OTT: తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్న మలయాళ సూపర్ హిట్ మూవీ.. కన్ఫర్మ్ చేసిన ఓటీటీ ప్లాట్‍ఫామ్-malayalam movie ott varshangalkku shesham will stream in telugu also on sony liv ott platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్న మలయాళ సూపర్ హిట్ మూవీ.. కన్ఫర్మ్ చేసిన ఓటీటీ ప్లాట్‍ఫామ్

OTT: తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్న మలయాళ సూపర్ హిట్ మూవీ.. కన్ఫర్మ్ చేసిన ఓటీటీ ప్లాట్‍ఫామ్

Chatakonda Krishna Prakash HT Telugu
May 29, 2024 09:09 PM IST

Varshangalkku Shesham OTT Release Date: మలయాళ సూపర్ హిట్ సినిమా వర్షంగల్కు శేషం మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. అయితే, తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వస్తుందని ఓటీటీ ప్లాట్‍ఫామ్ తాజాగా క్లారిటీ ఇచ్చింది.

OTT: తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్న మలయాళ సూపర్ హిట్ మూవీ.. కన్ఫర్మ్ చేసిన ఓటీటీ ప్లాట్‍ఫామ్
OTT: తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్న మలయాళ సూపర్ హిట్ మూవీ.. కన్ఫర్మ్ చేసిన ఓటీటీ ప్లాట్‍ఫామ్

Varshangalkku Shesham OTT: మలయాళంలో ఈ ఏడాది విజయాల పరంపరను వర్షంగల్కు శేషం మూవీ కొనసాగించింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‍లాల్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ వర్షంగల్కు శేషం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

ఐదు భాషల్లో..

వర్షంగల్కు శేషం చిత్రం జూన్ 7వ తేదీన సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. స్ట్రీమింగ్ డేట్‍పై ఇటీవల ప్రకటన వచ్చింది. అయితే, తెలుగులో ఈ మూవీ వస్తుందా లేదా అనే విషయాన్ని అప్పుడు సోనీ లివ్ వెల్లడించలేదు. ఈ విషయంపై నేడు (మే 29) క్లారిటీ ఇచ్చింది.

వర్షంగల్కు శేషం మూవీ మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ జూన్ 7వ తేదీన స్ట్రీమింగ్‍కు వస్తుందని సోనీ లివ్ నేడు వెల్లడించింది. నేడు ఓ స్పెషల్ ట్రైలర్ రిలీజ్ చేసిన ఆ ప్లాట్‍ఫామ్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. ఐదు భాషల్లో వస్తుందని స్పష్టత ఇచ్చింది.

వర్షంగల్కు శేషం చిత్రానికి వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. పీరియడ్ కామెడీ లవ్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి మొదటి నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో ప్రణవ్ మోహన్‍లాల్‍తో పాటు ధ్యాన్ శ్రీనివాసన్, కల్యాణి ప్రియదర్శి, నివిన్ పౌలీ, వినీత్ శ్రీనివాసన్, అజు వర్గీస్, బాసిల్ జోసెఫ్, నీరజ్ మాధవ్ కీలకపాత్రలు చేశారు.

వర్షంగల్కు శేషం కలెక్షన్లు

వర్షంగల్కు శేషం సినిమా రూ.83 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. రూ.10కోట్లలోపు బడ్జెట్‍తోనే రూపొందిన ఈ మూవీ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టి బ్లాక్‍బస్టర్ అయింది. ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీలో ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మల్ బాయ్స్, ఆడుజీవితం సూపర్ హిట్ కొట్టగా.. ఆ జాబితాలో వర్షంగల్కు శేషం కూడా చేరింది.

వర్షంగల్కు శేషం చిత్రాన్ని మెరీల్యాండ్ సినిమాస్ బ్యానర్‌పై విశాఖ్ సుబ్రహ్మణ్యం నిర్మించారు. అమృత్ రామ్‍నాథ్ సంగీతం అందించారు. మురళీ విశ్వంభరన్ (ప్రణవ్ మోహన్‍లాల్), వేణు కూతుపరంబు (ధ్యాన్ శ్రీవాసన్) అనే ఇద్దరు స్నేహితుల చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. రెండు విభిన్నమైన టైమ్ పీరియడ్లలో ఈ మూవీ నడుస్తుంది. లవ్ స్టోరీ, కామెడీ, ఫీల్ గుడ్ సీన్లతో ఈ చిత్రం మెప్పిస్తుంది. జూన్ 7వ తేదీన నుంచి మలయాళం, తెలుగు సహా మరో మూడు భాషల్లో సోనీ లివ్ ఓటీటీలో వర్షంగల్కు శేషం చిత్రాన్ని చూడొచ్చు.

ఆడుజీవితంపై నో క్లారిటీ

పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన మలయాళ మూవీ ‘ఆడుజీవితం - ది గోట్‍లైఫ్’ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ దక్కించుకుంది. సర్వైవల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం కూడా రూ.150కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూపర్ హిట్ అయింది. బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ మూవీ థియేటర్లలో మార్చి 28వ తేదీనే రిలీజ్ అయింది. రెండు నెలలైనా ఈ చిత్రం ఇంకా హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రాలేదు. దీంతో ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. జూన్‍లో ఆడుజీవితం చిత్రం స్ట్రీమింగ్‍కు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

టీ20 వరల్డ్ కప్ 2024