Stocks to buy today : స్టాక్స్​ టు బై.. అశోక్​ లేల్యాండ్​, టాటా స్టీల్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్స్​ ఇవే..-stocks to buy today 28 july 2023 sensex nifty and other news ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : స్టాక్స్​ టు బై.. అశోక్​ లేల్యాండ్​, టాటా స్టీల్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్స్​ ఇవే..

Stocks to buy today : స్టాక్స్​ టు బై.. అశోక్​ లేల్యాండ్​, టాటా స్టీల్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్స్​ ఇవే..

Sharath Chitturi HT Telugu
Jul 28, 2023 08:48 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

ట్రేడర్లు నేడు గమనించాల్సిన స్టాక్స్ ఇవే!
ట్రేడర్లు నేడు గమనించాల్సిన స్టాక్స్ ఇవే!

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాలను చూశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 440 పాయింట్లు కోల్పోయి 66,267 వద్ద ముగిసింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 118 పాయింట్ల నష్టంతో 19,660 వద్ద స్థిరపడింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ.. 383 పాయింట్లు పతనమై 45,679 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీలో వీక్​నెస్​ కనిపిస్తోంది.

"నిఫ్టీ షార్ట్​ టర్మ్​ ట్రెండ్​ రివర్స్​ అయినట్టు కనిపిస్తోంది. రానున్న సెషన్స్​లో మరింత వీక్​నెస్​ కనిపించే అవకాశం ఉంది. 19,450 లెవల్స్​ వద్ద సపోర్ట్​ లభించే అవకాశం ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​ 19,850గా ఉంది," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కు చెందిన టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3979 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2528 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఇక దేశీయ సూచీలు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ.. దాదాపు 50 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

అమెరికా స్టాక్​ మార్కెట్​లు గురువారం సెషన్​లో నష్టపోయాయి. డౌ జోన్స్​ 0.57శాతం, ఎస్​ అండ్​పీ 500 0.64శాతం, నాస్​డాక్​ 0.55శాతం మేర నష్టాలను చూశాయి.

చమురు ధరలు..

చమురు ధరలు గత కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా బ్రెంట్​ క్రూడ్​ ధర బ్యారెల్​కు 84 డాలర్లకు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్​ తర్వాత ఈ స్థాయికి ధర చేరుకోవడం ఇదే తొలిసారి.

స్టాక్స్​ టు బై..

Stocks to buy : సన్​ ఫార్మా:- బై రూ. 1134, స్టాప్​ లాస్​ రూ. 1110, టార్గెట్​ రూ. 1172

దివీస్​ ల్యాబ్​:- బై రూ. 3742, స్టాప్​ లాస్​ రూ. 3680, టార్గెట్​ రూ. 3910

అశోక్​ లేల్యాండ్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 167, టార్గెట్​ రూ. 205

టాటా స్టీల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 114, టార్గెట్​ రూ. 128

HDFC Life share price target : హెచ్​డీఎఫ్​సీ లైఫ్​:- బై రూ. 662, స్టాప్​ లాస్​ రూ. 650, టార్గెట్​ రూ. 680

మహీంద్రా అండ్​ మహీంద్రా ఫినాన్స్​:- బై రూ. 312, స్టాప్​ లాస్​ రూ. 302, టార్గెట్​ రూ. 323

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం