Mahesh Babu: పోకిరి స్పెషల్‌ షోస్‌ అన్నీ హౌజ్‌ఫుల్‌.. ఆ డబ్బంతా ఆ పిల్లలకే..-mahesh babus wife namratas instagram post on pokiri special shows gone viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu: పోకిరి స్పెషల్‌ షోస్‌ అన్నీ హౌజ్‌ఫుల్‌.. ఆ డబ్బంతా ఆ పిల్లలకే..

Mahesh Babu: పోకిరి స్పెషల్‌ షోస్‌ అన్నీ హౌజ్‌ఫుల్‌.. ఆ డబ్బంతా ఆ పిల్లలకే..

HT Telugu Desk HT Telugu
Aug 03, 2022 07:22 PM IST

Mahesh Babu: సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు నటించిన పోకిరి మూవీ స్పెషల్‌ షోస్‌ ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ను అలరించనున్న విషయం తెలుసు కదా. ఈ షోస్‌ టికెట్లన్నీ అమ్ముడైపోవడం విశేషం.

పోకిరి మూవీలో మహేష్ బాబు
పోకిరి మూవీలో మహేష్ బాబు (twitter)

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు రేంజ్‌ను ఇంకో లెవల్‌కు తీసుకెళ్లిన మూవీ పోకిరి. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో మహేష్‌ నటించిన ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్ బాక్సాఫీస్‌ రికార్డులన్నింటినీ బ్రేక్‌ చేసింది. సరిగ్గా 16 ఏళ్ల కిందట అంటే 2006లో ఈ సినిమా రిలీజై సంచలన విజయం సాధించింది. ఇప్పుడా పోకిరి మూవీ స్పెషల్‌ షోస్‌ ప్రిన్స్‌ ఫ్యాన్స్‌ను అలరించడానికి వస్తున్నాయి.

వచ్చే మంగళవారం (ఆగస్ట్‌ 9) మహేష్‌ బాబు బర్త్‌డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పోకిరి స్పెషల్‌ షోలు వేస్తున్నారు. ఈ షోలు వేస్తున్న ఫ్యాన్స్‌ అందరికీ థ్యాంక్స చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేసింది మహేష్‌ భార్య నమ్రతా. అంతేకాదు ఈ షోల ద్వారా వచ్చే డబ్బును మహేష్‌ బాబు ఫౌండేషన్‌ ద్వారా పిల్లల హార్ట్‌ సర్జరీలకు ఇవ్వనున్నట్లు కూడా ఈ పోస్ట్‌ ద్వారా వెల్లడించింది.

"సూపర్‌స్టార్ మహేష్‌ బాబు బర్త్‌ డే సందర్భంగా అతని మూవీ పోకిరి స్పెషల్‌ షోలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ప్లాన్‌ చేశాము. ఈ ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఫ్యాన్స్‌ స్పందన అద్భుతం. స్పెషల్‌ షోల టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడైపోయాయి. ఇలాంటి రెస్పాన్స్‌ చూసిన తర్వాత మా ఫ్యాన్స్‌, డిస్ట్రిబ్యూటర్లు ఆ వచ్చిన మొత్తం డబ్బును మహేష్‌ బాబు ఫౌండేషన్‌ ద్వారా చిన్న పిల్లల హార్ట్‌ సర్జరీలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయంలో మమ్మల్ని సపోర్ట్‌ చేసిన ఫ్యాన్స్‌, డిస్ట్రిబ్యూటర్లకు కృతజ్ఞతలు. మహేష్‌ బాబు అడుగుజాడల్లోనే భవిష్యత్తులోనూ ఇలాంటి మరెన్నో మంచి పనులు చేస్తాము" అని ఆ పోస్ట్‌లో రాసి ఉంది.

ఈ ఆగస్ట్‌ 9న మహేష్‌ బాబు బర్త్‌ డే సూపర్‌ స్పెషల్‌ కానుందని అటు ఫ్యాన్స్‌ కూడా అంటున్నారు. ఈ మంచి పని చేపట్టిన ఫ్యాన్స్‌, డిస్ట్రిబ్యూటర్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నమ్రతా ఈ పోస్ట్‌ చేసిన గంటల్లోనే వైరల్‌ అయింది. అంతకుముందు మహేస్ గడ్డంతో ఉన్న ఫొటోను కూడా నమ్రతా తన ఇన్‌స్టాలో షేర్‌ చేసిన విషయం తెలిసిందే.