Bimbisara 2 Director: బింబిసార సీక్వెల్‌కు మారిన డైరెక్టర్.. ఎవరో తెలుసా?-bimbisara 2 director changed as the anil paduri take over from vasishta ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bimbisara 2 Director: బింబిసార సీక్వెల్‌కు మారిన డైరెక్టర్.. ఎవరో తెలుసా?

Bimbisara 2 Director: బింబిసార సీక్వెల్‌కు మారిన డైరెక్టర్.. ఎవరో తెలుసా?

Hari Prasad S HT Telugu
Mar 06, 2023 04:20 PM IST

Bimbisara 2 Director: బింబిసార సీక్వెల్‌కు డైరెక్టర్ మారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ చేసిన వశిష్ట స్థానంలో మరో వ్యక్తి ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నాడు.

బింబిసారలో కల్యాణ్ రామ్
బింబిసారలో కల్యాణ్ రామ్

Bimbisara 2 Director: బింబిసార.. టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ. నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్. బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ తన నటనతో అదరగొట్టాడు. ఈ సినిమా ఊహించిన దాని కంటే పెద్ద హిట్ కావడంతో ఇప్పుడీ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెల్ పై భారీ అంచనాలే ఉన్నాయి.

అయితే ఈ సీక్వెల్ కు డైరెక్టర్ మాత్రం మారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. తొలి పార్ట్ కు వశిష్ట దర్శకత్వం వహించాడు. తొలి సినిమాతోనే అతడు తన దర్శకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నాడతడు. అతనితోనే సీక్వెల్ చేయాలని కల్యాణ్ రామ్ భావించాడు. అయితే ఇద్దరి మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినట్లు మూవీ యూనిట్ లో ఉన్న వ్యక్తులు వెల్లడించారు.

ఈ కారణంగా వశిష్ట బింబిసార ఫ్రాంఛైజీని వదిలి తన ఇతర ప్రాజెక్టులపై దృష్టిసారిస్తున్నాడట. కల్యాణ్ రామ్, వశిష్ట పరస్పర అంగీకారంతోనే ఎవరి దారి వాళ్లు చూసుకున్నట్లు తెలుస్తోంది. బింబిసార 2 కోసం అనిల్ పాడూరిని డైరెక్టర్ గా అనుకున్నాడు కల్యాణ్ రామ్. ఈ అనిల్ బింబిసార మూవీకి వీఎఫ్ఎక్స్ పనులు చూసుకున్నాడు.

ప్రస్తుతం అనిల్ బింబిసార 2 పనుల్లో బిజీగా ఉన్నాడు. ఓ టీమ్ తో కలిసి అతడు దీనిపై పని చేస్తున్నాడు. బింబిసార సీక్వెల్ కు అనిల్ దర్శకత్వం వహించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు తన తొలి సినిమాతోనే సంచలనాలు క్రియేట్ చేసిన వశిష్ట పెద్ద హీరోలతో సినిమాల కోసం ప్రయత్నాల్లో ఉన్నాడు. బాలకృష్ణ, రామ్ చరణ్, రజనీకాంత్ లాంటి స్టార్లతో సినిమాల కోసం సిద్ధమవుతున్నాడు.

ఇప్పటికే అతడు రజనీకాంత్ ను కలిసి తన దగ్గర ఉన్న స్టోరీని వివరించాడని, దానికి సూపర్ స్టార్ ఇంప్రెస్ అయినట్లు సమాచారం. రజనీతో సినిమాకు ముందు వశిష్ట మరో మూవీ చేయనున్నాడు. అయితే డైరెక్టర్ మారిపోవడంతో బింబిసార స్థాయిలో సీక్వెల్ ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

WhatsApp channel

సంబంధిత కథనం