Ntr: దేవర షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందంటే..! వార్-2కు ఎన్టీఆర్ అప్పుడే..

Devara - NTR: దేవర షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందంటే..! వార్-2కు ఎన్టీఆర్ అప్పుడే..

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 11, 2023 05:21 PM IST

Devara - NTR: దేవర మూవీ షూటింగ్ ఎప్పుడు పూర్తి కానుందో అంచనాలు బయటికి వచ్చాయి. అలాగే, వార్-2 మూవీ షూటింగ్‍ను జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు మొదలుపెట్టనున్నారో కూడా బజ్ వినిపిస్తోంది. ఆ వివరాలు ఇవే.

Devara - NTR: దేవర షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందంటే..!
Devara - NTR: దేవర షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందంటే..!

Devara - NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్‍లో ఫుల్ బిజీగా ఉన్నారు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ హిట్ అయ్యాక ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో దేవరపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. దేవర పార్ట్-1 చిత్రం 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. కాగా, దేవర షూటింగ్ గురించి తాజాగా ఓ సమాచారం బయటికి వచ్చింది.

దేవర మూవీ షూటింగ్‍లో ఎన్టీఆర్ ప్రస్తుతం పూర్తిస్థాయిలో పాల్గొంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ 2024 జనవరి మూడో వారంలో పూర్తవుతుందని ఆ సినిమా వర్గాల నుంచి సమాచారం బయటికి వచ్చింది. గోవా తీర ప్రాంతంలో ఈ మూవీ ఎక్కువ భాగం చిత్రీకరణ జరిగింది. జనవరి మూడో వారంలో అంటే సుమారు మరో నెలలోనే దేవర షూటింగ్‍ను ఎన్టీఆర్ పూర్తి చేసుకోనున్నారు.

వార్-2కు ఎప్పుడంటే..

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించనున్న వార్-2 సినిమాలోనూ ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. వార్‌కు సీక్వెల్‍గా స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్నారు. కాగా, వార్-2 మూవీ షూటింగ్‍లో 2024 మార్చి లేదా ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎన్టీఆర్ పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్‍ పాత్ర చేయనున్నారని టాక్. ఇక, వార్-2 షూటింగ్‍ను ఫిబ్రవరిలో మొదలుపెట్టనున్నారు హృతిక్ రోషన్.

అలాగే, కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍తోనూ ఓ సినిమా (NTR 31) చేయనున్నారు ఎన్టీఆర్. ఈ చిత్రానికి కూడా వచ్చే ఏడాదే డేట్స్ కేటాయించాల్సి ఉంది.

దేవర విషయానికి వస్తే.. ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీరోల్స్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ మక్కిలినేని, కొసరాజు హరికృష్ణ.. దేవర సినిమాను నిర్మిస్తున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం