తెలుగు న్యూస్ / ఫోటో /
ITR filing 2023: ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తున్న సమయంలో ఈ తప్పులు చేయకండి..
2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ ఐటీ రిటర్న్స్ ను దాఖలు చేయడానికిి ఆఖరు తేదీ జులై 31. చివరి తేదీ వరకు వెయిట్ చేయకుండా, ముందే ఐటీఆర్ లను దాఖలు చేయడం మంచిది. అయితే, ఐటీఆర్ లను ఫైల్ చేసే సమయంలో ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి.
(1 / 8)
Not verifying Form 26AS and AIS: ఐటీఆర్ ను ఫైల్ చేసేముందు మీ ఫామ్ 26 ఏస్, ఏఐఎస్ లను తప్పని సరిగా సరి చూసుకోండి. మీ ఆదాయం, టీడీఎస్, టీసీఎస్ లు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.
(2 / 8)
Not including ‘other income’ from interest, dividends, and capital gains: వడ్డీ, క్యాపిటల్ గెయిన్స్, డివిడెండ్స్ వంటి ఆదాయాలను తప్పని సరిగా రిపోర్ట్ చేయండి. ఈ ఆదాయాలు ఏఐఎస్ లో లిస్ట్ అయి ఉంటాయి.
(3 / 8)
Not including capital gains and losses: క్యాపిటల్ గెయిన్స్, లాసెస్ ను లెక్కించడం సులువే. మీ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ నుంచి క్యాపిటల్ గెయిన్స్ స్టేట్మెంట్ తీసుకుని ఆ వివరాలు ఐటీఆర్ లో పొందుపర్చండి. (Photo via Pixabay)
(4 / 8)
Missing exemptions: పన్ను మినహాయింపులపై అవగాహన పెంచుకోండి. ఉదాహరణకు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలకు లభించే వడ్డీపై సెక్షన్ 80 టీటీబీ కింద సాధారణ ప్రజలకు రూ. 10 వేల వరకు, సీనియర్ సిటిజన్లకు రూ. 50 వేల వరకు మినహాయింపు ఉంటుంది.(iStock)
(5 / 8)
Not reporting foreign income and assets: విదేశాల్లోని కంపెనీల్లో ఉన్న షేర్ల వివరాలను, విదేశీ కంపెనీల నుంచి వచ్చే ఆదాయాన్ని, విదేశీ బ్యాంక్ ఖాతాల్లోని ఫండ్స్ ను ఐటీఆర్ లో కచ్చితంగా చూపాలి.
(6 / 8)
Not reporting losses: మీకు షేర్ మార్కెట్లో ఫండ్స్, స్టాక్స్, ఎఫ్ అండ్ ఓ ల ద్వారా వాటిల్లిన నష్టాన్ని కూడా వెల్లడించాలి. వీటిని 8 ఆర్థిక సంవత్సరాల వరకు కొనసాగించవచ్చు.
(7 / 8)
Clubbing of investments done in the name of a spouse or child below 18 years: 18 ఏళ్ల లోపు ఉన్న పిల్లల పేరుపై, జీవిత భాగస్వామి పేరుపై చేసిన ఇన్వస్ట్మెంట్స్ పై వచ్చే లాభాలను టాక్స్ పేయర్ ఇన్ కంతో కలపాలి.
ఇతర గ్యాలరీలు