Samantha | థియేటర్స్‌లోనే సమంత సినిమా విడుదల-samantha and nayanatara movie to be released in theaters ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha | థియేటర్స్‌లోనే సమంత సినిమా విడుదల

Samantha | థియేటర్స్‌లోనే సమంత సినిమా విడుదల

HT Telugu Desk HT Telugu
Published Feb 02, 2022 04:02 PM IST

కరోనా థర్డ్ వేవ్ ప్రభావంతో టాలీవుడ్‌తోపాటు ఇతర భాషల సినీ పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా ఈ మహమ్మారి వల్ల కోలీవుడ్‌లో పలు అగ్ర సినిమాల విడుదలలు వాయిదా పడ్డాయి.

<p>ఈ మధ్యే పుష్ప మూవీ ఐటెమ్ సాంగ్ లో మెరిసిన సమంత</p>
ఈ మధ్యే పుష్ప మూవీ ఐటెమ్ సాంగ్ లో మెరిసిన సమంత (Instagram )

యాభై శాతం ఆక్యుపెన్సీ, నైట్ కర్ఫ్యూ నిబంధనలు థియేటర్స్ వ్యవస్థను దెబ్బ తీయడంతో అగ్ర హీరోలు ఓటీటీల బాట పట్టారు. విక్రమ్, ధృవ్ విక్రమ్ హీరోలుగా నటిస్తున్న ‘మహాన్’, ధనుష్ ‘మారన్’ సినిమాలు ఈ నెలలోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ చిత్రాలతో పాటు నయనతార, సమంత, విజయ్ సేతుపతి హీరోహీరోయిన్లుగా నటించిన ‘కాథు వకుల రెండు కాదల్’ ఓటీటీలోనే విడుదల కాబోతున్నట్లు ప్రచారం జరిగింది. 

గతేడాది నవంబర్‌లో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ నెలలో సినిమాను విడుదల చేయాలని భావించారు. కరోనా వల్ల వాయిదా పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో థియేటర్స్‌లో సినిమాను విడుదల చేయాలనే ఆలోచనను విరమించి ఓ అగ్ర ఓటీటీ సంస్థతో చిత్ర యూనిట్ భారీ మొత్తానికి డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ ప్రచారాన్ని దర్శకనిర్మాతలు విఘ్నేష్ శివన్, నయనతార ఖండించకపోవడంతో ఓటీటీలో ఈ సినిమా విడుదలయ్యేది నిజమేనని కోలీవుడ్ వర్గాలు భావించాయి. 

అయితే మంగళవారం విఘ్నేష్ శివన్ ఈ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టాడు. ఏప్రిల్ నెలలో థియేటర్స్ లోనే సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ నెల 11న టీజర్ ను విడుదల చేస్తామని అతను చెప్పాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కతున్నది.

నయన్, సమంత కలయికలో తొలిసారి..

దక్షిణాది చిత్రసీమలో అగ్ర కథానాయికలుగా కొనసాగుతున్న నయనతార, సమంత కలిసి నటించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తూనే నిర్మాతగా బాధ్యతల్ని చేపట్టింది. తన చిరకాల ప్రియుడు, కాబోయే భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి ఆమె ఈ చిత్రాన్ని నిర్మించింది. 

విఘ్నేశ్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ‘నానుమ్ రౌడీధాన్’ తర్వాత విఘ్నేష్ శివన్, నయనతార కలయికలో వస్తోన్న ఈ సినిమాపై కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలంగా విఘ్నేష్ తో ప్రేమలో ఉంది నయన్. ఈ ఏడాదే వీరు పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం.

Whats_app_banner

సంబంధిత కథనం