Hotstar OTT Top-10: కొనసాగుతున్న మంజుమ్మల్ బాయ్స్ జోరు.. ఇంకా ఫస్ట్ ప్లేస్‍లోనే.. హాట్‍స్టార్ ఓటీటీలో టాప్-10 లిస్ట్ ఇదే-manjummel boys trending top on disney plus hotstar check top 10 list of movies and web series on that ott platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hotstar Ott Top-10: కొనసాగుతున్న మంజుమ్మల్ బాయ్స్ జోరు.. ఇంకా ఫస్ట్ ప్లేస్‍లోనే.. హాట్‍స్టార్ ఓటీటీలో టాప్-10 లిస్ట్ ఇదే

Hotstar OTT Top-10: కొనసాగుతున్న మంజుమ్మల్ బాయ్స్ జోరు.. ఇంకా ఫస్ట్ ప్లేస్‍లోనే.. హాట్‍స్టార్ ఓటీటీలో టాప్-10 లిస్ట్ ఇదే

Chatakonda Krishna Prakash HT Telugu
May 13, 2024 09:56 PM IST

Disney plus Hotstar OTT Top 10: మంజుమ్మల్ బాయ్స్ సినిమా ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. ఇంకా టాప్‍‍లోనే ట్రెండ్ అవుతోంది. హాట్‍స్టార్ ఓటీటీలో ప్రస్తుతం ట్రెండింగ్‍లో ఉన్న సినిమాలు వెబ్ సిరీస్‍లు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

Hotstar OTT Top-10: కొనసాగుతున్న మంజుమ్మల్ బాయ్స్ జోరు.. ఇంకా ఫస్ట్ ప్లేస్‍లోనే.. హాట్‍స్టార్ ఓటీటీలో టాప్-10 లిస్ట్ ఇదే
Hotstar OTT Top-10: కొనసాగుతున్న మంజుమ్మల్ బాయ్స్ జోరు.. ఇంకా ఫస్ట్ ప్లేస్‍లోనే.. హాట్‍స్టార్ ఓటీటీలో టాప్-10 లిస్ట్ ఇదే

Hotstar OTT Top-10 Movies, Web Series: డిస్నీ+హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఎక్కువగా మలయాళం సినిమాలు జోష్ చూపిస్తుంటాయి. ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా కూడా ఈ జాబితాలో చేరింది. థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయి రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం.. ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. స్ట్రీమింగ్‍కు వచ్చి 8 రోజులైనా ఇంకా హాట్‍స్టార్ ఓటీటీలో టాప్‍లోనే ట్రెండ్ అవుతోంది. ఓ తెలుగు మూవీ రెండో ప్లేస్‍లో ఉంది. ప్రస్తుతం (మే 13) హాట్‍స్టార్ ఓటీటీలో టాప్-10లో ట్రెండ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‍లు ఏవంటే..

మంజుమ్మల్ బాయ్స్

మంజుమ్మల్ బాయ్స్ సినిమా మే 5వ తేదీన డిస్నీ ప్లస్ హాట్‍‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మలయాళం, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. చాలా రోజుల నిరీక్షణ తర్వాత భారీ హైప్ ఉన్న ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రావడంతో ఆరంభం నుంచే దుమ్మురేపింది. అడుగుపెట్టిన ఒక్క రోజునే ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చేసింది. చిదంబరం దర్శకత్వం వహించిన మంజుమ్మల్ బాయ్స్ మూవీ థియేటర్లలో రూ.240కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రూ.200 కోట్ల వసూళ్ల మార్క్ దాటిన తొలి మలయాళ మూవీగా చరిత్ర సృష్టించింది. ఇప్పుడు హాట్‍స్టార్ ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. 8 రోజులుగా టాప్‍లో ట్రెండ్ అవుతోంది.

టాప్-5లో తెలుగు మూవీ, వెబ్ సిరీస్

భీమా సినిమా థియేటర్లలో పెద్దగా హిట్ కాకపోయినా హాట్‍స్టార్ ఓటీటీలో దుమ్మురేపుతోంది. గోపీచంద్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఏప్రిల్ 25వ తేదీన హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. తెలుగుతో పాటు మలయాళం, తమిళంలో కూడా అందుబాటులో ఉంది. కొన్నాళ్ల పాటు టాప్‍లో ట్రెండ్ అయిన ఈ చిత్రం ముంజుమ్మల్ బాయ్స్ వచ్చాక.. ఇప్పుడు హాట్‍స్టార్ ఓటీటీలో రెండో ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది. ఇక, సేవ్ ది టైగర్స్ 2 తెలుగు వెబ్ సిరీస్ హాట్‍స్టార్ ఓటీటీలో సత్తాచాటుతూనే ఉంది. మార్చి 15వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ చిత్రం ఇంకా మూడో స్థానంలో ట్రెండ్ అవుతోంది.

డిస్నీ+ హాట్‍స్టార్‌లో ప్రస్తుతం టాప్-10 లిస్ట్ ఇదే

  1. మంజమ్ముల్ బాయ్స్ - మలయాళం సినిమా (5 భాషల్లో స్ట్రీమింగ్)
  2. భీమా - తెలుగు సినిమా (మలయాళం, తమిళ డబ్బింగ్ కూడా..)
  3. సేవ్ ది టైగర్స్ సీజన్ 2 - తెలుగు వెబ్ సిరీస్
  4. సైరన్ - తమిళ మూవీ తెలుగు వెర్షన్
  5. డోరేమాన్ సీజన్ 18 - హిందీ యానిమేషన్ సిరీస్
  6. షించన్ - హిందీ యానిమేషన్ సిరీస్
  7. స్కంద - తెలుగు సినిమా (కన్నడ, మలయాళం, తమిళం వెర్షన్లలోనూ)
  8. లవర్ - తమిళ మూవీ తెలుగు వెర్షన్
  9. రోమాంచం - మలయాళ సినిమా (తెలుగు, హిందీ, తమిళంలోనూ..)
  10. మాలికాపురం - మలయాళం సినిమా (తెలుగు సహా మరో మూడు భాషల్లో..)

ది గోట్ లైఫ్ ఎప్పుడు?

మలయాళం స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఆడు జీవితం - ది గోట్‍లైఫ్ సినిమా స్ట్రీమింగ్ హక్కులను కూడా డిస్నీ+ హాట్‍స్టార్ సొంతం చేసుకుంది. మార్చి 28వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ సర్వైవల్ యాక్షన్ డ్రామా సూపర్ హిట్ అయింది. బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.150కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకుంది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆడుజీవితం సినిమా మే 26వ తేదీన హాట్‍స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కూడా స్ట్రీమింగ్‍కు వచ్చాక దుమ్మురేపే అవకాశాలు మెండుగా ఉన్నాయి.