Akshay Kumar Top Tax Payer : ఇండియాలో టాప్ ట్యాక్స్ పేయర్.. అంబానీ, అదానీ కాదు.. ఓ నటుడు
Highest Tax payer in India : ఇండియాలో అత్యధికంగా పన్ను చెల్లించేవారు ఎవరు? అని అడిగితే.. చాలామంది బహుశా ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా లేదంటే ఇతర పారిశ్రామికవేత్త గురించి ఆలోచిస్తారు. కానీ ఇది తప్పు.. ఇండియాలో ఎక్కువగా ట్యాక్స్ కట్టేది ఓ నటుడు అని మీకు తెలుసా?
భారతదేశంలో ఎక్కువ పన్ను చెల్లించేది.. పారిశ్రామిక వేత్తలు అనుకుంటే మీరు పొరబడినట్టే. టాప్ ట్యాక్స్ పేయర్ గా నటుడు అక్షయ్ కుమార్ ఉన్నాడు. అంబానీ, అదానీలకంటే ఎక్కువగా అక్షయ్ కుమార్ పన్ను చెల్లిస్తున్నాడు. ఈ విషయం తెలిసి చాలా మంది షాక్ అవుతున్నారు.
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి గడువు జూలై 31తో ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 6 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. ఆదివారం సాయంత్రం వరకు దాదాపు 27 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయని తెలిపింది. రిటర్న్ ఫైలింగ్ లో దేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లింపుదారు ఎవరు అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ముఖ్యంగా అంబానీ, అదానీ, టాటా, బిర్లా భారతదేశపు అతిపెద్ద పన్ను చెల్లింపుదారులుగా ఉంటారని భావించి ఉండవచ్చు.
భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. ఆదాయపు పన్ను శాఖ అందించిన డేటా ప్రకారం, అక్షయ్ కుమార్ గత సంవత్సరం అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఉన్నారు. అక్షయ్ కుమార్ 2022లో రూ. 29.5 కోట్ల ఆదాయపు పన్నును డిపాజిట్ చేశారు. ఈ ఏడాది తన ఆదాయాన్ని రూ.486 కోట్లుగా ప్రకటించారు.
అక్షయ్ కుమార్ బాలీవుడ్ లోని అతిపెద్ద స్టార్లలో ఒకరు. అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరు. అక్షయ్ కుమార్ ఏడాదికి దాదాపు 4-5 సినిమాలు ఇస్తున్నారు. ఇది కాకుండా, అక్షయ్ కుమార్ తన సొంత ప్రొడక్షన్ హౌస్, స్పోర్ట్స్ టీమ్‌ను నడుపుతున్నాడు. అతను వివిధ బ్రాండ్‌లను ఎండార్స్ చేయడం ద్వారా చాలా సంపాదిస్తాడు. 2022కి ముందు కూడా భారతదేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా అక్షయ్ కుమార్ ఉన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో, అతను 25.5 కోట్ల రూపాయల ఆదాయపు పన్నును డిపాజిట్ చేశాడు.
ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ లేదా రతన్ టాటా దేశంలోని టాప్ ట్యాక్స్ పేయర్స్ ఎందుకు కాదనే ప్రశ్న తలెత్తడం కామన్. పారిశ్రామికవేత్తలు వ్యక్తిగత ఆస్తులను తక్కువగా చూపిస్తారు. వారి కంపెనీల పేరుతో ఆస్తులను కలిగి ఉంటారు. అటువంటి పరిస్థితిలో, ఆదాయాలు వారి కంపెనీలకు వెళ్తాయి. దానికి బదులుగా కార్పొరేట్ ఆదాయపు పన్ను చెల్లిస్తారు. అలా ఇండియాలో ఎక్కువ పన్ను చెల్లించే వ్యక్తిగా అక్షయ్ కుమార్ ఉన్నాడు.