Telugu News  /  Entertainment  /  Mahesh Babu Thanks All The Fans And Well Wishers Who Wished On His Birthday
మహేష్ బాబు
మహేష్ బాబు (Mahesh Babu twitter)

Mahesh Babu Birthday: ఫ్యాన్స్‌కు థ్యాంక్స్‌ చెప్పిన మహేష్ బాబు

09 August 2022, 21:02 ISTHT Telugu Desk
09 August 2022, 21:02 IST

Mahesh Babu Birthday: టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు మంగళవారం (ఆగస్ట్‌ 9) తన 47వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనకు విషెస్‌ చెప్పిన అందరికీ అతడు ట్విటర్‌ ద్వారా థ్యాంక్స్‌ చెప్పాడు.

టాలీవుడ్‌ ప్రిన్స్‌, హ్యాండ్సమ్‌ హీరో మహేష్‌ బాబు తన 47వ బర్త్‌డేను ఘనంగా జరుపుకున్నాడు. ఐదు పదుల వయసుకు దగ్గర పడుతున్నా.. ఇప్పటికీ ఎంతో ఛార్మింగ్‌గా కనిపిస్తున్నాడు ఈ ప్రిన్స్‌. అప్పుడెప్పుడో రాజకుమారుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అతని అందం పెరిగిందే తప్ప తగ్గలేదు. టాలీవుడ్‌లో మోస్ట్‌ హ్యాండ్సమ్‌ హీరోగా నిలుస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా విషెస్‌ చెప్పిన అందరికీ అతడు ట్విటర్‌ ద్వారా థ్యాంక్స్‌ చెప్పాడు. "డియర్‌ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌, నా శ్రేయోభిలాషులు, సూపర్‌ ఫ్యాన్స్‌. మీ విషెస్‌కు కృతజ్ఞతలు. మీరు చూపించే ప్రేమాభిమానాలను మాటల్లో చెప్పలేను. నేను ఎంతో అదృష్టవంతుడిని. ఈ ఏడాది ఇప్పటివరకూ చాలా అద్భుతంగా ఉంది. భవిష్యత్తు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని మహేష్‌ ట్వీట్‌ చేశాడు.

మెగాస్టార్‌ చిరంజీవి, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ పోతినేని, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లాంటి వాళ్లు మహేష్‌ బాబుకు సోషల్‌ మీడియా ద్వారా విషెస్‌ చెప్పారు. సర్కారు వారి పాటలో అతని పక్కన నటించిన కీర్తి సురేశ్‌ అయితే మహేష్‌, అతని భార్య నమ్రతతో కలిసి తాను దిగిన ఓ ఫొటోను షేర్‌ చేస్తూ విషెస్‌ చెప్పింది.

మరోవైపు మహేష్‌ 47వ పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా పోకిరి స్పెషల్ షోలను వేసిన విషయం తెలిసిందే. మొత్తంగా 175 స్పెషల్‌ షోలతో పోకిరి ఇండియన్‌ సినిమా రికార్డులను కూడా బ్రేక్ చేసింది. ఈ స్పెషల్‌ షోలన్నీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సక్సెసయ్యాడు. వచ్చిన ఆ డబ్బును మహేష్‌ బాబు ఫౌండేషన్‌ ద్వారా చిన్న పిల్లల హార్ట్ సర్జరీలకు ఇవ్వనున్నట్లు ఇప్పటికే ఫ్యాన్స్‌, డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించారు.