Devil 2 Movie: డెవిల్‍కు సీక్వెల్ ప్రకటించిన కల్యాణ్ రామ్.. ఎలా ఉంటుందో కూడా చెప్పిన నందమూరి హీరో-devil movie sequel announced by kalyan ram and story set both period current era ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devil 2 Movie: డెవిల్‍కు సీక్వెల్ ప్రకటించిన కల్యాణ్ రామ్.. ఎలా ఉంటుందో కూడా చెప్పిన నందమూరి హీరో

Devil 2 Movie: డెవిల్‍కు సీక్వెల్ ప్రకటించిన కల్యాణ్ రామ్.. ఎలా ఉంటుందో కూడా చెప్పిన నందమూరి హీరో

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 29, 2023 10:16 PM IST

Devil 2 Movie: డెవిల్ సినిమాకు సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని హీరో కల్యాణ్ రామ్ స్వయంగా ప్రకటించారు. కథ బ్యాక్‍డ్రాప్ ఎలా ఉంటుందో కూడా చెప్పారు. ఆ వివరాలివే..

Devil 2 Movie: డెవిల్‍కు సీక్వెల్ ప్రకటించిన కల్యాణ్ రామ్
Devil 2 Movie: డెవిల్‍కు సీక్వెల్ ప్రకటించిన కల్యాణ్ రామ్

Devil 2 Movie: పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘డెవిల్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. హీరో నందమూరి కల్యాణ్ రామ్.. బ్రిటీష్ స్పై ఏజెంట్‍గా నటించిన ఈ మూవీ శుక్రవారం (డిసెంబర్ 29) థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీకి ఎక్కువగా పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ తరుణంలో నేడు ఈ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్లను డెవిల్ మూవీ యూనిట్ చేసుకుంది. ఈ సందర్భంగా డెవిల్ సీక్వెల్ గురించి హీరో కల్యాణ్ రామ్ చెప్పేశారు. ఆ వివరాలివే..

డెవిల్ సక్సెస్ సెలెబ్రేషన్లలో భాగంగా మూవీ యూనిట్‍తో కలిసి కేక్ కట్ చేశారు హీరో కల్యాణ్ రామ్. ఆ తర్వాత సీక్వెల్‍ను ప్రకటించారు. డెవిల్ 2 రానుందంటూ చెప్పేశారు. సినిమా బ్యాక్‍డ్రాప్ గురించి కూడా వెల్లడించారు.

డెవిల్ 2 సినిమా షూటింగ్ 2024లోనే మొదలువుతుందని కల్యాణ్ రామ్ తెలిపారు. అలాగే, 2025లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తామని వెల్లడించారు. ఈ సినిమాలో బ్రిటీష్ కాలంతో పాటు ప్రస్తుత కాలం కూడా ఉంటాయని తెలిపారు.

“డెవిల్ 2 తీయాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాం. 2022 డిసెంబర్లోనే డెవిల్ షూటింగ్ మొదలైనప్పుడు శ్రీకాంత్ (కథ) మాకు ఈ ఐడియా చెప్పారు. డెవిల్ 2లో 1940 దశకం కనిపిస్తుంది.. 2000లు కూడా కనిపిస్తాయి” అని కల్యాణ్ రామ్ చెప్పారు. మూవీ యూనిట్‍తో కలిసి సీక్వెల్ గురించి ఆయన ప్రకటించారు.

డెవిల్ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‍గా నటించగా.. మాళవిక నాయర్, ఆర్ఆర్ఆర్ ఫేమ్ ఎడ్వర్డ్ సోనేన్‍బిక్, ఎల్నాజ్ నోరౌజీ, శ్రీకాంత్ అయ్యంగార్ కీరోల్స్ చేశారు. ఈ మూవీకి డైరెక్టర్, ప్రొడ్యూజర్‌గా వ్యవరించారు అభిషేక్ నామా.

డెవిల్ సినిమాకు కథ, స్క్రీన్‍ప్లే, డైలాగ్స్ అందించారు శ్రీకాంత్ విస్సా. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రంలో బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‍గా కల్యాణ్ రామ్ నటించారు. కల్యాణ్ రామ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్లు ఈ చిత్రానికి హైలైట్‍గా నిలిచాయి.

సంబంధిత కథనం