Aha OTT Chiranjeevi Movies: ఆహా ఓటీటీలోని చిరంజీవి టాప్ 10 మూవీస్.. మెగాస్టార్ 69వ పుట్టినరోజు నాడు చూసేయండి
Aha OTT Chiranjeevi Movies: మెగాస్టార్ చిరంజీవి గురువారం (ఆగస్ట్ 22) తన 69వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా ఆహా ఓటీటీలోని అతని ఆల్ టైమ్ హిట్ మూవీస్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో ఇక్కడ చూసేయండి.
Aha OTT Chiranjeevi Movies: నాలుగు దశాబ్దాలకుగాపై సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి గురువారం (ఆగస్ట్ 22) తన 69వ పుట్టిన రోజు జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా లక్షలాది మంది మెగా అభిమానులు ఘనంగా సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. మరి అదే సమయంలో ఆహా ఓటీటీలో ఉన్న చిరు టాప్ మూవీస్ ను చూసి మీరూ ఎంజాయ్ చేయండి.
చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నాడు ప్రతి ఏటా అభిమానులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతుంటారు. అందులో భాగంగా గురువారం (ఆగస్ట్ 22) కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో రక్తదానం, పాలాభిషేకాలు, కేక్ కటింగ్స్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో చిరు కెరీర్లోని అతిపెద్ద హిట్స్ లో ఒకటైన ఇంద్ర మూవీ రీరిలీజ్ ను కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు.
ఇంద్ర మూవీ కూడా గురువారం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 4కే వెర్షన్ లో వస్తున్న ఈ మెగా హిట్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లోనే రికార్డులు తిరగరాసింది. అన్ని షోల బుకింగ్స్ ఫుల్ అవడంతో అదనంగా షోస్ యాడ్ చేయాల్సి వచ్చింది. ఇక చిరు బర్త్ డేను అతని సినిమాలు చూస్తే ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం ఆహా వీడియోలోని టాప్ మూవీస్ లిస్ట్ ఇక్కడ ఇస్తున్నాం.
ఆహా వీడియోలోని టాప్ చిరు మూవీస్
గ్యాంగ్ లీడర్
ఎప్పుడో 33 ఏళ్ల కిందట అంటే 1991లో రిలీజై సంచలన విజయం సాధించిన మూవీ గ్యాంగ్‌లీడర్. ఇండస్ట్రీలో చిరు సూపర్ స్టార్ స్టేటస్ ను మరో ఎత్తుకు తీసుకెళ్లిన మూవీ ఇది.
ఘరానా మొగుడు
చిరంజీవి కెరీర్లో అతిపెద్ద హిట్ మూవీస్ లో ఒకటైన ఘరానా మొగుడు 1992లో రిలీజైంది. ఈ కామెడీ డ్రామాలో చిరు తన గ్రేస్, స్టైల్ తో అదరగొట్టాడు. ఈ సినిమా ప్రస్తుతం ఆహా వీడియోలో అందుబాటులో ఉంది.
మెకానిక్ అల్లుడు
ఆ మరుసటి ఏడాది అంటే 1993లో రిలీజైన మెగాస్టార్ మూవీ మెకానిక్ అల్లుడు. ఏఎన్నార్ తో కలిసి చిరు పండించిన కామెడీ చూడాలంటే ఈ మూవీ బెస్ట్ ఛాయిస్.
కొండవీటి దొంగ
చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్ కలిసి చేసిన మరో మ్యాజిక్ ఈ కొండవీటి దొంగ. మెగాస్టార్ పోషించిన రాబిన్ హుడ్ లాంటి పాత్ర ఇది. 1990లో రిలీజై సూపర్ హిట్ అయింది.
అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
చిరంజీవి కెరీర్లో మరో ఇండస్ట్రీ హిట్ మూవీ అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. 1989లో రిలీజైన ఈ సినిమా చిరుని సుప్రీం హీరోని చేసింది.
ఇవే కాకుండా ఆహా వీడియోలో మృగరాజు, బిగ్ బాస్, లంకేశ్వరుడు, పసివాడి ప్రాణం, కొండవీటి రాజాలాంటి సినిమాలు కూడా ఉన్నాయి. 1980, 90ల్లోని యంగ్ అండ్ ఎనర్జటిక్ చిరంజీవి సినిమాలు చూడాలనుకునే వాళ్లకు ఇవి బెస్ట్ ఛాయిస్. ఈ సినిమాలన్నీ ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ఉండటం కూడా విశేషమే.