Devara: దేవర సినిమాపై బిగ్ అప్డేట్: వెల్లడించిన డైరెక్టర్ కొరటాల శివ
Devara: దేవర సినిమా గురించి ముఖ్యమైన అప్డేట్ వెల్లడైంది. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివ ఓ వీడియో ద్వారా ప్రకటించారు.
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సముద్రతీర ప్రాంత ప్రజల కోసం పోరాడే వీరుడి పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం కావడంతో దేవర సినిమాపై భారీ హైప్ ఉంది. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో దేవర రూపొందుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నారు. ఈ తరుణంలో దేవర సినిమా దర్శకుడు కొరటాల శివ నేడు (అక్టోబర్ 4) ఓ ముఖ్యమైన అప్డేట్ వెల్లడించారు.
దేవర సినిమాను రెండు భాగాలుగా తీసుకురానున్నట్టు కొరటాల శివ స్పష్టం చేశారు. రెండు పార్ట్ల్లో దేవర మూవీ వస్తుందని వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వీడియో ద్వారా నేడు ఆయన ప్రకటించారు. దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు రెండు పార్ట్ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. వచ్చే ఏడాది (2024) ఏప్రిల్ 5వ తేదీన దేవర పార్ట్-1 రిలీజ్ అవుతుందని కొరటాల శివ స్పష్టం చేశారు.
“దేవర సినిమా గురించి ఓ ముఖ్యమైన విషయాన్ని చెప్పేందుకు మీ ముందుకు వచ్చా. దేవర సినిమా కథ రాసుకున్నప్పుడు, ఎన్టీఆర్కు చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాం. ఎందుకంటే కొత్త ప్రపంచం, భారీతనం, చాలా బలమైన పాత్రలు, భావోద్వేగాలు ఈ సినిమాలో ఉంటాయి. ఆ ఆత్మవిశ్వాసంతో షూటింగ్ మొదలుపెట్టాం. అయితే, ఆ ప్రపంచం నానాటికీ పెద్దదవుతూనే ఉంది. అద్భుతంగా ఫీలయ్యాం. అందుకే ముందటి కంటే ఇప్పుడు రెట్టింపు ఉత్సాహం పెరిగింది. అయితే, నిడివి పెరగకూడదని చెప్పి ఒక్క సీన్, ఒక్క డైలాగ్ కూడా తీసేయలేమని ఎడిటర్ సహా అందరం భావిస్తున్నాం. ఇంత భారీ కథను, బలమైన పాత్రలను, భావోద్వేగాలను ఎస్టాబ్లిష్ చేయాలంటే సరైన టైమ్ తీసుకోవాలని అనుకున్నాం. దేవర సినిమాను రెండు భాగాలు చెప్పడం కరెక్ట్ అనిపించింది. అందుకే, ఏమైనా సరే దేవర సినిమాను రెండు భాగాలు చేయాలని ఫీలయ్యాం. మొన్నే ఆ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఆ విషయాన్ని మీతో పంచుకుంటున్నా. ఏప్రిల్ 5వ తేదీ (2024) దేవర పార్ట్-1 రిలీజ్ అవుతుంది. దేవర మరింత భారీగా అవుతోంది” అని కొరటాల శివ చెప్పారు.
దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్, ప్రకాశ్ రాజ్, జిస్సు సెంగుప్త, శ్రీకాంత్, టామ్ చాకో, నరైన్, మురళీ శర్మ కీలకపాత్రలు చేస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
దేవర సినిమాలో అండర్వాటర్ సీన్లు హైలైట్గా ఉంటాయని తెలుస్తోంది. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుమారు రూ.300కోట్ల బడ్జెట్తో దేవర రూపొందుతోందని తెలుస్తోంది.