Chiranjeevi: కంటెంట్ బాగుంటే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు -బింబిసార‌, సీతారామం సక్సెస్ లపై చిరంజీవి ట్వీట్‌-chiranjeevi appreciated the team of sitaramam and bimbisara ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi: కంటెంట్ బాగుంటే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు -బింబిసార‌, సీతారామం సక్సెస్ లపై చిరంజీవి ట్వీట్‌

Chiranjeevi: కంటెంట్ బాగుంటే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు -బింబిసార‌, సీతారామం సక్సెస్ లపై చిరంజీవి ట్వీట్‌

HT Telugu Desk HT Telugu
Aug 06, 2022 10:04 AM IST

బింబిసార‌ (Bimbisara),సీతారామం (Sita Ramam) విజ‌యాలు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి ఊర‌ట‌ను,ఉత్సాహాన్నిచ్చాయ‌ని అన్నారు అగ్ర హీరో చిరంజీవి (Chiranjeevi). ఆయా సినిమా టీమ్‌ల‌ను అభినందిస్తూ శ‌నివారం చిరంజీవి ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

<p>చిరంజీవి</p>
చిరంజీవి (twitter)

గ‌త రెండు నెల‌లుగా టాలీవుడ్‌లో బ్యాడ్‌టైమ్ న‌డుస్తోంది. జూన్‌,జూలై నెల‌ల్లో విడుద‌లైన సినిమాలు ఏవీ స‌క్సెస్‌గా నిల‌వ‌లేక‌పోయాయి. ఈ వ‌రుస ప‌రాజ‌యాల‌తో డీలా ప‌డిన టాలీవుడ్‌కు శుక్ర‌వారం రిలీజ్ అయిన సీతారామం,బింబిసార సినిమాలు ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ సినిమాల మౌత్ టాక్ తో పాటు వ‌సూళ్లు బాగుండ‌టంతో టాలీవుడ్ వ‌ర్గాలు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ సినిమా విజ‌యాల్ని పుర‌స్క‌రించుకొని చిత్ర యూనిట్‌పై ప‌లువురు స్టార్స్‌,ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నాయి.

తాజాగా బింబిసార‌,సీతారామం టీమ్‌ల‌ను అగ్ర‌హీరో చిరంజీవి అభినందించారు. ఈ మేర‌కు శ‌నివారం చిరంజీవి ఓ ట్వీట్ చేశారు. ‘ప్రేక్ష‌కులు సినిమా థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌ని బాధ‌ప‌డుతున్న ఇండ‌స్ట్రీకి ఎంతో ఊర‌ట‌ను, మ‌రింత ఉత్సాహాన్నిస్తూ కంటెంట్ బాగుంటే ప్రేక్ష‌కులెప్పుడూ ఆద‌రిస్తార‌ని మ‌రోసారి నిరూపిస్తూ నిన్న విడుద‌లైన చిత్రాలు రెండూ విజ‌యం సాధించ‌డం ఎంతో సంతోషక‌రం. ఈ సంద‌ర్భంగా సీతారామం,బింబిసార చిత్రాల న‌టీన‌టులు,సాంకేతిక నిపుణులంద‌రికీ నా మ‌నఃపూర్వ‌క శుభ‌కాంక్ష‌లు’ అంటూ చిరంజీవి ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు.

చిరంజీవి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. బింబిసార చిత్రంలో క‌ళ్యాణ్‌రామ్ హీరోగా న‌టించారు. వ‌శిష్ట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సీతారామం సినిమాలో దుల్క‌ర్ స‌ల్మాన్‌,మృణాళ్ ఠాకూర్‌,ర‌ష్మిక మంద‌న్న కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Whats_app_banner