Janhvi Kapoor: ఆయనో లెజెండ్.. ఎన్టీఆర్‌పై జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు-janhvi kapoor hails ntr and calls him as a legend ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Janhvi Kapoor Hails Ntr And Calls Him As A Legend

Janhvi Kapoor: ఆయనో లెజెండ్.. ఎన్టీఆర్‌పై జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Aug 04, 2022 05:00 PM IST

శ్రీదేవి ముద్దుల తనయ, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసల వర్షం కురిపించింది. అంతేకాకుండా ఆయనో లెజెండ్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగులో ఆయన పక్కన అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని స్పష్టం చేసింది.

జాన్వీ కపూర్
జాన్వీ కపూర్ (Sunil Khandare)

జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి టాలీవుడ్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటన, డ్యాన్స్, పాటలు, ఫైట్లు ఇలా ఏదైన తనదైన శైలిలో పాత్రలో మమేకమయ్యే సామర్థ్యమున్న అతి తక్కువ నటుల్లో ఆయన కూడా ఒకరు. అందుకే తారక్‌తో సినిమా అంటే హీరోయిన్లు, దర్శక, నిర్మాతలు ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. తెలుగులోనే కాదు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నారు. కొమురం భీమ్ పాత్రలో తారక్ నటనకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆర్ఆర్ఆర్‌లో ఆయన నటనను చూసి దీపికా పదుకొణె, ఆలియా భట్ కూడా ప్రశంసలు వర్షం కురిపించారు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ రైజింగ్ స్టార్ జాన్వీ కపూర్ కూడా చేరిపోయింది.

ఎన్‌టీఆర్ పక్కన నటించేందుకు అవకాశమొస్తే చేస్తారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం చెప్పింది. టాలీవుడ్‌లో సినిమా చేయడానికి నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. తెలుగులోనే కాదు ఏ సౌత్ సినిమా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇంక ఎన్టీఆర్ సర్‌తో సినిమా అంటే అది నాకు ఎంతో ప్రత్యేకం. ఆయనో లెజెండ్. దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఆ అవకాశం నా దగ్గరకు రాలేదు. వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను అంటూ జాన్వీ కపూర్.. తారక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

జాన్వీ కపూర్ టాలీవుడ్ హీరోలపై ఈ విధంగా ప్రశంసల వర్షం కురిపించడం ఇదే మొదటి సారి కాదు. గతంలో మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ అంటే క్రష్ అని తన మనస్సులో మాట చెప్పేసింది. అంతేకాకుండా ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలోనూ అతడిపై ఇష్టాన్ని బహిరంగ పరిచింది. తాజాగా ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో NTR 30 అనే సినిమా చేస్తున్నారు. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇది కాకుండా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ తారక్ NTR 31 అనే మరో చిత్రం చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు ఓకే చెప్పారు మన యంగ్ టైగర్. ఈ ఇద్దరి దర్శకులతో రానున్న ఈ సినిమాలపై ఎన్టీఆర్ అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి.

 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.