Mathu Vadalara 2 OTT Release Date: కన్ఫమ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ తెలుగు కామెడీ మూవీ.. రెండు రోజుల్లోనే..-mathu vadalara 2 ott release date netflix to stream blockbuster comedy movie from 11th october ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mathu Vadalara 2 Ott Release Date: కన్ఫమ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ తెలుగు కామెడీ మూవీ.. రెండు రోజుల్లోనే..

Mathu Vadalara 2 OTT Release Date: కన్ఫమ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ తెలుగు కామెడీ మూవీ.. రెండు రోజుల్లోనే..

Hari Prasad S HT Telugu

Mathu Vadalara 2 OTT Release Date: ఓటీటీలోకి తెలుగు బ్లాక్‌బస్టర్ కామెడీ మూవీ వచ్చేస్తోంది. గత నెల 13న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. దసరా పండగకు నవ్వులే నవ్వులు ఖాయమిక.

కన్ఫమ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ తెలుగు కామెడీ మూవీ.. రెండు రోజుల్లోనే..

Mathu Vadalara 2 OTT Release Date: బ్లాక్‌బస్టర్ కామెడీ మూవీ మత్తు వదలరా 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కన్ఫమ్ అయింది. దీనిపై నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన ఇంకా చేయకపోయినా.. సదరు ప్లాట్‌ఫామ్ పై ఈ మూవీ డేట్ వెల్లడించారు. శ్రీసింహా, సత్య నటించిన ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ఆడిన తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.

మత్తు వదలరా 2 ఓటీటీ రిలీజ్ డేట్

మత్తు వదలరా 2 మూవీ వచ్చే శుక్రవారం (అక్టోబర్ 11) నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆ ప్లాట్‌ఫామ్ పై మత్తు వదలరా 2 అని సెర్చ్ చేస్తే శుక్రవారం వస్తోందని తెలిపింది.

దీంతో ఈ దసరా పండుగకు ఇద్దరు అండర్ కవర్ ఏజెంట్లు నవ్వులు పూయించనున్నారు. సెప్టెంబర్ 13న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా తొలి వీకెండ్ లోనే కలెక్షన్ల వర్షం కురిపిస్తూ లాభాల్లోకి దూసుకెళ్లింది. 2019లో వచ్చిన మత్తు వదలరా మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాపై మొదటి నుంచీ భారీ అంచనాలే ఉన్నాయి.

ఆ అంచనాలను అందుకుంటూ ఈ సీక్వెల్ కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ బాగా అలరించింది. ఇప్పుడీ సినిమా సరిగ్గా దసరాకు ఒక రోజు ముందు ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

మత్తు వదలరా 2 ఎలా ఉందంటే?

మ‌త్తు వ‌ద‌ల‌రా 2 ఓ సెటైరిక‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీకి ఫ‌న్‌ను జోడించి ద‌ర్శ‌కుడు రితేష్ రానా ఈ సీక్వెల్ మూవీని తెర‌కెక్కించాడు. మ‌లుపుల‌తో ఆడియెన్స్‌ను థ్రిల్ చేయ‌డం కంటే న‌వ్వించ‌డానికే ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అందుకు త‌గ్గ‌ట్లే క‌థ‌, క్యారెక్ట‌రైజేష‌న్స్‌తో పాటు సీన్స్ రాసుకున్నాడు. సిట్యూవేష‌న‌ల్ కామెడీతో పాటు యాక్ట‌ర్స్ సెన్సాఫ్ హ్యూమ‌ర్‌తోనే ప్రారంభం నుంచి ముగింపు వ‌ర‌కు డైరెక్ట‌ర్ టైమ్‌పాస్ చేశాడు.

మ‌త్తు వ‌ద‌ల‌రాకు కొన‌సాగింపుగానే సీక్వెల్‌ను మొద‌లుపెట్టారు డైరెక్ట‌ర్‌. హీ టీమ్‌లో బాబు, ఏసు జాయిన్ కావ‌డం, త‌మ స్టైల్‌లో కిడ్నాప్ కేసుల‌ను ప‌రిష్క‌రించే సీన్స్‌తో ఫ‌స్ట్ హాఫ్ సాగుతుంది. స్టార్ హీరోల స్ఫూఫ్‌ల‌తో బోర్ ఫీల్ క‌ల‌గ‌నీయ‌కుండా చేశాడు డైరెక్ట‌ర్‌.

కిడ్నాప్ కేసును సాల్వ్ చేసే క్ర‌మంలో బాబు, ఏసు మ‌ర్డ‌ర్ కేసులో ఇరుక్కుకోవ‌డం,త‌మ‌ను ప్లానింగ్‌తో కేసులో ఇరికించార‌ని వారు తెలుసుకునే ట్విస్ట్‌ల‌తో సెకండాఫ్‌లో క‌థ‌ను ప‌రుగులు పెట్టించాడు డైరెక్ట‌ర్‌. ఫ‌స్ట్ పార్ట్‌లోని డ్ర‌గ్స్ హంగామాను ఇందులోను ట‌చ్ చేశాడు. ఈ డ్రామా క‌న్వీన్సింగ్‌గానే అనిపిస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గానే అనిపిస్తుంది.

మత్తు వదలరా 2 బాక్సాఫీస్

మత్తు వదలరా 2 బాక్సాఫీస్ దగ్గర సంచలనమే సృష్టించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.35 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఓ చిన్న బడ్జెట్ మూవీ ఈ స్థాయి హిట్ అందుకోవడం నిజంగా విశేషమే.

ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజైన ఫస్ట్ పార్ట్ సంచలన హిట్ గా నిలవడంతో ఈ సీక్వెల్ పై ముందు నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో మూవీకి మంచి ఓపెనింగ్స్ లభించాయి.