Devil Trailer: డెవిల్ ట్రైలర్ వచ్చేసింది.. సీక్రెట్ ఏజెంట్‍గా అదరగొట్టిన కల్యాణ్ రామ్: చూసేయండి-devil movie trailer released kalyan ram shines british as secret agent ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devil Trailer: డెవిల్ ట్రైలర్ వచ్చేసింది.. సీక్రెట్ ఏజెంట్‍గా అదరగొట్టిన కల్యాణ్ రామ్: చూసేయండి

Devil Trailer: డెవిల్ ట్రైలర్ వచ్చేసింది.. సీక్రెట్ ఏజెంట్‍గా అదరగొట్టిన కల్యాణ్ రామ్: చూసేయండి

Devil Movie Trailer: డెవిల్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‍గా కల్యాణ్ రామ్ ఆకట్టుకున్నారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది.

Devil Trailer: డెవిల్ ట్రైలర్ వచ్చేసింది.. సీక్రెట్ ఏజెంట్‍గా అదరగొట్టిన కల్యాణ్ రామ్

Devil Movie Trailer: గతేడాది బింబిసార మూవీతో బ్లాక్‍బాస్టర్ కొట్టిన హీరో నందమూరి కల్యాణ్ రామ్.. ఈ ఏడాది అమిగోస్‍తో నిరాశపరిచారు. ఆయన హీరోగా తదుపరి ‘డెవిల్’ మూవీ వస్తోంది. ఈ చిత్రం పీరియాడిక్ స్పై యాక్షన్ డ్రామాగా రూపొందింది. డెవిల్ సినిమాలో బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రను హీరో కల్యాణ్ రామ్ పోషించారు. అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో డెవిల్ ట్రైలర్‌ను మూవీ యూనిట్ నేడు (డిసెంబర్ 12) రిలీజ్ చేసింది.

బ్రిటిష్ పాలన కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో పీరియాడికల్ మూవీగా డెవిల్ రూపొందింది. డెవిల్ ట్రైలర్‌లో సీక్రెట్ ఏజెంట్‍గా కల్యాణ్ రామ్ లుక్, యాక్షన్ అదిరిపోయాయి. ఓ ఓడలో యాక్షన్ సీక్వెన్స్ తోనే ఈ ట్రైలర్‌లో కల్యాణ్ రామ్ ఎంట్రీ ఉంది. ఓ హత్య కేసును విచారించే బాధ్యతను ఏజెంట్ డెవిల్ (కల్యాణ్‍రామ్)కు బ్రిటీష్ ప్రభుత్వం అప్పగిస్తుంది. ఆ కేసును డెవిల్ విచారిస్తారు. ఈ క్రమంలోనే హీరోయిన్ సంయుక్త మీనన్‍ను చూస్తారు కల్యాణ్ రామ్.

అదే సమయంలో మరిన్ని మరణాలు జరుగుతాయి. అంతా ఓ మిస్టరీలా అనిపిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వంపై అనుమానం వచ్చి సీక్రెట్ సర్వీస్‍కు మర్డర్ కేసుకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తాడు కల్యాణ్ రామ్. ఈ ఆపరేషన్‍కు టైగర్ హంట్ అని పేరు పెడతారు. ఆ తర్వాత యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయి. "విశ్వాసంగా ఉండడానికి.. విధేయతతో బతికేయడానికి కుక్కను అనుకున్నావా రా.. లయన్” అంటూ కల్యాణ్ రామ్ చెప్పే డైలాగ్‍తో డెవిల్ ట్రైలర్ ముగిసింది. బ్రిటీషర్లపైనే కల్యాణ్ రామ్ తిరగబడినట్టు ట్రైలర్ చివర్లో ఉంది. సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఇంటెన్స్‌గా సాగింది.

డెవిల్ చిత్రంలో మాళవిక నాయర్, ఎడ్వర్డ్ సోనెన్‍బ్లిక్, ఎల్నాజ్ నొరౌజీ, మార్క్ బెన్నింగ్‍టన్ కీలకపాత్రలు పోషించారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై డైరెక్టర్ అభిషేక్ నామానే ఈ సినిమాను నిర్మించారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలను శ్రీకాంత్ విస్సా అందించారు. సుందర్ రాజన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేయగా.. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. డిసెంబర్ 29న డెవిల్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.