Mathu Vadalara 2: ఆ రెండు హాలీవుడ్ సినిమాలను రెఫరెన్స్‌గా తీసుకున్నాం.. అది తెలుగులో లేదు: మత్తు వదలరా 2 డైరెక్టర్-mathu vadalara 2 director ritesh rana comments on using hollywood movie references chiranjeevi mahesh babu compliments ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mathu Vadalara 2: ఆ రెండు హాలీవుడ్ సినిమాలను రెఫరెన్స్‌గా తీసుకున్నాం.. అది తెలుగులో లేదు: మత్తు వదలరా 2 డైరెక్టర్

Mathu Vadalara 2: ఆ రెండు హాలీవుడ్ సినిమాలను రెఫరెన్స్‌గా తీసుకున్నాం.. అది తెలుగులో లేదు: మత్తు వదలరా 2 డైరెక్టర్

Sanjiv Kumar HT Telugu
Sep 19, 2024 10:41 AM IST

Mathu Vadalara 2 Ritesh Rana On Hollywood Movie References: మత్తు వదలరా 2 సినిమాలో రెండు హాలీవుడ్ చిత్రాల రెఫరెన్స్ తీసుకున్నట్లుగా డైరెక్టర్ రితేష్ రానా చెప్పారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మత్తు వదలరా 2 సక్సెస్, చిరంజీవి, మహేష్ బాబు కాంప్లిమెంట్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఆ రెండు హాలీవుడ్ సినిమాలను రెఫరెన్స్‌గా తీసుకున్నాం.. అది తెలుగులో లేదు: మత్తు వదలరా 2 డైరెక్టర్ కామెంట్స్
ఆ రెండు హాలీవుడ్ సినిమాలను రెఫరెన్స్‌గా తీసుకున్నాం.. అది తెలుగులో లేదు: మత్తు వదలరా 2 డైరెక్టర్ కామెంట్స్

Mathu Vadalara 2 Director Ritesh Rana: శ్రీ సింహ కోడూరి, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మత్తు వదలరా 2. మత్తు వదలరాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు రితేష్ రానా దర్శకత్వం వహించారు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేసింది.

ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 13న విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షుకులని అలరించి హిలేరియస్ బ్లాక్ బస్టర్‌ సక్సెస్ అందుకుంటోంది. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రితేష్ రానా విలేకరలు సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

చిరంజీవి, మహేష్ బాబు అప్రిషియేట్ చేయడం ఎలా అనిపించింది. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు?

-బెస్ట్ కాంప్లిమెంట్ అంటే.. టీం అంతా హ్యాపీగా ఉంది. అది చాలా సంతోషాన్ని ఇచ్చింది. నెక్ట్స్ చిరంజీవి గారు చేసిన ట్వీట్ చాలా హ్యాపీనెస్ ఇచ్చింది.

సీక్వెల్ చేయాలనే ఆలోచన మొదటి నుంచి ఉందా?

-సీక్వెల్ చేయాలని చెర్రీ గారు ఎప్పటినుంచో అన్నారు. అయితే ఆర్గానిక్‌గా ఓ మంచి ఐడియా వస్తేనే చేయాలి. అలాంటి ఐడియా క్రాక్ చేసి చెర్రీ గారికి, టీంకి చెప్పాను. అది అందరికీ నచ్చింది. మేము అనుకున్నట్లే వర్కవుట్ అయింది. ఆడియన్స్ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

ఖుషి రిఫరెన్స్‌తో అజయ్ పాత్ర చేయాలనే ఐడియా ఎవరిది?

-నాదే. ఆ క్యారెక్టర్ గ్రో చూపించాలనేది ఐడియా. ఉన్న మూడు నిమిషాల్లో ఆయన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నపుడు ఆయన చేసిన పాత సినిమాని వాడాలకున్నాను. అలా చూసిన వెంటనే ఆడియన్స్ కనెక్ట్ అవుతారనేది ఆలోచన.

స్లేవ్ డ్రగ్ కాన్సెప్ట్ ఏమిటి ?

-స్లేవ్ డ్రగ్‌ని ఒక మెటాఫర్‌లా వాడం. మత్తు అనేది కేవలం నార్కోటిక్స్‌నే కాదు. మత్తు చాలా రకాలుగా ఉంది. మత్తు నుంచి బయటపడటం మంచిదని చెప్పడం దాని ఉద్దేశం.

సింహ, సత్య క్యారెక్టరైజేషన్ గురించి ?

-బాబు, యేసు ఈక్వెల్ క్యారెక్టరైజేషన్స్. బాబు లేకపోతే యేసు క్యారెక్టర్ అంతగా పండదు. ఇద్దరూ కాంప్లమెంట్ చేసుకుని యాక్ట్ చేసే క్యారెక్టర్స్ అవి. ఫరియా కూడా అద్భుతంగా చేశారు. ఆమెని దృష్టిలో పెట్టుకునే ఆ క్యారెక్టర్ రాశాను. తను ఈ సినిమాకి ఒక ర్యాప్ సాంగ్ చేశారు. అది మూవీ ప్రమోషన్స్‌కి యూజ్ అయింది.

హీ టీంని ఎలా డిజైన్ చేశారు? ఏదైనా సినిమా రిఫరెన్స్ తీసుకున్నారా ?

-హీ టీం డ్రెస్ కోడ్‌లో బ్యాడ్ బాయ్స్, బ్రూక్లీన్ నైన్- నైన్ (హాలీవుడ్ సినిమాలు) రిఫరెన్స్ తీసుకున్నాం. బడ్డీ కాప్ జోనర్ తెలుగులో లేదు. లుక్ వైజ్ కొంచెం డిఫరెంట్‌గా చేద్దామనేది హోల్ ఐడియా.

సత్య చేసిన పదహారేళ్ల వయసు సాంగ్ ముందే ప్లాన్ చేశారా ?

-అది ఫస్ట్ పార్ట్‌లో తీసింది. అప్పుడు లెంత్ ఎక్కువైయిందని కట్ చేశాం. సెకండ్ పార్ట్‌లో మళ్లీ అలాంటి సిట్యువేషన్ వచ్చినపుడు అది ప్లేస్ చేశాం. థియేటర్స్‌లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు.

Whats_app_banner